ETV Bharat / business

Reliance SBI Card : సూపర్​ ఆఫర్లతో రిలయన్స్- SBI క్రెడిట్​ కార్డు.. ఎన్ని రివార్డ్​లో తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 9:48 PM IST

Reliance SBI Card : రిలయన్స్​ రిటైల్​, ఎస్​బీఐ కార్డు సంయుక్తంగా 'రిలయన్స్ ఎస్​బీఐ కార్డు'ను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. ఈ కార్డు వినియోగదారులకు మంచి రివార్డ్ షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని రెండు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

Reliance SBI Card
Reliance SBI Card

Reliance SBI Card : దేశంలోని రెండు దిగ్గజ సంస్థలైన ఎస్​బీఐ, రిలయన్స్​ జతకట్టాయి. రెండు కలిపి కో బ్రాండెడ్​గా 'రిలయన్స్​ ఎస్​బీఐ కార్డ్'​ను తీసుకురానున్నట్లు ప్రకటించాయి. ఇది మాస్​ నుంచి ప్రీమియం వరకు వివిధ రకాల క్రెడిట్ కార్డు అవసరాలను తీర్చడం సహా అన్ని రంగాల వినియోగదారులకు మంచి రివార్డ్ షాపింగ్ అనుభవాన్ని ఇస్తుందని రెండు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

Reliance SBI Credit Card Benefits : రిలయన్స్​ రిటైల్​కు సంబంధించిన దుకాణాల్లో కొనుగోలు చేసిన రిలయన్స్​ ఎస్​బీఐ కార్డు వినియోగదారులు అనేక రివార్డ్​లు పొందవచ్చని సంయుక్త ప్రకటన పేర్కొంది. ఫ్యాషన్​ లైఫ్​ స్టైల్​ నుంచి నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫర్నిచర్​, జ్యూవెలరీ వరకు అనేక విభాగాల్లోని దుకాణాల్లో ఈ సేవలను వినియోగించుకుని రివార్డ్​లు అందుకోవచ్చని వెల్లడించింది. వీటితో పాటు సాధారణంగా ఎస్​బీఐ కార్డు అందించే ఇతర అనేక రివార్డ్​లు, ఆఫర్లను సైతం రిలయన్స్ ఎస్​బీఐ కార్డు వినియోగదారులు పొందవచ్చని తెలిపింది. ఇవే కాకుండా వార్షిక రుసుం మినహాయింపుతో పాటు రిలయన్స్ రిటైల్ స్టోరల్లో షాపింగ్ చేసినందుకు గాను వోచర్స్ కూడా​ అందుకోవచ్చని చెప్పింది. ఈ భాగస్వామ్యం వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందించడమే కాకుండా.. భారత క్రెడిట్​ కార్డ్​ మార్కెట్​లో కొత్త మైలురాయిని సృష్టిస్తుందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.

Reliance SBi Credit Cards : మరోవైపు, ఈ కార్డులు రెండు రకాలుగా అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రిలయన్స్, ఎస్​బీఐ తెలిపాయి. విభిన్నమైన వినియోగదారుల అవసరాల కోసం ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ రిలయన్స్ ఎస్​బీఐ, రిలయన్స్​ ఎస్​బీఐ ప్రైమ్​ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పాయి. రిలయన్స్​ ఎస్​బీఐ కార్డ్ ప్రైమ్​ వార్షిక రెన్యూవల్​ రుసుం రూ.2,999తో పాటు ట్యాక్స్​ ఉండగా.. రిలయన్స్​ ఎస్​బీఐ కార్డుకు రూ. 499తో పాటు ట్యాక్స్​ ఉంటుందని వివరించాయి. అయితే, ప్రైమ్​ వినియోగదారులు రూ.3లక్షల విలువైన లావాదేవీలు దాటితే వార్షిక రుసుం మినహాయింపు పొందవచ్చని పేర్కొన్నాయి. కాగా... రిలయన్స్ ఎస్​బీఐ కార్డుకు రూ.లక్ష లావాదేవీలు చేస్తే సరిపోతుంది. దీనిని రీసైకిల్డ్​ ప్లాస్టిక్​తో రూపొందించగా.. రూపే సౌజన్యంతో అందుబాటులోకి తీసుకురానున్నారు. రిలయన్స్​ రిటైల్​కు దేశవ్యాప్తంగా అనేక రకాల దుకాణాలతో పాటు డిజిటల్​ రంగంలోనూ వ్యాపారాలు ఉన్నాయి. రిలయన్స్​ స్మార్ట్, రిలయన్స్ ఫ్రెష్​ సిగ్నేచర్​, రిలయన్స్ డిజిటల్​, రిలయన్స్ ట్రెండ్స్, జియో మార్ట్​, అజియో, రిలయన్స్ జ్యూవెల్స్, అర్బన్​ లాడర్​, నెట్​మెడ్స్ సహ అనేక వ్యాపారాలు ఉన్నాయి.

SBI Card Festive Offers 2023 : ఎస్​బీఐ కార్డ్ బంపర్​ ఆఫర్స్​.. 27.5% వరకు క్యాష్​బ్యాక్​​​.. రూ.10,000 వరకు డిస్కౌంట్​​​!

SBI Card and Bank of Baroda Festive Offers 2023: ఫెస్టివల్​ బంపర్​ ఆఫర్​​.. ఏకంగా 10వేల దాకా క్యాష్​బ్యాక్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.