Sahara SEBI Latest News : రూ.2000తో మొదలుపెట్టిన వ్యాపారం.. రూ.2.5 లక్షల కోట్ల ఆస్తులతో భారీ కార్పొరేట్ సామ్రాజ్యంగా మారుతుందని ఎవరైనా ఊహిస్తారా? క్రికెటర్లు, సినీ తారలతో తిరిగిన వ్యాపార దిగ్గజం.. తీహార్ జైలు పాలవుతారని ఎవరైనా అనుకుంటారా? దాదాపు రూ.25,000 కోట్లను సెబీ వద్ద డిపాజిట్ చేసిన సహారా అధినేత సుబ్రతా రాయ్.. ఆ కేసు విషయం తేలకుండానే మరణించడం వల్ల కార్పొరేట్ ప్రపంచంతో పాటు కోట్ల మంది సామాన్యులు కూడా ఈ నిధులు ఏమవుతాయోనని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెబీ ఛైర్పర్సన్ మాధవి పూరీ బుచ్ స్పందించారు.
'ఆ వ్యవహారం సంస్థకు సంబంధించినదే'
సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణించినా.. ఆ సంస్థపై ఉన్న కేసుల దర్యాప్తు కొనసాగుతుందని సెబీ ఛైర్పర్సన్ మాధవి పూరీ బుచ్ తెలిపారు. ఈ వ్యవహారం సంస్థకు సంబంధించినది అని.. వ్యక్తి జీవించి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా కొనసాగుతుందని చెప్పారు. తద్వారా.. రూ.25వేల కోట్ల నిధులు అప్పటివరకు అలానే తమ వద్ద జమ అయి ఉంటాయని సంకేతాలిచ్చారు. రీఫండ్‌లు ఎందుకు చాలా తక్కువగా ఉన్నాయని ప్రశ్నించగా.. పెట్టుబడిదారుల క్లెయిమ్‌ల సాక్ష్యాధారాల ఆధారంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ద్వారా డబ్బులను తిరిగి చెల్లించామని చెప్పారు. ముంబయిలో గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన సెబీ చీఫ్.. ఈ వ్యాఖ్యలు చేశారు.
-
STORY | Sahara matter will continue even after Subrata's death: Sebi chief Madhabi Puri Buch
— Press Trust of India (@PTI_News) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
READ: https://t.co/8hS2fHeBik
VIDEO: pic.twitter.com/qfcFpjaURu
">STORY | Sahara matter will continue even after Subrata's death: Sebi chief Madhabi Puri Buch
— Press Trust of India (@PTI_News) November 16, 2023
READ: https://t.co/8hS2fHeBik
VIDEO: pic.twitter.com/qfcFpjaURuSTORY | Sahara matter will continue even after Subrata's death: Sebi chief Madhabi Puri Buch
— Press Trust of India (@PTI_News) November 16, 2023
READ: https://t.co/8hS2fHeBik
VIDEO: pic.twitter.com/qfcFpjaURu
ఎక్కడ మొదలైందీ కేసు?
సుబ్రతా రాయ్ కార్పొరేట్ సామ్రాజ్యానికి రెండే రెండు ఫిర్యాదులు బీటలు వారేలా చేశాయి. కొందరు మదుపర్ల బృందం చేసిన ఫిర్యాదు ఒకటైతే.. రోషన్ లాల్ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మరొకటి. అయితే సహారా ప్రైమ్ సిటీ ఐపీఓకి రావాలని భావించి.. సెబీకి ముసాయిదాను సమర్పించింది. ఆ సమయంలోనే 'ప్రొఫెషనల్ గ్రూప్ ఫర్ ఇన్వెస్టర్ ప్రొటక్షన్' నుంచి సెబీకి ఫిర్యాదు అందింది. చాలా నెలలుగా ప్రజలకు కన్వర్టబుల్ బాండ్లను జారీ చేసి నగదు సేకరించినా.. ఆ వివరాలను ముసాయిదాలో పేర్కొనలేదన్నది ఫిర్యాదు సారాంశం. ఇదే తరహాలో రోషన్ లాల్ నుంచి కూడా 2010 జనవరి 4న లేఖ వచ్చింది. ఒకటిన్నర పేజీల్లో హిందీలో రాసిన ఆ లేఖ దేశంలో దుమారాన్నే రేపింది. ఆ తరవాత సరిగ్గా నాలుగేళ్ల మూడు నెలలకు తీహార్ జైలుకు రాయ్ వెళ్లాల్సి వచ్చింది.
'ఏ తప్పూ చేయలేదు.. అందరి డబ్బులు వెనక్కి'
రెండు ఫిర్యాదులపై సెబీ దర్యాప్తు చేపట్టిన అనంతరం.. కేసు అలహాబాద్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తాము ఎటువంటి తప్పు చేయలేదని, హామీ ఇచ్చిన ప్రతిఫలాలతో అందరి డబ్బులను వెనక్కి ఇస్తామని సహారా గ్రూప్ చెబుతూ వచ్చింది. అదే సమయంలో మదుపర్ల నుంచి నిధులు సేకరిస్తూనే ఉంది. అలహాబాద్ హైకోర్టుకు కేసు వచ్చినపుడు రూ.2,000 కోట్లు వసూలు చేయగా.. సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్(శాట్)కు చేరిన సమయానికి సహారా రియల్ ఎస్టేట్ రూ.17,000 కోట్లు, సహారా హౌసింగ్ రూ.6,500 కోట్లు చొప్పున సేకరించాయి. మొత్తం 3.1 కోట్ల మంది మదుపర్లు కంపెనీ బాండ్లు కొనుగోలు చేశారు. అన్ని స్టాక్ ఎక్స్ఛేంజీల్లోని మదుపర్ల కంటే ఈ సంఖ్య ఎక్కువ కావడం గమనార్హం.
తల్లి అంత్యక్రియల కోసం బయటకు వచ్చి..
కోర్టు ఆదేశాలతో 2014 మార్చి 2న తీహార్ జైలుకు వెళ్లిన రాయ్, రెండేళ్ల పాటు అక్కడే ఉన్నారు. ఆయన తల్లి చాబీ రాయ్ అంత్యక్రియల కోసం 2016 మే 6న బయటకు వచ్చారు. అప్పటి నుంచీ పెరోల్‌పై బయటే ఉన్నారు. మంగళవారం రాయ్ గుండెపోటుతో మరణించడం వల్ల సహారా గ్రూప్ విషాదంలో మునిగింది. ఇటుక ఇటుక పేర్చి పెద్ద భవంతి కడితే.. అది కాస్త ఒక్కసారిగా కుప్పకూలినట్లు సుబ్రతా రాయ్ జీవన ప్రయాణం ఉందని పలువురు ప్రముఖులు వ్యాఖ్యానించారు.
రూ.25,000 కోట్ల పరిస్థితి ఏమిటి?
సుబ్రతా రాయ్ మరణంతో ఇప్పుడు మదుపర్లకు చెల్లించాల్సిన నిధుల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని అందరూ చర్చించుకుంటున్నారు. రూ.25,000 కోట్ల వరకు మొత్తాన్ని సెబీ వద్ద సహారా గ్రూప్ డిపాజిట్ చేసింది. తాజా గణాంకాల ప్రకారం.. సెబీ ఇప్పటిదాకా (11 ఏళ్లలో) రూ.138 కోట్లను మదుపర్లకు వెనక్కి ఇచ్చింది. వడ్డీతో కలిసి ఇంకా సెబీ వద్దే ఖాతాలో రూ.25,000 కోట్లు ఉన్నాయి. అయితే 95% మంది మదుపర్లకు నేరుగా రిఫండ్ చేశామని సహారా పేర్కొన్నప్పటికీ.. సుప్రీం ఆదేశాలతో ఈ నిధులను కూడా సెబీ వద్ద జమ చేయాల్సి వచ్చింది.