ETV Bharat / business

రెనో 2024 మోడల్ కార్స్​​ లాంఛ్​​ - ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతంటే? - Renault 2024 car models

Renault Car Launch 2024 In Telugu : ఫ్రెంచ్​ ఆటోమొబైల్ కంపెనీ రెనో ఈ 2024 ప్రారంభంలోనే అప్​డేటెడ్​ కిగర్​, ట్రైబర్​, క్విడ్ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటిలో సరికొత్త ఫీచర్లను పొందుపరిచింది. అంతేకాదు ఈ మూడు కార్లను వివిధ ట్రాన్స్​మిషన్​ ఆప్షన్లతో అందిస్తోంది. మరెందుకు ఆలస్యం వీటి ఫీచర్స్, స్పెక్స్​, ప్రైజ్ వివరాలను తెలుసుకుందాం రండి.

Renault Kiger and Triber and Kwid 2024 models Launched
Renault car launches in 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 9, 2024, 4:59 PM IST

Renault Car Launch 2024 : ఫ్రాన్స్​కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ రెనో (Renault) టైబర్​, క్విడ్​, కిగర్​ 2024 మోడల్​ కార్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటిలో అనేక ఫీచర్లను యాడ్ చేసింది. ఈ అప్​డేటెడ్ కారుల్లో క్విడ్ అనేది ఒక కాంపాక్ట్​ హ్యాచ్​బ్యాక్; ట్రైబర్​ ఒక కాంపాక్ట్​ ఎంపీవీ కార్​; కిగర్ ఒక కాంపాక్ట్​ సెడాన్​. వీటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1. Renault Kwid Features : రెనో క్విడ్ 2024 మోడల్​ RXL(O) వేరియంట్ AMT ట్రాన్స్​మిషన్​తో వస్తుంది. దీనిలో 8 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్​ను అమర్చారు. ఈ క్విడ్​ కారు 3 సరికొత్త డ్యూయెల్-టోన్ కలర్​ ఆప్షన్లతో లభిస్తుంది.

Renault Kwid Price : రెనో క్విడ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.12 లక్షల (ఎక్స్​-షోరూమ్​) ప్రైజ్​ రేంజ్​లో ఉంటుంది.

2. Renault Triber Features : ఈ రెనో ట్రైబర్​ కారును కొత్తగా స్టీల్త్ బ్లాక్​ ఎక్స్​టీరియర్ పెయింట్​ స్కీమ్​తో తీసుకువచ్చారు. దీనిలో డ్రైవర్​ సీట్​ ఆర్మ్​రెస్ట్​, పవర్డ్​ వింగ్​ మిర్రర్స్​, ఏడు ఆంగుళాల టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్ కన్సోల్, వైర్​లెస్​ స్మార్ట్​ఫోన్ ఛార్జర్​ లాంటి అనేక కొత్త ఫీచర్లను పొందుపరిచారు.

రెనో అప్​డేటెడ్​ ట్రైబర్​ RXL వేరియంట్​లో రియర్​ వైపర్​, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ ఎయిర్​కండిషనింగ్ వెంట్స్​, పీఎమ్​ 2.5 ఎయిర్​ ఫిల్టర్స్​ను అమర్చారు. ఈ ట్రైబర్ కారు, రెనోకు సంబంధించి భారతదేశంలోనే బెస్ట్ సెల్లర్​గా ఉంది.

Renault Triber Price : మార్కెట్లో ఈ రెనో ట్రైబర్ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల రేంజ్​లో ఉంటుంది.

3. Renault Kiger Features : రెనో కిగర్​ RXL వేరియంట్​ మాన్యువల్​, ఏఎంటీ ఛాయిస్​ల్లో లభిస్తుంది. RXT (O) వేరియంట్ టర్బో మాన్యువల్​, సీవీటీ ఆప్షన్లలో దొరుకుతుంది. ఈ అప్​డేటెడ్​ రెనో కిగర్ కారులో ఆటో-డిమ్మింగ్​ రియర్​ వ్యూ మిర్రర్​, లెథెరెట్​ స్టీరింగ్ వీల్​, సెమీ-లెథెరెట్​ సీట్​ అప్​హోల్​స్టెరీ, పవర్డ్​ అవుట్​సైడ్​ రియర్​ వ్యూ మిర్రర్స్ అమర్చారు.

Renault Kiger Price : మార్కెట్లో ఈ రెనో కిగర్ కారు ధర రూ.6.50 లక్షల నుంచి రూ.11.23 లక్షల వరకు ఉంటుంది.

రెనో కంపెనీ వచ్చే మూడేళ్లలో న్యూ జనరేషన్ డస్టర్​, ఒక 7 సీటర్​ మిడ్​సైజ్​ ఎస్​యూవీ సహా, ఒక లోకలైజ్డ్ ఎలక్ట్రిక్ కారును తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

కొత్త ఏడాదిలో క్రెడిట్ కార్డ్ రూల్స్ ఛేంజ్​ - ఇకపై లాంజ్ యాక్సెస్​ కష్టమే!

ముందుగా అప్పు తీర్చలా? పెట్టుబడులు పెట్టాలా? - ఏది బెస్ట్ ఛాయిస్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.