ETV Bharat / business

మూడు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 230 ప్లస్​

Stock Market Close: మూడు వరుస సెషన్ల నష్టాల అనంతరం.. స్టాక్​ మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్ 230, నిఫ్టీ 69 పాయింట్లు పెరిగాయి.

Stock Market Close
Stock Market Close
author img

By

Published : Mar 28, 2022, 3:47 PM IST

Stock Market Close: దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు నేడు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. చివరకు లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 231 పాయింట్లు పెరిగి 57 వేల 593 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 69 పాయింట్ల లాభంతో 17 వేల 222 వద్ద సెషన్​ను ముగించింది. ఆటో, బ్యాంకింగ్​, లోహం, రియాల్టీ, ఆయిల్​ అండ్​ గ్యాస్​ రంగాలు రాణించాయి. ఐటీ, ఫార్మా రంగం షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత విమానాల రాకపోకలు ప్రారంభమవ్వడం, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్​బీఐ ప్రకటన, రష్యా- ఉక్రెయిన్​ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగా ట్రేడయినట్లు నిపుణులు చెబుతున్నారు.

  • సెన్సెక్స్​ 110 పాయింట్ల లాభంతో సెషన్​ను ప్రారంభించి.. కాసేపటికే నష్టాల్లోకి మళ్లింది.
  • ఓ దశలో 500 పాయింట్లకుపైగా కోల్పోయి 56 వేల 825 వద్ద సెషన్​ కనిష్ఠాన్ని నమోదుచేసింది.
  • మధ్యాహ్నం ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడటం వల్ల లాభాల్లోకి వచ్చాయి. 270 పాయింట్లకుపైగా పెరిగి మళ్లీ 57 వేల 638 వద్ద గరిష్ఠాన్ని తాకింది.
  • లాభనష్టాల్లో: భారతీ ఎయిర్​లెట్​, కోల్​ ఇండియా, యాక్సిస్​ బ్యాంక్​, ఐచర్​ మోటార్స్​, ఎస్​బీఐ, ఐటీసీ లాభాలు నమోదుచేశాయి. యూపీఎల్​, నెస్లే ఇండియా, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్​, ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​, హెచ్​డీఎఫ్​సీ డీలాపడ్డాయి.

ఇవీ చూడండి: ఆ రెండూ విలీనం.. మల్టీప్లెక్స్​ వ్యాపారంలో ఇక వాటిదే హవా

మళ్లీ పెరిగిన చమురు ధరలు.. వారం రోజుల్లో ఆరో సారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.