SBI RD Vs Post Office RD : దేశంలో డబ్బును ఆదా చేసుకునేందుకు అనేక మార్గాలున్నాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లలో జమ చేస్తే, మరికొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే మరికొందరు ఏమాత్రం రిస్క్ లేని పథకాల్లో మదుపు చేసేందుకు మొగ్గు చూపిస్తుంటారు. అలాంటి కోవలోనిదే రికరింగ్ డిపాజిట్ స్కీమ్.
ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్‌ను దేశంలో వివిధ బ్యాంకులతో పాటు ఇండియన్ పోస్ట్ ఆఫీసులు కూడా అందిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ కూడా ఈ స్కీమ్‌ను తమ కస్టమర్ల కోసం అందిస్తోంది. మరో వైపు ఇండియన్ పోస్ట్ కూడా ఆర్డీ డిపాజిట్లను అందిస్తోంది. మరి ఎస్బీఐ అందించే రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, తపాలా శాఖ ఆఫర్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్స్( Post Office RD Vs SBI RD )ను బేరీజు వేసుకుంటే.. ఏది బెటర్ ఆప్షన్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి..?
What Is Recurring Deposit : రికరింగ్ డిపాజిట్స్ అనేవి ఓ ప్రత్యేకమైన టర్మ్ డిపాజిట్లు. వీటి సేవలు దేశంలోని వివిధ బ్యాంకులతో పాటు పోస్ట్ ఆఫీసుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. ఈ తరహా డిపాజిట్ స్కీమ్స్.. వినియోగదార్లు ప్రతినెలా నిర్దేశిత మొత్తాన్ని బ్యాంకులో లేదా తపాలా కార్యాలయంలో జమ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఫలితంగా ఆర్డీ ఖాతాలు తెరచినవారు రెగ్యులర్‌గా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో ఆదాయాన్ని పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు అనేవి బ్యాంకు, ఎన్‌ఎఫ్‌బీసీల నిబంధనలకు అనుగుణంగా మారుతుంటాయి.
ఉదాహరణకు.. మీరు 10 సంవత్సరాల కాలవ్యవధితో ఏడాదికి రూ.20వేల ఫిక్స్డ్ అమౌంట్‌తో రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరిచారనుకోండి. అప్పుడు మీరు ఎంచుకున్న సమయానికి(మెచ్యురిటీ) మొత్తం రూ.2,40,000లను ఆర్డీలో జమచేస్తారు. దీనిపై మీకు 5శాతం వడ్డీ లభిస్తుంది. ఫలితంగా మెచ్యూరిటీ సమయానికి మీకు రూ.7,15,083 వడ్డీ వస్తుంది. అంటే టర్మ్ ముగిసేసరికి మొత్తంగా రూ.31,15,083 లంప్సమ్‌ను మీరు పొందవచ్చు.
ఎస్బీఐ ఆర్డీ స్కీమ్..
SBI RD Scheme 2023 : ఎస్బీఐ ప్రస్తుతం 1 నుంచి 10 సంవత్సరాల కాలవ్యవధితో కూడిన రికరింగ్ డిపాజిట్ సర్వీసెస్‌ను తమ వినియోగదారులకు అందిస్తుంది. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం వడ్డీని ఆందిస్తోంది. మరి సాధారణ కస్టమర్లకు ఈ బ్యాంక్ అందిస్తున్న వడ్డీ రేట్ల వివరాలిలా ఉన్నాయి.
1-2 సంవత్సరాలు | 6.80 శాతం |
2-3 సంవత్సరాలు | 7.00 శాతం |
3-4 సంవత్సరాలు | 6.50 శాతం |
5-10 సంవత్సరాలు | 6.50 శాతం |
ఎస్బీఐ నిబంధనల ప్రకారం, ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు అదనంగా 0.50 శాతం వడ్డీని అధికంగా పొందుతున్నారు. దీని ప్రకారం..
1-2 సంవత్సరాలు | 7.30 శాతం |
2-3 సంవత్సరాలు | 7.50 శాతం |
3-4 సంవత్సరాలు | 7.00 శాతం |
5-10 సంవత్సరాలు | 7.00 శాతం |
పోస్ట్ ఆఫీస్ ఆర్డీ..!
ప్రస్తుతం దేశంలో తపాలా శాఖ(పోస్ట్ ఆఫీస్) అందిస్తున్న రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కాలవ్యవధి గరిష్ఠంగా 5 సంవత్సరాలు మాత్రమే. అది కూడా ఈ పథకం కింద మదుపు చేసే డబ్బుకు స్థిరంగా ఒకే రకమైన వడ్డీ వస్తుంది. కాగా, ప్రస్తుతం పోస్ట్ ఆఫీసులు చెల్లిస్తున్న వడ్డీ శాతం 6.5 శాతంగా ఉంది. అయితే బ్యాంకులు ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు అందిస్తున్న అదనపు వడ్డీ పద్ధతిని పోస్ట్ ఆఫీసుల్లో గమనించలేము.
మరి ఏది బెస్ట్ ఆర్డీ..?
SBI RD Vs Post Office RD Which Is Better : రికరింగ్ డిపాజిట్ సేవలందిస్తున్న ఎస్బీఐ, పోస్ట్ ఆఫీసులతో పోలిస్తే.. ఎస్బీఐ ఆర్డీలను బెస్ట్ ఆప్షన్‌గా సూచిస్తున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ ఆర్డీలు సాధారణ కస్టమర్లకు ఇచ్చే వడ్డీకి అదనంగా 0.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. ఇవి వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. చివరగా మీ ఆర్థిక సామర్థ్యంతో పాటు అవసరాలకు అనుగుణంగా ఏది బెస్ట్ ఆప్షనో బేరీజు వేసుకొని ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుందంటున్నారు బ్యాంకింగ్ నిపుణులు.