Stock markets: దేశీయ స్టాక్ మార్కెట్లు.. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రోజున భారీ లాభాలను ఘడించాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ బ్యాంకు, ఆయిల్, గ్యాస్, విద్యుత్తు, స్థిరాస్తి రంగాల దూకుడుతో క్రమంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లకు మదుపరులు మొగ్గు చూపగా.. సెన్సెక్స్ 700 పాయింట్ల మేర లాభపడింది. నిఫ్టీ 200లకుపైగా వృద్ధి చెందింది.
- ముంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ- సెన్సెక్స్ 708 పాయింట్ల లాభంతో 59,276 వద్ద స్థిరపడింది.
- జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ - నిఫ్టీ 206 పాయింట్లు వృద్ధి చెంది 17,670 వద్ద ముగిసింది.
లాభనష్టాల్లోనివి: ఎన్టీపీసీ షేర్లు 6 శాతం మేర లాభపడ్డాయి. బీపీసీఎల్ 4 శాతం, పవర్ గ్రిడ్ 4 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.5శాతం, ఎస్బీఐ 3.1 శాతం మేర లాభాల్లోకి వెళ్లాయి. మరోవైపు.. హీరో మోటోకార్ప్ 2.4 శాతం మేర నష్టపోయింది. టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, టైటాన్ కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి.