Revolt Rv400 EV : ప్రముఖ విద్యుత్ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్.. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. రివోల్ట్ మోటార్స్ ఆరో వార్షికోత్సవం సందర్భంగా RV400 పేరుతో ఈ స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ ఈవీ బైక్‌ను లాంఛ్ చేశారు.
Revolt Rv400 EV Features : స్పోర్ట్స్ బైక్‌ను తలపించేలా ఉన్న ఈ బైక్‌ను.. స్టైలిష్ అండ్ డైనమిక్ లుక్స్‌తో తీర్చిదిద్దారు. స్టెల్త్ బ్లాక్ ఎడిషన్( Revolt Rv400 Stealth Black Edition ).. పేరుకు తగ్గట్టే రివోల్ట్ RV400లో స్టైలిష్ లుక్ కలిగిన స్లీక్ బాడీని గమనించవచ్చు. బైక్‌కు మరింత అందాన్ని తెచ్చే విధంగా ముందు భాగంలో గోల్డ్ కలర్లో రెండు ఫోర్క్‌లను కూడా అమర్చారు. ఇది బైక్‌లోనే ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ఇందులోని స్టైల్డ్ ఎల్ఈడీ హెడ్‌లైట్.. బైక్‌కు మరింత మోడ్రన్ లుక్‌ను అందిస్తోంది. ఇక బాడీవర్క్ విషయానికొస్తే.. బ్యాటరీ బయటకు కనిపించకుండా యాంగులర్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఇక రివోల్ట్ RV400 బైక్ పనితీరు విషయానికి వస్తే.. ఈ స్టెల్త్ బ్లాక్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్‌లోని ఫీచర్లనే ఇందులోనూ ఉన్నాయి. ఇందులో మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను వాడారు. దీనితో అటవీ ప్రాంతాల్లో కూడా అద్భుతమైన రైడ్‌ను ఆస్వాదించవచ్చని కంపెనీ చెబుతోంది.
రివోల్ట్ RV400 స్పెసిఫికేషన్స్..
Revolt Rv400 EV Specs :
- మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్.
- బైక్ ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
- ఫోర్ హార్స్‌పవర్ (మూడు కిలోవాట్‌లు) సామర్థ్యం.
- ఫుల్‌ఛార్జ్‌తో 156 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
- 3.24 కిలోవాట్- లిథియమ్-అయాన్-యూనిట్ బ్యాటరీ.
- ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ ద్వారా బ్యాక్ సస్పెన్షన్‌ను హ్యాండిల్ చేస్తుంది.
Revolt Rv400 Price : ఇక ఈ రివోల్డ్ ఆర్వీ400 ఎలక్ట్రిక్ బైక్ ధరను రూ.1,17,000/-(ఎక్స్-షోరూం) గా నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో ఈ ఈవీ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు. అలాగే అన్ని రివోల్ట్ మోటార్స్ షోరూంల్లో కూడా ఈ బైక్‌ను బుక్ చేసుకునే అవకాశం ఉంది.
- Ola Upcoming EV : ఓలా నుంచి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!.. ఫీచర్స్ అదుర్స్!
- New Electric Bike In India : స్టన్నింగ్ ఫీచర్స్‌తో టోర్క్ మోటార్స్ ఈ-బైక్ లాంఛ్.. ధర ఎంతంటే?
- Toyota Rumion MPV Launch : స్టన్నింగ్ ఫీచర్స్‌తో.. టయోటా రూమియన్ లాంఛ్.. ధర ఎంతంటే?
- TVS X Electric Scooter Launch : స్టన్నింగ్ లుక్‌తో టీవీఎస్ ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ మైలేజ్..