ETV Bharat / business

సామాన్యుడా.. వడ్డీల మోతకు సిద్ధమవ్వు! ఈఎంఐలు మరింత భారం!!

RBI monetary policy: గృహ నిర్మాణం, ఉన్నత విద్య, వ్యాపారాలకు రుణాలు తీసుకున్న వారిపై మరింత భారం తప్పదా? ఇప్పటికే నిత్యావసరాల ధరలతో లబోదిబోమంటున్న సామాన్యులపై వడ్డీరేట్ల రూపంలో మరో పిడుగు పడనుందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు ఆర్థికవేత్తలు. బుధవారం ద్రవ్యపరపతి విధాన సమీక్షలో.. కీలక వడ్డీ రేట్లు పెంపు తథ్యమని అంచనా వేస్తున్నారు.

rbi monetary policy
rbi monetary policy
author img

By

Published : Jun 7, 2022, 6:18 PM IST

RBI interest rate 2022: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నటుతూ.. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతున్న ఈ సమయంలో సామాన్యులకు రిజర్వ్​ బ్యాంక్​ మరో షాక్​ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. గత నెలలో రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతానికి చేర్చిన ఆర్​బీఐ.. మరోసారి వడ్డీ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం ప్రారంభంకాగా.. గవర్నర్​ శక్తికాంత దాస్​ వడ్డీరేట్లపై బుధవారం ప్రకటన చేయనున్నారు.

2020 మే 22న చివరిసారిగా వడ్డీ రేట్లలో మార్పులు చేసిన ఆర్​బీఐ.. గత నెలలో ద్రవ్యపరపతి విధాన సమీక్ష లేకుండానే వడ్డీ రేట్లను పెంచింది. దీంతో అనేక బ్యాంకులు కీలకమైన వడ్డీ రేట్లలో మార్పులు చేశాయి. హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు ఏకంగా నెల రోజుల వ్యవధిలోనే మూడు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. ఈ చర్యలతో సామాన్యుల జీవితాలతో పాటు ప్రతి రంగం పైన ప్రభావం పడుతోంది.

ఏడాది చివరకు 5.75 శాతానికి: 'ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు పెంచేందుకు అవకాశం ఉంది' అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గత సమావేశంలో పేర్కొన్నారు. దీంతో వడ్డీ రేట్ల పెంపు అనివార్యమనేది స్పష్టమవుతోంది. ఈసారి సమీక్షలో మరో 35-40 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉన్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి వడ్డీరేటు 5.75 శాతానికి చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతోందని.. ఫలితంగా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్​ నిపుణులు అంచనా వేశారు.

రెండేళ్లుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా రుణాలకు సంబంధించి నెలవారీ కిస్తీ (ఈఎంఐ) మొత్తం పెరుగుతోంది లేదా రుణం చెల్లించాల్సిన కాలం అధికమవుతోంది. దీంతో సామాన్యులకు బ్యాంకు రుణాలు, ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. రెపో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని మధ్యంతర సమీక్షలో ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి జరుగుతున్న ద్రవ్య పరపతి విధాన సమీక్షపై అందరి దృష్టి నెలకొని ఉంది.

నెలలో మూడు సార్లు పెంచిన హెచ్​డీఎఫ్​సీ: రేపోరేటును పెంచుతున్నట్లు ఆర్​బీఐ ప్రకటించిన తర్వాత అనేక బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. ఫలితంగా ఈఎంఐలు కట్టేవారిపై అదనపు భారం పడింది. ద్రవ్యపరపతి సమీక్షను దృష్టిలో ఉంచుకుని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు హెచ్​డీఎఫ్​సీ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. 7.50 శాతం ఉన్న వడ్డీ రేటును 0.35 బేసిస్​ పాయింట్లు పెంచి 7.85 శాతానికి చేర్చింది. ఈ పెంపుతో ఒక్కనెల వ్యవధిలో వడ్డీ రేట్లను హెచ్​డీఎఫ్​సీ మూడు సార్లు పెంచింది. అంతకుముందు రిటైల్​ ప్రైమ్​ లెండింగ్ రేట్​(ఆర్​పీఎల్​ఆర్​)ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు జూన్​ 1న ప్రకటించింది. మే 7న 35 బేసిస్ పాయింట్లు, మే 1న 5 బేసిస్ పాయింట్లను పెంచింది.

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ వడ్డీ రేటును 15 బేసిస్​ పాయింట్లు పెంచింది. 7.25 శాతంగా ఉన్న రేటు.. ఈ పెంపుతో 7.40 శాతానికి చేరుకుంది. కెనరా బ్యాంక్​ 7.35 శాతం ఉన్న వడ్డీ రేటును 5 బేసిస్​ పాయింట్లు పెంచి 7.40 శాతం చేసింది. ఈ రేట్లు జూన్​ 1న అమల్లోకి వచ్చాయి. దీంతో పాటు కరూర్​ వైశ్యా బ్యాంక్​ 40 బేసిస్​ పాయింట్లను పెంచింది.

ఎఫ్​డీ చేసేవారికి మాత్రం: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల నిర్ణయంతో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలనుకునే వారికి ఇకపై అధిక వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఎఫ్‌డీలపై అందిస్తున్న వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటోంది. దీంతో సురక్షిత పొదుపు పథకం అయినప్పటికీ తక్కువ వడ్డీ రేట్లు కారణంగా చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఆ మేరకు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచనున్నాయి. తొలి దశలో స్వల్పకాలిక, మధ్యకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెరిగే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 'ఠాగూర్​, కలాం ఫొటోలతో కరెన్సీ నోట్లు!'.. ఆర్​బీఐ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.