ETV Bharat / business

రాంగ్ అకౌంట్​కు డబ్బులు పంపించారా?.. వెనక్కు తీసుకోండి ఇలా! - ఎస్​బీఐ​ ట్రాన్స్​ఫర్​ టు రాంగ్​ అకౌంట్ నంబర్​

SBI fund transfer to wrong account number : మీరు పొరపాటున వేరే అకౌంట్​కు డబ్బులు పంపించారా? ఆ డబ్బులు ఎలా వెనక్కు తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. పొరపాటున వేరే అకౌంట్​కు పంపిన డబ్బులు తిరిగి సురక్షితంగా ఎలా వెనక్కు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

SBI fund transfer problems
SBI fund transfer issues
author img

By

Published : Jul 5, 2023, 5:34 PM IST

SBI wrong account transfer : మనం ఒక్కోసారి ఒక అకౌంట్​కు పంపించాల్సిన డబ్బును పొరపాటున మరొక అకౌంట్​కు పంపిస్తూ ఉంటాం. తరువాత ఆ డబ్బులు వెనక్కు తీసుకోవడం ఎలాగో తెలియక, చాలా ఇబ్బందులు పడుతుంటాం. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా పరిష్కరించుకోవాలో ఎస్​బీఐ తన కస్టమర్లకు ఇటీవల సూచించింది.

డబ్బులు వెనక్కి తీసుకోవడం ఎలా?
how to retrieve money sent to wrong account : ఎస్​బీఐ కస్టమర్లు.. పొరపాటున రాంగ్ అకౌంట్​ నంబర్లకు పంపిన డబ్బుల్ని.. ఎలా వెనక్కు తీసుకోవాలో స్టెప్​ బై స్టెప్ చూద్దాం.

  1. డబ్బులు రాంగ్​ అకౌంట్​కు పంపిన వెంటనే .. కస్టమర్లు తమ ఎస్​బీఐ హోమ్ బ్రాంచ్​లో ఫిర్యాదు చేయాలి.
  2. ఫిర్యాదు అందుకున్న తరువాత ఎస్​బీఐ హోమ్​ బ్రాంచ్ .. దానిని ఫాలోఅప్​ చేస్తుంది.
  3. రాంగ్​ నంబర్​ ఏ బ్యాంకుకు సంబంధించినది అయితే.. ఆ బ్యాంకును ఎస్​బీఐ సంప్రదిస్తుంది. వారి సహకారంతో డబ్బులు వెనక్కు రప్పిస్తుంది.
  4. వెనక్కు రప్పించిన సొమ్మును.. ఎస్​బీఐ తన ఖాతాదారుకు అందిస్తుంది.

నోట్​ : ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి 'ఫండ్​ ట్రాన్స్​ఫర్​ టూ రాంగ్ అకౌంట్​ నంబర్​' ఫిర్యాదులను ఎస్​బీఐ పరిష్కరిస్తుంది. కానీ ఎలాంటి అపరాధ రుసుము (పెనాల్టీ) వసూలు చేయదు.

ఒక వేళ హోం బ్రాంచ్​లో సమస్య పరిష్కారం కాకపోతే?
How to complaint SBI bank for wrong transaction : ఒక వేళ ఎస్​బీఐ హోమ్ బ్రాంచ్​లో ఈ సమస్య పరిష్కారం కాకపోతే.. కస్టమర్​ https://crcf.sbi.co.in/ccf వెబ్​సైట్​లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా చేయాలో స్టెప్​ బై స్టెప్​ చూద్దాం.

  1. ముందుగా https://crcf.sbi.co.in/ccf లోకి వెళ్లాలి.
  2. పర్సనల్​ సెగ్మెంట్​లోకి వెళ్లాలి.
  3. కామెంట్​ బాక్స్​లో కస్టమర్​ చేసిన రాంగ్ ఫండ్​ ట్రాన్స్​ఫర్​ గురించి పూర్తి వివరాలను నమోదు చేయాలి.

నోట్​ : కస్టమర్​ ప్రధానంగా.. జనరల్ బ్యాంకింగ్​/ బ్రాంచ్ రిలేటెడ్​/ నో రెస్పాన్స్​ టు క్వైరీ.. కేటగిరీల్లో ఎక్కడ సమస్య ఉందో స్పష్టంగా పేర్కొంటూ ఫిర్యాదు చేయాలి. అప్పుడు సంబంధిత టీమ్​ మీకు సహాయం చేస్తుంది.

మీరు పంపించిన మెయిల్​కు కూడా స్పందించకపోతే ఏం చేయాలి?
ఒక వేళ మీరు ఈ-మెయిల్​ ద్వారా చేసిన ఫిర్యాదుకు కూడా స్పందించకపోతే అప్పుడు కూడా https://crcf.sbi.co.in/ccf లో మరోసారి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ సారి కచ్చితంగా మీకు సాయం లభించే అవకాశం ఉంటుంది. అప్పటికి కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఆర్​బీఐ అంబుడ్స్​మెన్​కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.

అన్​లైన్ మనీ ట్రాన్స్​ఫర్ విషయంలో జాగ్రత్త!
ఆన్​లైన్​లో మనీ ట్రాన్స్​ఫర్​ చేసే విషయంలో కస్టమర్లు చాలా జగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆన్​లైన్​లో డబ్బులు పంపించేటప్పుడు కచ్చితంగా బెనిఫీషియరీ అకౌంట్​ నంబర్​ను సరిచూసుకోవాలి. ఎందుకంటే, కస్టమర్లు చేసే ఇలాంటి పొరపాట్లకు బ్యాంకులు ఎప్పుడూ బాధ్యత వహించవు. ఒక వేళ పొరపాటు జరిగిపోతే.. వెంటనే హోమ్​ బ్రాంచ్​లో ఫిర్యాదు చేయాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.