ETV Bharat / business

అలర్ట్ - చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో మారిన రూల్స్ - మీరు తెలుసుకోవాల్సిందే! - senior citizen savings schemes

New Rules in Small Saving Schemes: మీరు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్​ చేయాలనుకుంటున్నారా..? లేదంటే.. ఇప్పటికే పొదుపు చేశారా..? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఈ పథకాల నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

New Rules in Small Saving Schemes
New Rules in Small Saving Schemes
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 5:29 PM IST

Small Saving Schemes New Rules in Telugu: ఇటీవల కాలంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో డబ్బులు ఇన్వెస్ట్​ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో.. కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త కొత్త మార్పులు ప్రవేశపెడుతోంది. తాజాగా.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), టైమ్ డిపాజిట్ స్కీమ్‌తో సహా వివిధ చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించింది. నవంబర్ 9 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ప్రస్తుతం కేంద్రం తొమ్మిది రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను అందిస్తోంది. ఆ స్కీమ్స్‌లో మార్పులను ఆర్థిక వ్యవహారాల శాఖ నోటిఫై చేసింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 9 స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్​లో.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన ‍‌(SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC), కిసాన్ వికాస్ పత్ర (KVP), పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (POTD), అటల్ పెన్షన్ యోజన (APY), ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) ఉన్నాయి. ప్రతి పథకానికీ వేర్వేరు ఫీచర్లు, పదవీకాలాలు, వడ్డీ రేట్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో మారిన రూల్స్​ను పరిశీలిస్తే..

పోస్టాఫీసులో ఇన్ని పొదుపు పథకాలా? ఏ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేసినా సూపర్ బెనిఫిట్స్​!

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో మారిన రూల్‌: సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌ కోసం కొత్త నిబంధనను ఆర్థిక శాఖ తీసుకొచ్చింది. కొత్త రూల్‌ ప్రకారం.. ఈ ఖాతా తెరవడానికి ఉన్న సమయాన్ని మూడు నెలలకు పొడిగించారు. గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఒక వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను స్వీకరించిన తేదీ నుంచి మూడు నెలల లోపు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఖాతాను తెరవొచ్చు. ఇప్పటి వరకు ఈ వ్యవధి ఒక నెల మాత్రమే. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందిన తేదీని ఖాతా ఓపెనింగ్‌ సమయంలో రుజువుగా చూపాలి.

How to Become Millionaire With Daily Savings of Rs.500: 15*15*15 ఫార్ములా తెలుసా? కోటీశ్వరులు ఫాలో అయ్యే సూత్రం ఇదే..!

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్: నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ స్కీమ్​లో ముందస్తు ఉపసంహరణ నియమాల్లో కొన్ని మార్పులు జరిగాయి. నోటిఫికేషన్​ ప్రకారం.. ఐదేళ్ల ఖాతా కోసం డిపాజిట్‌ ఖాతా తెరిచి, ఆ మొత్తం మెచ్యూర్‌ కాకముందే నాలుగు సంవత్సరాల తర్వాత ఉపసంహరించుకుంటే.. పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు వర్తించే రేటుతో వడ్డీని చెల్లిస్తారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. డిపాజిట్ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల తర్వాత ఖాతాను మూసివేస్తే, మూడేళ్ల డిపాజిట్‌కు వర్తించే వడ్డీ రేటును మాత్రమే చెల్లించేవారు.

PPFలో కొత్త రూల్: నోటిఫికేషన్ ప్రకారం.. PPF పథకాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (సవరణ) పథకం -2023 అని పిలుస్తారు.

పన్ను మినహాయింపు: ఈ పథకాల్లోని కొన్నింటిలో పెట్టుబడి పెడితే పన్ను ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు లభిస్తాయి. SCSS, PPF వంటి వాటికి IT చట్టంలోని సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.

Best Child Savings Investment Plan : రోజుకు రూ.167 చాలు.. పిల్లల చదువులు, పెళ్లి కోసం.. రూ.50 లక్షలు పొందండి..!

Small Saving Schemes Revised Interest Rates 2023 : పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..? వడ్డీరేట్లు చూసుకున్నారా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.