ETV Bharat / business

పీపీఎఫ్​లో ఐదో తేదీలోపే జమ చేయండి.. లేకపోతే..! - ppf interest rules

PPF Deposit Date for Full Month Interest: పెట్టుబడి రాబడికి ప్రభుత్వ హామీతో పాటు అనేక ప్రయోజనాలున్న పీపీఎఫ్​ ఖాతాలో ఏప్రిల్​ 5లోపే జమచేయడం మేలు. పన్ను మినహాయింపు కోసం ఏడాది చివరి వరకు వేచిచూసి, ఒకేసారి జమచేస్తే వడ్డీ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఎందుకంటే..

ppf deposit date for full month interest
ppf interest rate
author img

By

Published : Apr 2, 2022, 10:09 AM IST

PPF Deposit Date for Full Month Interest: ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌).. పెట్టుబడి, రాబడికి ప్రభుత్వ హామీ ఉండే.. ఈ పథకం ఎంతోమందిని ఆకర్షిస్తుంది. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనలో ఇది ఎంతో కీలకం. ఒకేసారి లేదా నెలనెలా ఇందులో జమ చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఈ ఖాతాలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1,50,000 వరకూ జమ చేసేందుకు అవకాశం ఉంది. పెట్టిన మొత్తానికి సెక్షన్‌ 80సీ నిబంధనల మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం వ్యవధి 15 ఏళ్లు. ఆ తర్వాత అయిదేళ్ల చొప్పున రెండుసార్లు పొడిగించుకునే వీలూ ఉంది. అంటే మొత్తం 25 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించవచ్చు. వచ్చిన వడ్డీపై ఎలాంటి పన్ను భారం ఉండదు.

ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఖాతాలో చాలామంది ఆర్థిక సంవత్సరం చివరకు వచ్చాక.. పన్ను మినహాయింపు కోసం మదుపు చేస్తుండటం చూస్తూనే ఉంటాం. కానీ, ఇది సరైన పద్ధతి కాదు. ఒకేసారి పీపీఎఫ్‌ ఖాతాలో జమ చేయాలనుకున్న వారు.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే అంటే.. ఏప్రిల్‌ 1 నుంచి 4 మధ్య పెట్టుబడి పెట్టాలి. నెలనెలా జమ చేసేవారూ 5వ తేదీకి ముందే ఆ పని పూర్తి చేయాలి.

కారణం ఏమిటంటే..

పీపీఎఫ్‌ నిబంధనల ప్రకారం నెలలోని 5వ తేదీ, చివరి రోజు మధ్య ఉన్న కనీస నిల్వ మొత్తంపైనే వడ్డీ లెక్కిస్తారు. అందుకే, అయిదో తేదీ లోపే జమను పూర్తి చేస్తే ఆ నెలలో చెల్లించిన మొత్తంపైనా వడ్డీ లభిస్తుంది. నెలనెలా వడ్డీ గణించినప్పటికీ.. ఆర్థిక సంవత్సరం ముగింపులోనే అసలులో కలుపుతారు. కాబట్టి, అధిక రాబడి కోసం ప్రతి నెలా 1-4 తేదీల్లోపే పీపీఎఫ్‌లో మీరు అనుకుంటున్న మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలి. ప్రస్తుతం పీపీఎఫ్‌లో 7.1 శాతం వార్షిక వడ్డీ అందుతోంది.

ఇదీ చూడండి: ఈపీఎఫ్‌కు మార్కెట్‌ అండ- ఈక్విటీలపై మెరుగైన లాభాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.