దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ స్వల్ప లాభాలతోనూ, నిఫ్టీ ఫ్లాట్‌గానూ ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల్లోకి వెళ్లిన సెన్సెక్స్ అనంతరం ఒడుదొడుకులకు లోనై చివరికి 59.28 పాయింట్లు లాభపడి 31,648 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 4.90 పాయింట్లు నష్టపోయి 9,261.85 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, కొవిడ్-19 కారణంగా మదుపరులు ఆచితూచి వ్యవహరించారు.
లాభనష్టాల్లో....
నిఫ్టీలో టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, సన్‌ఫార్మా, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఇన్ఫ్రాటెల్, గ్రాసిమ్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
రంగాల వారీగా చూస్తే ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎనర్జీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించగా.. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్ షేర్లు అమ్మకాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. త్రైమాసిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో ఇన్ఫోసిస్ షేర్లు మూడు శాతం మేర లాభపడడం గమనార్హం.
రూపాయి...
డాలరుతో రూపాయి మారకం విలువ 76.53గా ఉంది.