ETV Bharat / business

HCL శివ్‌ నాడార్‌ విరాళం రోజుకు రూ.3 కోట్లు.. తర్వాత స్థానాల్లో ముకేశ్​, ప్రేమ్​జీ.. మరి అదానీ?

author img

By

Published : Oct 21, 2022, 6:22 AM IST

వితరణ విషయంలో దేశంలోనే అగ్రగామిగా హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌ నిలిచారు. ఆయన ఏడాది వ్యవధిలో రూ.1161 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు. అంటే రోజుకు రూ.3 కోట్ల చొప్పున దానం చేశారన్నమాట

shiva nadar
shiva nadar

Shiv Nadar Philanthropy: హెచ్‌సీఎల్‌ వ్యవస్థాపకుడు శివ్‌నాడార్‌(77), వితరణ విషయంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచారు. గురువారం వెల్లడైన ఎడెల్‌గివ్‌ హురున్‌ ఇండియా దాతృత్వ జాబితా-2022 ప్రకారం.. ఆయన ఏడాది వ్యవధిలో రూ.1161 కోట్ల మేర సమాజానికి తిరిగి ఇచ్చేశారు. అంటే రోజుకు రూ.3 కోట్ల చొప్పున దానం చేశారన్నమాట. విప్రో వ్యవస్థాపకుడు అజీమ్‌ ప్రేమ్‌జీ(77) రూ.484 కోట్ల విరాళంతో రెండో స్థానంలో నిలిచారు. గతంలో వరుసగా రెండేళ్లు ప్రేమ్‌జీ అగ్రస్థానంలో ఉన్నారని ఆ జాబితా గుర్తు చేసింది. ముకేశ్‌ అంబానీ కుటుంబం(రూ.411 కోట్లు) మూడో స్థానం; బిర్లా కుటుంబం (రూ.242 కోట్లు) నాలుగో స్థానంలో ఉండగా.. దేశీయ కుబేరుల్లో తొలిస్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ(60) రూ.190 కోట్ల దాతృత్వంతో ఈ జాబితాలో ఏడో స్థానంలో నిలిచారు. జాబితా విశేషాలు..

  • ఏడాది కాలంలో రూ.100 కోట్లకు పైగా వితరణ చేసిన వారు దేశంలో 15 మంది ఉన్నారు. 20 మంది రూ.50 కోట్ల పైన; 43 మంది రూ.20 కోట్లపైగా దానం చేశారు.
  • లార్సెన్‌ అండ్‌ టూబ్రో(ఎల్‌ అండ్‌ టీ) గ్రూప్‌ ఛైర్మన్‌ ఎ.ఎం. నాయక్‌(80) రూ.142 కోట్ల విరాళం ద్వారా, దేశంలోనే అత్యంత దానశీలి అయిన ప్రొఫెషనల్‌ మేనేజర్‌గా నిలిచారు. ఈ జాబితాలో బెయిన్‌ క్యాపిటల్‌ ఇండియాకు చెందిన అమిత్‌ చంద్ర, అర్చన చంద్ర మాత్రమే ఇతర ప్రొఫెషనల్‌ మేనేజర్లు. వీరిద్దరూ రూ.24 కోట్ల చొప్పున ఇచ్చారు.
  • జెరోధాకు చెందిన నితిన్‌ కామత్‌, నిఖిల్‌ కామత్‌ తమ విరాళాలను 300 శాతం పెంచి రూ.100 కోట్లకు చేర్చడం విశేషం. నిఖిల్‌ కామత్‌(36) ఈ జాబితాలోనే అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు.
  • మైండ్‌ట్రీ సహ వ్యవస్థాపకులు సుబ్రోతో బాగ్చి, ఎన్‌.ఎస్‌. పార్థసారధి రూ.213 కోట్లు చొప్పున దానం చేయడం ద్వారా టాప్‌-10లో నిలిచారు.
  • ఇన్ఫీకి చెందిన నందన్‌ నీలేకని, క్రిస్‌ గోపాలకృష్ణన్‌, ఎస్‌.డి. శిబూలాల్‌లు వరుసగా రూ.159 కోట్లు; రూ.90 కోట్లు; రూ.35 కోట్ల విరాళాలు ఇవ్వడం ద్వారా జాబితాలో 9వ, 16వ, 28వ స్థానాల్లో నిలిచారు.

తొలిసారిగా జాబితాలోకి..
తొలిసారిగా ఈ జాబితాలో చేరిన క్వెస్‌ కార్ప్‌ ఛైర్మన్‌ అజిత్‌ ఐజాక్‌ రూ.105 కోట్లను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌(ఐఐఎస్‌సీ) బెంగళూరుకు ఇచ్చారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సహ ప్రమోటరు రాకేశ్‌ గంగ్వాల్‌ సైతం రూ.100 కోట్లను ఐఐటీ కాన్పూర్‌లోని స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి వ్యక్తిగత విరాళం రూపంలో ఇచ్చి, ఈ జాబితాలో తొలిసారిగా చేరారు. తొలిసారిగా ఈ జాబితాలో చేరిన 19 మంది కలిసి రూ.832 కోట్లు సమాజానికి ఇచ్చారు.

రూ.100 కోట్ల వీరులు పెరిగారు
గత అయిదేళ్లలో రూ.100 కోట్లకు పైగా విరాళాలిచ్చిన దాతల సంఖ్య ఇద్దరి నుంచి 15 కు పెరిగింది. రూ.50 కోట్లకు పైగా విరాళం ఇచ్చిన వారి సంఖ్య 5 నుంచి 20కి చేరింది. వచ్చే అయిదేళ్లలో ఈ సంఖ్య రెట్టింపు కావొచ్చని అంచనా. గత అయిదేళ్లలో రూ.10 కోట్లకు పైగా ఇచ్చిన వారు 37 నుంచి 80కి చేరారు.

మహిళలు ఆరుగురు
రోహిణి నీలేకని రూ.120 కోట్లతో అత్యంత వితరణశీలి అయిన మహిళగా జాబితాలో నిలిచారు. లీనా గాంధీ తివారీ(రూ.21 కోట్లు), అను ఆగా(రూ.20 కోట్లు), మంజు డి.గుప్తా, రేణు ముంజాల్‌, కిరణ్‌ మజుందార్‌ షా కూడా ఉన్నారు.

కొవిడ్‌ ఉపశమన చర్యలకే ఎక్కువ
కరోనా పరిణామాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలకు వచ్చిన విరాళాలు 44 శాతం పెరిగాయి. విద్య కోసం 51 మంది (స్వయం కృషితో ఎదిగినవారు) విరాళాలు ఇచ్చారు. దాతల సగటు వయసు 69గా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది రెండేళ్లు పెరిగింది.

ముంబయిదే పైచేయి
విరాళాలు ఇచ్చిన వ్యక్తుల నివాస ప్రాంతాన్ని అనుసరించి చూస్తే.. జాబితాలో 33 మంది ముంబయి నుంచే ఉన్నారు. దిల్లీ(16%), బెంగళూరు(13%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఔషధ రంగం (20%) నుంచి ఎక్కువ మంది దాతలు ఉండగా.. రసాయనాలు-పెట్రో రసాయనాల రంగం నుంచి 11% కనిపించారు.

ఇవీ చదవండి: గూగుల్​కు భారీ షాక్.. రూ.1337.76 కోట్ల జరిమానా విధించిన సీసీఐ!

రోల్స్ రాయిస్ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు ధర తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.