ETV Bharat / business

Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice : ఈ మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా..? మీకు ఐటీ నోటీసులు పక్కా..! - ఐటీ నోటీసులు 5 ప్రత్యేక సందర్భాలు

Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice : మీరు పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరుపుతున్నారా? ముఖ్యంగా.. ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా..? అయితే ఈ హెచ్చరిక మీకోసమే. ఐటీ శాఖ నుంచి ఏ క్షణమైనా నోటీసులు అందుకోవాల్సి రావొచ్చు..!

These 5 Cash Transactions Could Land You an IT Notice
Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 11:36 AM IST

Stay Alert! These 5 Cash Transactions Could Land You an IT Notice : గతంలో ఏ పనికైనా నగదు లావాదేవీలు జరిగేవి. కానీ.. ఇప్పుడు డిజిటల్​ ట్రాన్సాక్షన్స్ రాజ్యం నడుస్తోంది. దీంతో.. ప్రతిదీ రికార్డ్ అవుతోంది. "పెద్ద" వ్యవహారాలపై ఐటీ అధికారులు వెంటనే నిఘా పెడుతున్నారు. మరీ ముఖ్యంగా.. ఒక 5 రకాల లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేకంగా దృష్టిపెడుతోంది. మరి, అవేంటి..? అన్నది ఇప్పుడు చూద్దాం.

ఐటీ నోటీసులు పంపేందుకు అవకాశం ఉన్న టాప్ 5 నగదు లావాదేవీలివే..

These 5 Cash Transactions Could Land You an IT Notice :

బ్యాంక్ ఎఫ్​డీ (Fixed Deposit) : ఎవరైనా ఖాతాదారుడు.. బ్యాంకులో డిపాజిట్ చేసే నగదు.. రూ.10 లక్షలకు మించకూడదు. అంతకుమించి డిపాజిట్ చేసే వారిపై ఆదాయపు పన్ను శాఖ కన్నేస్తుంది. అంత భారీ మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలపై వివరణ అడుగొచ్చు.

పొదుపు / క‌రెంట్ అకౌంట్( Savings Account Deposits) : ఒక ఆర్థిక సంవత్సరంలో ఎవరైనా పొదుపు ఖాతాలో(Savings Account) నగదు డిపాజిట్ రూ.10 లక్షల కంటే ఎక్కువగా చేస్తే.. ఐటీ శాఖ ప్రశ్నించవచ్చు. కరెంట్ ఖాతాదారులకు ఈ పరిమితి ₹50 లక్షలుగా ఉంది. ఈ పరిమితిని దాటినప్పుడు ఆదాయపు పన్ను నోటీసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Got An Income Tax Notice Dont Panic Take These Actions: ITR ఫైల్​ చేసిన తర్వాత నోటీసు వచ్చిందా..? అయితే ఇలా చేయండి..!

క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు (Credit Card Bill Payment) : ప్రస్తుత రోజుల్లో శాలరీ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ దాదాపుగా క్రెడిట్ కార్డులను కలిగి ఉన్నారు. అయితే.. ఎవరైనా ఒకేసారి రూ.లక్ష కంటే ఎక్కువ నగదును ఈ క్రెడిట్ కార్డు బిల్లు(Credit Card Bill) చెల్లింపు కోసం వినియోగిస్తే.. వారిని ఐటీ అధికారులు ప్రశ్నించవచ్చు. అదేవిధంగా.. ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లును నగదు రూపంలో చెల్లిస్తే.. ఆదాయపు పన్ను అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయవచ్చు.

రియల్ ఎస్టేట్ (Real Estate) : ఆస్తి రిజిస్ట్రేషన్​ కోసం ఎవరైనా నగదు రూపంలో పెద్ద లావాదేవీలు చేసినా.. అలాంటి వాటిని ఐటీ శాఖ గమనిస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఒప్పందంలో రూ.30 ల‌క్ష‌ల‌ు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తిని నగదు రూపంలో చెల్లింపు చేసినట్లయితే.. ఆ సమాచారం రిజిస్ట్రార్ తరపున ఐటీ శాఖకు తప్పక వెళ్తుంది. ఇలాంటి సందర్భంలో ఆదాయపు పన్ను అధికారులు సదరు వ్యక్తికి నోటీసులు పంపుతారనే విషయం మీరు గుర్తుంచుకోవాలి.

స్టాక్ మార్కెట్ / మ్యూచువల్ ఫండ్ / బాండ్ / డిబెంచర్(Investments) : పైన తెలిపిన పెట్టుబడుల నుంచి పొందిన నగదును.. బ్యాంకు అకౌంట్​లో వేసి అందులో నుంచి మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్, డిబెంచర్లలో పెట్టుబడులు పెట్టే వ్యక్తులు కూడా ఐటీకి సమాధానం చెప్పాల్సి వస్తుంది. రూ. 10 లక్షలకు మించి ఇన్వెస్ట్​మెంట్ చేస్తే.. మీ చివరి ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్)ను అధికారులు తనిఖీ చేస్తారు. అందువల్ల.. పెట్టుబడి పెట్టే ముందే.. పరిమితులు, రూల్స్ గురించి తెలుసుకోవడం మంచిది.

ITR Refunds Big Update : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఐటీ రిఫండ్​పై కీలక ప్రకటన!

ITR Revalidation Status Check : ఐటీఆర్​ రీఫండ్​ ఇంకా రాలేదా?.. మీ బ్యాంక్​ ఖాతాను రీ-వ్యాలిడేట్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.