Stock Market Today 6th December 2023 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ తమ రికార్డులను తామే బ్రేక్ చేసుకుంటూ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 166 పాయింట్లు లాభపడి 69,462 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 55 పాయింట్లు వృద్ధి చెంది 20,910 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : నెస్లే ఇండియా, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, విప్రో, సన్‌ఫార్మా, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ (ప్రత్యేకంగా ఆదానీ గ్రూప్ స్టాక్స్ అన్నీ మంచి లాభాలతో ట్రేడవుతున్నాయి.)
- నష్టాల్లో కొనసాగుతున్న షేర్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ బ్యాంక్, మారుతి సుజుకి, భారతీ ఎయిర్టెల్
సెంటిమెంట్ బలపడుతోంది!
యూఎస్ బాండ్ ఈల్డ్స్ తగ్గడం, దేశ స్థూల ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం, దేశంలో రాజకీయ స్థిరత్వం కొనసాగే సూచనలు కనిపిస్తుండడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆర్బీఐ ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లు పెంచకపోవచ్చని భావిస్తున్నారు. ఇది కూడా మార్కెట్లకు మంచి ఊతం ఇస్తోంది.
విదేశీ పెట్టుబడుల వెల్లువ!
దేశంలో విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) రూ.5,223.51 కోట్లు విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లు
మంగళవారం యూఎస్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. ఇవాళ ఆసియా మార్కెట్లు హ్యాంగ్ సెంగ్, నిక్కీ లాభాల్లో కొనసాగుతుండగా, చైనీస్ 'షాంఘై' ఇవాళ ట్రేడింగ్ జరపడం లేదు. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు కూడా మిక్స్డ్ ట్రెండ్‌తో కొనసాగుతున్నాయి.
రూపాయి విలువ
Rupee Open 6th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.35గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices 6th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.13 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 77.30 డాలర్లుగా ఉంది.
భారీగా దిగివస్తున్న గోల్డ్, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?
రోజుకు రూ.5కోట్లు జీతం - ఆమె చెప్పిన ఒక్క మాటతో సుందర్ కథ సూపర్ హిట్!