Rent a boyfriend in Bangalore : గంటల లెక్కన మీకు కావలసిన బాయ్ ఫ్రెండ్‌ను బాడుగకు ఇస్తామంటూ బెంగళూరులో కొందరు టెకీలు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించడం సంచలనంగా మారింది. ప్రియుడు వంచించాడనో, ప్రేమ విఫలమైందనో, నిజమైన ప్రేమ దక్కలేదనో వ్యథకు గురైన వారికి 'టాయ్ బాయ్' పేరిట వీరు ఒక పోర్టల్‌ను ప్రారంభించారు. కాకపోతే ఆ 'బాయ్' ఎవరి వద్దకూ భౌతికంగా రాడు. ఫోన్ ద్వారా వారి సమస్యను పూర్తిగా విని మానసిక ఆందోళనను దూరం చేసేందుకు సహకారం అందిస్తాడని పోర్టల్‌ను అభివృద్ధి చేసిన కౌశల్ ప్రకాశ్ తెలిపారు. దీనినొక స్టార్టప్‌గా తాము రూపొందించామని, దీంతోపాటు ఆర్‌ఏబీఎఫ్ అనే యాప్‌ను అభివృద్ధి చేశామని ఆయన పేర్కొన్నారు.
తమ పోర్టల్, యాప్‌లోని సేవలను నిర్ణీత రుసుము చెల్లించి, వినియోగించుకోవలసి ఉంటుందని వివరించారు ప్రకాశ్. మానసిక సమస్యలు, ఒంటరితనంతో బాధపడేవారికి సానుకూల వచనాలతో ధైర్యం చెప్పడానికి, కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఇప్పటికే చాలా వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రేమలో విఫలమైన యువతులకు ఉద్దేశించి 'టాయ్ బాయ్' పేరుతో అబ్బాయిలను అద్దెకు (ఫోన్ ద్వారా) ఇస్తామనడమే ఇక్కడ వివాదాస్పదంగా మారింది. దీని మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
సింహం బిర్యానీ, పులి పకోడీ.. రుచి చూసేందుకు గెట్ రెడీ..
స్టార్టప్‌లు ఇలాంటి వినూత్న ఆలోచనలతో వ్యాపారం ప్రారంభించడం కొత్తేమీ కాదు. ప్రిమేవల్ ఫుడ్స్ అనే సంస్థ ఇటీవల అలాంటి పనే చేసింది. 'వీటిని కూడా తింటారా?' అని జనం అనుకునే జంతువులపై దృష్టిపెట్టింది. సింహం బర్గర్.. పులి మాంసం నగ్గెట్స్.. ఏనుగు నూనెతో చేసిన క్రీమీ చీజ్‌కేక్.. జీబ్రా సుషీ రోల్స్.. జిరాఫీ హ్యామ్.. అంటూ సరికొత్త మెనూ సృష్టించింది. ఇంతకీ.. ఇలా చేయడం చట్టబద్ధమేనా? తెలుసుకోవాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.