SBI Salary Account Benefits : బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు, వారిని దీర్ఘకాలంపాటు నిలుపుకునేందుకు అనేక వ్యూహాత్మక చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులు తమ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ ఓపెన్ చేసేలా ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇందుకోసం ఉద్యోగులకు అనేక ప్రత్యేక సదుపాయాలను, ఇతర బెనిఫిట్స్‌ను అందిస్తూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉద్యోగులకు ప్రత్యేక శాలరీ అకౌంట్లను కల్పిస్తోంది. అంతే కాదు వీటి ద్వారా తమ కస్టమర్లకు చాలా బెనిఫిట్స్‌ను, ప్రత్యేక సౌకర్యాలను అందిస్తోంది.
ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అంటే ఏమిటి?
SBI Salary Package Account : ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ అనేది ఉద్యోగులకు మాత్రమే కల్పిస్తున్న ఒక ప్రత్యేకమైన పొదుపు పథకం. దీని ద్వారా ఉద్యోగులకు ప్రత్యేకమైన బెనిఫిట్స్, ఫీచర్స్, సర్వీసెస్ అందిస్తారు. అలాగే నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ఫెసిలిటీ కూడా కల్పిస్తారు. దీని ద్వారా ఉద్యోగులు తమ బ్యాంకింగ్ అవసరాలు తీర్చుకోవడం సహా, సమర్థవంతంగా ఆర్థిక నిర్వహణ చేసుకోవడానికి వీలవుతుంది.
ఎస్బీఐ శాలరీ అకౌంట్ ప్రయోజనాలు ఏమిటి?
SBI Salary Package Account Benefits : ఉద్యోగులు తాము ఎంచుకున్న ప్యాకేజీ ఆధారంగా వారికి వచ్చే బెనిఫిట్స్, ఫీచర్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని కీలకమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం.
- జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు.
- నెలవారీ సగటు బ్యాలెన్స్ ఛార్జీలు ఉండవు.
- ఆటో స్వీప్ సౌకర్యం (ఇది పూర్తిగా ఐచ్ఛికం)
- ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన ఉచిత డెబిట్ కార్డ్
- డిమాండ్ డ్రాఫ్ట్ జారీపై ఛార్జీలు మినహాయింపు
- ఇండియాలోని అన్ని ఎస్బీఐ, ఇతర బ్యాంక్ ATMల్లో అపరిమిత లావాదేవీలు జరుపుకునే సౌకర్యం
- నెలకు 25 చెక్ లీవ్‌ల వరకు మల్టీ సిటీ చెక్‌ల జారీపై రుసుము మినహాయింపు
- ఆల్‌లైన్ RTGS/ NEFT ఛార్జీల మినహాయింపు
- కాంప్లిమెంటరీ పర్సనల్/ ఎయిర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్
- తక్కువ వడ్డీ రేటుతో వ్యక్తిగత, గృహ, వాహన రుణాలు అందించడం
- ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం (అర్హతను అనుసరించి)
- యాన్యువల్ లాకర్ రెంట్ ఛార్జీలపై రాయితీ (అర్హతను అనుసరించి)
- ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం (అర్హతను అనుసరించి)
- వెల్త్ రిలేషన్షిప్ (అర్హతను అనుసరించి)
ఎస్బీఐ అందిస్తున్న వివిధ రకాల శాలరీ ప్యాకేజ్ అకౌంట్స్
Different Types Of Salary Account Packages Offered by SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రంగాల ఉద్యోగులకు అనుగుణంగా వేర్వేరు శాలరీ ప్యాకేజ్ ఖాతాలను అందిస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ (CGSP)
- స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజ్ (SGSP)
- రైల్వే శాలరీ ప్యాకేజ్ (RSP)
- డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ (DSP)
- సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ (CAPSP)
- పోలీస్ శాలరీ ప్యాకేజ్ (PSP)
- ఇండియన్ కోస్ట్ గార్డ్ శాలరీ ప్యాకేజ్ (ICGSP)
- కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ (CSP)
- స్టార్ట్-అప్ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ (SUSP)
ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి?
How To Open SBI Salary Account : ఒక వేళ మీరు ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ తెరవాలంటే.. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్లైన్లో, యోనో యాప్‌లో ఈ శాలరీ ప్యాకేజ్ ఖాతాను తెరవవచ్చు.
ఎస్బీఐ శాలరీ ఖాతా తెరిచేందుకు కావాల్సిన పత్రాలు
SBI Salary Package Account Opening Documents :
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్
- పాన్‌కార్డ్ కాపీ
- ఆర్బీఐ అనుమతించిన ప్రభుత్వ గుర్తింపు పత్రం (ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి)
- ఎంప్లాయిమెంట్/ సర్వీస్ సర్టిఫికేట్
- లేటెస్ట్ శాలరీ స్లిప్
నోట్ : ఎస్బీఐ ఉమ్మడి ఖాతా విషయంలో.. దరఖాస్తుదారులు అందరూ తమ ఐడీ, చిరునామా పత్రాలను అందించాల్సి ఉంటుంది.
సేవింగ్స్ అకౌంట్‌ను.. శాలరీ అకౌంట్‌గా మార్చవచ్చా?
ఎస్బీఐలోని సాధారణ పొదుపు ఖాతాను కచ్చితంగా శాలరీ అకౌంట్‌గా మార్చడానికి వీలవుతుంది. దీని కోసం మీరు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ ఎంప్లాయిమెంట్ ప్రూఫ్, శాలరీ స్లిప్ లేదా సర్వీస్ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
అకస్మాత్తుగా మీ జీతం ఆగిపోతే!
కొన్ని సార్లు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో నెలవారీగా శాలరీ అకౌంట్లో జీతం డబ్బులు జమ కావు. ఇలా వరుసగా మూడు నెలలపాటు జీతం జమకాకపోతే.. అప్పుడు ఆ ఖాతాను ఆటోమేటిక్‌గా సాధారణ సేవింగ్స్ అకౌంట్‌గా మార్చేస్తారు. అలాగే అప్పటి వరకు అందిస్తున్న స్పెషల్ ఫీచర్లను కూడా నిలిపివేస్తారు. నిబంధనల ప్రకారం, సాధారణ పొదుపు ఖాతాలపై విధించే రుసుములు కూడా విధిస్తారు.
లాకర్ ఫెసిలిటీ సంగతేంటి?
ఎస్బీఐ శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్నవారికి.. వారి అర్హతను అనుసరించి లాకర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే వార్షిక లాకర్ రెంట్లో 50 శాతం వరకు కన్సెషన్ (తగ్గింపు) కూడా లభిస్తుంది!
నెలకు ఎన్ని ఫ్రీ డ్రాఫ్ట్స్ జారీ చేయవచ్చు!
SBI Over Draft Charges : శాలరీ అకౌంట్ హోల్డర్స్.. నెలలో ఎంత మొత్తానికైనా డ్రాఫ్ట్ జారీ చేయవచ్చు. అలాగే ఎన్ని సార్లు అయినా డ్రాఫ్ట్‌లు జారీ చేయవచ్చు. వీటిపై ఎలాంటి పరిమితి లేదు. అలాగే వీటిపై ఎలాంటి ఇస్యూయెన్స్ ఛార్జీలు కూడా విధించరు.
ఏటీఎం లావాదేవీల లిమిట్ ఎంత?
SBI ATM Transactions Charges : ఎస్బీఐ శాలరీ అకౌంట్ ఉన్న వాళ్లు భారతదేశంలోని అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లోనూ, ఇతర బ్యాంకు ఏటీఎంల్లోనూ అపరిమితమైన ఆర్థిక లావాదేవీలు జరపుకోవచ్చు. అదీ పూర్తి ఉచితంగా.
NEFT/ RTGS ఛార్జీలు విధిస్తారా?
ఎస్బీఐ శాలరీ అకౌంట్ హోల్డర్స్ ఆన్లైన్లో చేసే లావాదేవీలపై ఎలాంటి NEFT/ RTGS ఛార్జీలు ఉండవు.
ఇన్సూరెన్స్ ఇస్తారా?
SBI Salary Package Account Insurance Benefits : ఎస్బీఐలో శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి.. కాంప్లిమెంటరీగా వ్యక్తిగత ప్రమాద బీమా (PAI), ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (AAI) అందిస్తారు. శాలరీ అకౌంట్ టైప్, వేరియంట్‌ను అనుసరించి ఈ బీమా కవరేజీ మొత్తం మారుతూ ఉంటుంది.
- Post Office Schemes Interest Rates : పోస్టాఫీస్ పథకాల్లో మదుపు చేస్తున్నారా?.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే!
- How to Apply for SBI Credit Card : 'ఎస్బీఐ క్రెడిట్ కార్డు' కావాలా..? ఇలా ఈజీగా.. ఎన్నో బెనిఫిట్స్..!
- How to Apply SBI Amrit Kalash Scheme : ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.1 లక్ష పెడితే ఎంత వడ్డీ వస్తుందంటే..?