Small Savings Scheme KYC Deadline : స్మాల్ సేవింగ్స్ అకౌంట్ (చిన్న పొదుపు ఖాతా) ఖాతాదారులకు అలెర్ట్. 2023 సెప్టెంబర్ 30లోపు మీరు కచ్చితంగా ఆధార్, పాన్ కార్డులను సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు గడువులోగా కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే.. మీ ఖాతాలు సస్పెండ్ అయిపోతాయి. మీరు కనుక ఇప్పటికే కేవైసీ చేసుకుని ఉంటే.. ఆధార్, పాన్ కార్డ్‌లను మరలా సమర్పించాల్సిన అవసరం లేదు.
తప్పనిసరి!
Deadline To Link Aadhaar PAN With Small Saving Schemes : కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ 2023 మార్చి 31న చిన్న పొదుపు ఖాతాదారులు అందరూ కచ్చితంగా ఆధార్, పాన్ డాక్యుమెంట్స్ సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎవరు సమర్పించాలి!
చిన్న పొదుపు ఖాతాలు తెరచినప్పుడు ఎవరైతే ఆధార్, పాన్‌కార్డ్‌లను సమర్పించలేదో.. వాళ్లు ఇప్పుడు కచ్చితంగా వాటిని సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గడువులోగా.. తమ పొదుపు ఖాతాలు ఉన్న బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లేదా సంస్థల్లో వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
వాళ్లకు అవసరం లేదు!
కేంద్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1 నుంచి స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరిన ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డ్ సమర్పించడం తప్పనిసరి చేసింది. ఇవి లేకుండా వాళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ అకౌంట్స్ ఓపెన్ చేయలేరు. దీనిని మరోవిధంగా చెప్పాలంటే.. 2023 ఏప్రిల్ 1 తరువాత చిన్న పొదుపు ఖాతాలు తెరచినవారు.. ఇప్పుడు మరలా ఆధార్, పాన్ సమర్పించాల్సిన అవసరం లేదు.
ఆధార్, పాన్ ఇవ్వకపోతే ఏమౌతుంది?
ఒక వేళ ఎవరైనా గడువులోగా ఆధార్, పాన్ సమర్పించకుండా ఉంటే.. వారి ఖాతాలు సెప్టెంబర్ 31 తరువాత సస్పెండ్ అవుతాయి. ఫలితంగా సదరు ఖాతాదారులు తమ అకౌంట్ ద్వారా నగదు లావాదేవీలు చేయడానికి వీలుపడదు. ఎప్పుడైతే.. వాళ్లు తమ ఆధార్, పాన్లను సమర్పించి, కేవైసీ పూర్తి చేస్తారో.. మరలా అప్పుడే ఆ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ యాక్టివేట్ అవుతుంది.
ముఖ్యమైన స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్!
Small Savings Schemes In India : వివిధ రకాలైన పోస్టు ఆఫీస్ పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్స్ (FD), రికరింగ్ డిపాజిట్స్ (RD), పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, టైమ్ డిపాజిట్స్ (TD), మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర (KVP). మీరు కూడా ఆయా పథకాల్లో పొదుపు చేస్తూ ఉంటే.. కచ్చితంగా సెప్టెంబర్ 30లోపు ఆధార్, పాన్ కార్డులు సమర్పించి కేవైసీ పూర్తి చేసుకోవడం ఉత్తమం.