ETV Bharat / business

బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని సొమ్ము రూ.35వేల కోట్లు.. ఆ వెబ్​సైట్లో అప్లై చేస్తే మీకే సొంతం! - రూ35 వేల కోట్ల అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్ల వార్తలు

అనేక ఏళ్ల క్రితం బ్యాంకు ఖాతా తెరిచి, ఉపయోగించడం మానేశారా? చాలా కాలంగా ఆ ఖాతాలో ఉన్న సొమ్మును తిరిగి ఎలా పొందాలా అని చూస్తున్నారా? అయితే.. ఓ శుభవార్త. ఇలాంటి అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్ల విషయంలో రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఖాతాల్లోని సొమ్మును డిపాజిటర్లు లేదా వారి నామినీలు సులువుగా గుర్తించేందుకు వీలుగా ఓ వెబ్​సైట్​​ను తెచ్చేందుకు సిద్ధమైంది.

RBI told unclaimed deposits and to setup portal
దేశంలో రూ.35 వేల కోట్ల అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లు
author img

By

Published : Apr 6, 2023, 12:53 PM IST

Updated : Apr 6, 2023, 2:16 PM IST

దేశంలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిటర్లు లేదా వారి లబ్ధిదారులు జమ చేసి, పట్టించుకోని సొమ్ము (క్లెయిమ్​ చేయని డిపాజిట్ల)ను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓ పోర్టల్​ను రూపొందించనున్నట్లు ప్రకటించింది రిజర్వు బ్యాంకు. అందుబాటులోకి వచ్చే ఈ వెబ్​సైట్​లో అకౌంట్​ హోల్డ్​ర్​లతో పాటు వారి నామినీలకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరుస్తామని ఆర్​బీఐ వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించి గురువారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానం ప్రకటించిన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత​ దాస్.
2023 ఫిబ్రవరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న వేర్వేరు బ్యాంకుల్లో ఎవరూ పట్టించుకోని డిపాజిట్లు రూ.35,000 కోట్లు ఉన్నాయి. ప్రస్తుతం వీటినే ఆయా బ్యాంకులు ఆర్​బీఐ నిర్వహించే 'డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్' (డీఈఏ) ఫండ్​కు బదిలీ చేశాయి. ఇలాంటి వాటి వివరాలను యాక్సెస్​ చేయడానికి ప్రత్యేకంగా ఓ సెంట్రలైజ్డ్​ పోర్టల్​ వ్యవస్థను తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం రిజర్వు బ్యాంకు ప్రకటించింది.

ఏ బ్యాంకుల్లో ఎంత?
రిజర్వు బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ) రూ.8,086 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లతో మొదటి స్థానంలో ఉంది. రూ.5,340 కోట్లతో పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​, రూ.4,558 కోట్లతో కెనరా బ్యాంక్​, రూ. 3,904 కోట్లతో బ్యాంక్​ ఆఫ్​ బరోడా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లంటే ఏమిటి?
ఆర్​బీఐ నిబంధనల ప్రకారం.. సాధారణంగా పది సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం పాటు సదరు బ్యాంక్​ అకౌంట్​ నుంచి ఎటువంటి ట్రాన్సాక్షన్స్​ జరపకపోతే అప్పటివరకు వాటిలో ఉన్న డబ్బును అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్లుగా పరిగణిస్తారు. వీటినే ఆయా బ్యాంకులు రిజర్వు బ్యాంకుకు బదిలీ చేస్తుంటాయి. ప్రస్తుతం ఇవే దేశంలో రూ.35,000 కోట్లు ఉన్నాయి.

మరి వీటిని తిరిగి పొందలేమా..?
కచ్చితంగా ఈ అన్​క్లెయిమ్డ్​ డిపాజట్ల మొత్తాన్ని ప్రతి ఖాతాదారుడు తిరిగి పొందే వీలుంటుంది. ఆర్​బీఐ తీసుకొచ్చే ఈ వెబ్​సైట్​లో డిపాజిటర్​/ నామినీకి సంబంధించిన బ్యాంక్​ అకౌంట్​ నంబర్​, డిపాజిట్ల రశీదులు, ఆధార్​ కార్డ్​ నంబర్​, పాన్​ కార్డ్​ నంబర్​, మొబైల్​ నంబర్​, చిరునామా వంటి వివరాలతో తమకు సంబంధించిన అన్​క్లెయిమ్డ్​ డిపాజిట్ల వివరాల కోసం వెతుక్కోవచ్చు. అలా వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ఓ అకౌంట్​ హోల్డర్​ తన అన్​క్లెయిమ్డ్​ డబ్బులను తిరిగి పొందేందుకు ఉపయోగపడతాయి. వీటి ఆధారంగా దరఖాస్తు చేసుకునేవారికి ఆ సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది.

Last Updated : Apr 6, 2023, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.