ETV Bharat / business

forbes top 100 digital stars : ఫోర్బ్స్‌లో తెలంగాణ కుర్రాడికి చోటు - ఫోర్బ్స్ టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో తెలంగాణ కుర్రాడికి చోటు

ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్టార్స్‌లో తెలంగాణ యువకుడు చోటు సంపాదించాడు. తెలుగు టక్‌టట్స్ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న సయ్యద్ హఫీజ్‌కు ఫోర్బ్స్‌లో 32వ స్థానం లభించింది. ఇతడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందినవాడు.

forbes top 100 digital stars
forbes top 100 digital stars
author img

By

Published : Jul 22, 2022, 9:48 AM IST

ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడికి చోటు లభించింది. 32వ స్థానంలో నిలిచారు. యైటింక్లైన్‌కాలనీకి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌టట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది.

కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్న సయ్యద్‌ 2011లో ‘తెలుగు టెక్‌టట్స్‌’ పేరిట ఛానల్‌ ప్రారంభించారు. అప్పటి నుంచి సెల్‌ఫోన్‌ వినియోగంతో పాటు వాటి ప్రత్యేకతలు, లాభనష్టాలు, వివిధ కంపెనీలకు చెందిన కొత్త ఫోన్ల అన్‌బాక్సింగ్‌, కొత్తగా వస్తున్న ఎలక్ట్రానిక్‌ గూడ్స్‌ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ప్రస్తుతం 16 లక్షల సబ్‌స్క్రైబర్లను చేరుకున్న హఫీజ్‌ యూట్యూబ్‌ ద్వారా నెలకు రూ.2 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు.

సయ్యద్‌ వీడియోలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని ఫోర్బ్స్‌ తన మ్యాగజైన్‌లో పేర్కొంది. సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన హఫీజ్‌ ఉన్నత విద్య చదవకపోయినా తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్‌ ద్వారా ఆకట్టుకుంటున్నారు. అత్యధిక సబ్‌స్క్రైబర్లు ఉన్న హఫీజ్‌కు ‘డిజిటల్‌ స్టార్స్‌’లో 32వ స్థానం దక్కడంపై గోదావరిఖనిలో హర్షం వ్యక్తమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.