ETV Bharat / business

'రూ.25కే సోప్.. రూపాయికే డిష్​ వాష్ జెల్'.. బంపర్ ఆఫర్స్​తో రిలయన్స్ కిరాక్ ప్లాన్

author img

By

Published : Mar 26, 2023, 4:09 PM IST

ఎఫ్ఎంసీజీ రంగంలోని దిగ్గజ సంస్థలను తలదన్నే ప్లాన్​ను రెడీ చేసింది రిలయన్స్. అతి తక్కువ ధరలకే సబ్బులు, డిటర్జెంట్లు విక్రయించేందుకు సిద్ధమైంది. సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే 30- 35 శాతం తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తోంది.

reliance fmcg products
reliance fmcg products
  • "రూ.35-40 మధ్య ఉండే సబ్బు ధర రూ.25కే అందిస్తాం.."
  • "రూ.325 ఉండే లిక్విడ్ డిటర్జెంట్​ను.. కేవలం రూ.250కే ఇచ్చేస్తాం.."
  • "ఐదు రూపాయలకే డిష్ వాష్ బార్ ఇస్తాం. రూపాయికే డిష్ వాష్ జెల్ కూడా ఇస్తాం.."

ఇదంతా ఏంటని ఆలోచిస్తున్నారా..? రిలయన్స్ సంస్థ అందిస్తున్న అదిరిపోయే ఆఫర్లు ఇవి. టెలికాం రంగంలో సంచలనాలు నమోదు చేసి, సాఫ్ట్​డ్రింక్ సెగ్మెంట్​లో అనూహ్య పోటీకి తెరతీసిన రిలయన్స్.. ఎఫ్ఎంసీజీ రంగంలోనూ తనదైన మార్కెటింగ్ వ్యూహాలతో దూసుకెళ్లేందుకు వేసిన ప్లానే ఇది. ఇందులో భాగంగానే అతి తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులను అందిస్తోంది రిలయన్స్. సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే 30- 35 శాతం తక్కువ ధరలకే ఉత్పత్తులను విక్రయిస్తోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్​వీఎల్)కి చెందిన ఆర్​సీపీఎల్ సంస్థ ఈ మేరకు ఎఫ్ఎంసీజీ రంగంలో కొత్త యుద్ధానికి తెరతీసింది.

ఆర్​సీపీఎల్ చెప్పిన ప్రకారం వివిధ ఉత్పత్తుల రేట్లు ఇలా

  • గ్లిమ్మర్ బ్యూటీ సోప్, రియల్ నేచురల్ సోప్, ప్యూరిక్ హైజీన్ సోప్​లను రూ.25కే అందించనుంది.
  • సబ్బుల్లో లీడింగ్ బ్రాండ్​గా ఉన్న లక్స్​ ధర (100 గ్రాములకు) రూ.35గా ఉంది.
  • డెటాల్(రూ.40- 75గ్రా), సంతూర్​ (100 గ్రాములకు రూ.34) సబ్బులతో పోల్చినా రిలయన్స్ అందించే సబ్బుల ధర చాలా తక్కువ.
  • కేజీ ఎంజో డిటర్జెంట్ పౌడర్​ను రూ.149కే విక్రయిస్తోంది. రూ.250కే ఎంజో 2 లీటర్ల లిక్విడ్ డిటర్జెంట్​ను అందించనుంది. సర్ఫ్​ఎక్సెల్ మాటిక్​ ధర(రూ.325)తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
  • డిష్ వాషింగ్ సెగ్మెంట్​లోనూ రిలయన్స్ అతి తక్కువగా ఛార్జ్ చేస్తోంది. రూ.5, 10, 15కే డిటర్జెంట్ సబ్బులను అందిస్తోంది. రూ.10, 30, 45కే లిక్విడ్ ప్యాకెట్లను విక్రయిస్తోంది. విమ్, ఎక్సో, ప్రిల్ వంటి బ్రాండ్లకు పోటీగా.. ఒక్క రూపాయికే డిటర్జెంట్ లిక్విడ్ శాషేలను మార్కెట్లోకి తెచ్చింది.

ప్రస్తుతానికైతే ఈ ఉత్పత్తులు కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నాయి. డీలర్ నెట్​వర్క్​ను బలోపేతం చేసుకొని, పాన్-ఇండియా స్థాయిలో ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

కచ్చితంగా ట్రై చేస్తారు!
ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తుండటం వల్ల వినియోగదారుల్లో వాటిపై ఆసక్తి పెరుగుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారైనా వాటిని ప్రయత్నించి ఓ అంచనాకు వస్తారని అంటున్నారు. నాణ్యత, వాటి స్వభావాన్ని తెలుసుకొని.. నచ్చితే తిరిగి ఉపయోగిస్తారని చెబుతున్నారు.

"మార్కెట్ లీడర్​గా ఉన్న హిందుస్థాన్ యూనిలీవర్ ఉత్పత్తులతో వారు (రిలయన్స్) పోటీ పడాలని అనుకుంటున్నారు. రూ.25 సబ్బుతో 34 రూపాయల లక్స్ సబ్బును ఢీకొడుతున్నారు. వినియోగదారులు ఒకసారి ట్రై చేయడానికి ఇది చాలా మంచి ఇన్సెంటివ్. ఆ ఉత్పత్తి లక్స్ స్థాయిలో ఉందని కస్టమర్ భావిస్తే.. రిలయన్స్ తన మార్కెట్​ను విస్తరించుకోవచ్చు. కానీ, ఆ ప్రొడక్ట్ కస్టమర్ మెప్పు పొందకుంటే మాత్రం రిలయన్స్ విజయం సాధించలేదు."
-అరవింద్ సింఘాల్, టెక్నోపాక్ అడ్వైజర్స్ ఛైర్మన్

దేశ ఎఫ్ఎంసీజీ రంగం ఇటీవల కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ మార్కెట్ విలువ 110 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇందులో హిందుస్థాన్ యూనిలీవర్, పీ&జీ, నెస్లే, రెకిట్ వంటి సంస్థలదే ఆధిపత్యం. అనేక బ్రాండ్లను ఈ సంస్థలు ప్రవేశపెట్టాయి. కస్టమర్లు దాదాపుగా వాటికే అలవాటు పడిపోయారు. అయితే, రిలయన్స్ ఇందులో రాణించాలంటే పెద్ద ఎత్తున అడ్వర్టైజ్​మెంట్లు చేసుకోవాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.

"సబ్బుల విషయానికి వస్తే.. మార్కెట్​లో లక్స్, సంతూర్ వంటి దిగ్గజ సోప్ బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా వెయ్యి వరకు చిన్న చిన్న బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని కాదని రాణించాలంటే.. తమ ప్రొడక్ట్​కు రిలయన్స్ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. కస్టమర్ తమ ఉత్పత్తిని గుర్తుపట్టే విధంగా ప్రచారం కల్పించాలి."
-ధైర్యశీల్ పాటిల్, ఆల్ఇండియా కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు

ఎంట్రీతోనే మార్కెట్లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన చరిత్ర రిలయన్స్​కు ఉంది. టెలికాం రంగంలో జియో పేరుతో అడుగుపెట్టిన రిలయన్స్.. ప్రారంభంలో అపరిమిత 4జీ డేటా ఉచితంగా అందించి మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఆ వ్యూహంతోనే నిలదొక్కుకున్న జియో.. ఇప్పుడు మార్కెట్ లీడర్​గా అవతరించింది. ఈ మధ్యే ఇదే వ్యూహంతో కోలా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఐకానిక్ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ అయిన కాంపాను చేజిక్కించుకున్న రిలయన్స్.. అతితక్కువ ధరకే కోలాలు విక్రయిస్తోంది. 200ఎంఎల్ బాటిల్​ను రూ.10కే అందిస్తోంది. అర్ధలీటర్ కాంపా కోలాను రూ.20కే విక్రయిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.