ETV Bharat / business

చిన్న సంస్థలకు అధిక రుణాలు.. ఆసక్తి చూపిస్తున్న ప్రైవేటు బ్యాంకులు! - bankability

దేశంలో ఎంఎస్​ఎం​ఈలకు రుణాలివ్వడంలో ఇప్పటివరకు ప్రభుత్వ రంగ బ్యాంకులే పెద్ద దిక్కుగా ఉండేవి. కానీ, కొవిడ్​ అనంతరం వ్యాపారం పంజుకుంటున్న వేళ.. ఈ సంస్థలకు లోన్​లు మంజూరు చేయడానికి ప్రైవేటు రంగ బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల అవసరాలకు తగ్గట్టు వివిధ పథకాలు తీసుకువస్తున్నాయి. వీటితో పాటు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు సైతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలిచ్చేందుకు పోటీ పడుతున్నాయి.

msme private banks loan
msme private banks loan
author img

By

Published : Jan 6, 2023, 6:45 AM IST

ఎంఎస్‌ఎంఈల (సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల)కు రుణాలివ్వడంలో ఇంతకాలం ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందుండేవి. ఇటీవలికాలంలో ప్రైవేటు రంగ బ్యాంకులూ వీటిపై దృష్టి సారిస్తున్నాయి. వివిధ రంగాల్లోని ఎంఎస్‌ఎంఈలకు అధికంగా రుణాలు జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం 'డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌'లను ఆవిష్కరించడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలూ చేపడుతున్నాయి. ఈ విషయంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. కొవిడ్‌ పరిణామాల్లో వ్యాపార కార్యకలాపాలు సాగక, ఎంఎస్‌ఎంఈలు బాగా నష్టపోయాయి. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నందున, మళ్లీ ఎంఎస్‌ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. అందువల్ల వాటికి రుణ అవసరాలు పెరిగాయి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అతిపెద్ద మార్కెట్‌
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక ప్రకారం మనదేశంలో ఎంఎస్‌ఎంఈల రుణాల మార్కెట్‌ రూ.50 లక్షల కోట్ల మేరకు ఉంది. ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈ రంగానికి ఇచ్చిన రుణాలు రూ.22.3 లక్షల కోట్ల మేరకు ఉన్నాయి. అంటే మరో రూ.25 లక్షల కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఈ విభాగంలో ఉంది. భవిష్యత్తులో ఇది ఇంకా పెరుగుతుందని అంచనా. దీన్ని పెద్ద అవకాశంగా బ్యాంకులు భావిస్తున్నాయి. 2021-22లో ఎంఎస్‌ఎంఈ సంస్థలకు, బ్యాంకులు- ఎన్‌బీఎఫ్‌సీలు, 2020-21తో పోల్చితే 5% అధికంగా రుణాలు మంజూరు చేశాయి. సగటు రుణ మొత్తం రూ.38 లక్షల నుంచి రూ.72 లక్షలకు పెరిగింది. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చిన రుణాల్లో ప్రైవేటు రంగ బ్యాంకుల వాటా రెండేళ్ల క్రితం 27% కాగా, తాజాగా 34 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా, అవి మంజూరు చేసే సగటు రుణ మొత్తాలు తగ్గుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

యాక్సిస్‌ బ్యాంక్‌ 'ఎవాల్వ్‌'
ఎంఎస్‌ఎంఈ రుణాల కోసం యాక్సిస్‌ బ్యాంక్‌, 'ఎవాల్వ్‌' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రంగ సంస్థలకు దగ్గరయ్యేందుకు దేశంలోని వివిధ నగరాల్లో వారితో సమావేశమవుతోంది. హైదరాబాద్‌లో ఫార్మాస్యూటికల్స్‌, ఇంజినీరింగ్‌, రిటైల్‌ వ్యాపార విభాగాలకు చెందిన చిన్న, మధ్యస్థాయి సంస్థల ప్రతినిధులతో యాక్సిస్‌బ్యాంక్‌ అధికారులు సమావేశమయ్యారు. రుణాలు మంజూరు చేయడమే కాక, ఎంఎస్‌ఎంఈల సమస్యలను అర్థం చేసుకుని, పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యమని యాక్సిస్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు (కమర్షియల్‌ బ్యాంకింగ్‌ కవరేజ్‌ గ్రూపు) సగ్రామ్‌ సింగ్‌ తెలిపారు. యాక్సిస్‌ బ్యాంకు రుణాల్లో ఎంఎస్‌ఎంఈల వాటా 20% వరకు ఉంది. కొంతకాలంగా ఈ విభాగంలో ఏటా 28% వృద్ధి నమోదు చేస్తున్నట్లు వివరించారు.

ఎన్‌బీఎఫ్‌సీల నుంచి పోటీ
ఎంఎస్‌ఎంఈ రుణాల మార్కెట్లో ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)లు సైతం పోటీ పడుతున్నాయి. బ్యాంకులతో పోల్చితే వినూత్న విధానాలు అనుసరిస్తూ, ఎంఎస్‌ఎంఈల నిర్వాహకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. తక్కువ డాక్యుమెంటేషన్‌తో త్వరితంగా అప్పులు మంజూరు చేయడం, 'పర్సనలైజ్డ్‌ లోన్‌ ప్రోడక్ట్స్‌'ను ఆవిష్కరించడం, వివిధ విభాగాల వాణిజ్య సంస్థలు, పరిశ్రమల్లోని మంచి చెడ్డలు గమనించి, ప్రత్యేక రుణ పథకాలు తీసుకురావడం చేస్తున్నాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు పలు సందర్భాల్లో 'బ్యాంకబులిటీ (రుణాలు మంజూరు చేయడానికి అవసరమైన బ్యాలెన్స్‌ షీట్‌, క్యాష్‌ఫ్లో, ఆస్తులు ఉండటం) ఉండదని, అందువల్ల బ్యాంకులు అప్పులు ఇవ్వలేవని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్‌ ఒకరు వివరించారు. ఎన్‌బీఎఫ్‌సీలు మాత్రం సులభతర నిబంధనలు పాటిస్తూ, అటువంటి సంస్థలకు అప్పులు ఇస్తున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.