ETV Bharat / business

రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్​ డబ్బులు రిలీజ్​!.. ఎలా చెక్​ చేసుకోవాలంటే? - pm kisan samman nidhi scheme status

PM Kisan 14th Installment Date : ప్రధాని నరేంద్ర మోదీ జులై 27న పీఎం కిసాన్​ 14వ ఇన్​స్టాల్​మెంట్​ నిధులు విడుదల చేయనున్నారు. దీని ద్వారా 8.5 కోట్ల మంది భారతీయ రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున నిధులు జమ కానున్నాయి. మరి అర్హులైన రైతులు పీఎం-కిసాన్​ స్టేటస్​ను ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Kisan 14th instalment date
PM Kisan 14th instalment to be released on July 27
author img

By

Published : Jul 26, 2023, 1:04 PM IST

PM Kisan Samman Nidhi 2023 : భారతీయ రైతులందరీ శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్​) యోజన 14వ ఇన్​స్టాల్​మెంట్​ నిధులు జులై 27న విడుదల కానున్నాయి. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న 8.5 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ నిధులు చేరనున్నాయి.

2023 జులై 27న ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్​లోని శిఖర్​లో పీఎం కిసాన్​ నిధులు విడుదల చేయనున్నారు. ఇదే సందర్భంగా రైతులతో ముఖాముఖి కూడా జరుపుతారు. ఈ విషయాన్ని పీఎం-కిసాన్ స్కీమ్​​ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించడం జరిగింది.

పీఎం-కిసాన్​ బెనిఫిట్స్​!
PM Kisan Beneficiary Status : కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పీఎం-కిసాన్​ యోజనను ప్రారంభించింది. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలతో సహా రైతుల వ్యక్తిగత అవసరాలను తీర్చడమే ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం కింద భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.6000 అందిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మొత్తం మూడు విడతల్లో రూ.2000 చొప్పున రైతులకు అందిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ 13వ ఇన్​స్టాల్​మెంట్​ను​ ఫిబ్రవరిలో రిలీజ్​ చేయడం గమనార్హం.

అర్హులైన రైతులు పీఎం-కిసాన్​ నిధుల స్టేటస్​ను ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • స్టెప్​ 1 : ముందుగా అధికారిక వెబ్​సైట్​ pmkisan.gov.inను ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 2 : హోమ్​ పేజ్​లోని 'Farmers Corner' సెక్షన్​ పై క్లిక్​ చేయాలి. తరువాత దానిలోని 'Beneficiary Status'పై క్లిక్ చేయాలి.
  • స్టెప్​ 3 : రైతు ఆధార్​ నంబర్​ లేదా బ్యాంకు అకౌంట్​ నంబర్​ను ఎంటర్​ చేయాలి.
  • స్టెప్​ 4 : తరువాత 'Get Data'పై క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 5 : గెట్​ డేటాపై క్లిక్​ చేయగానే పీఎం-కిసాన్​ ఇన్​స్టాల్​మెంట్​ స్టేటస్​ మీకు కనిపిస్తుంది.

పీఎం-కిసాన్​ 14 ఇన్​స్టాల్​మెంట్​కు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవడం ఎలా?
PM Kisan Scheme Apply Online : అర్హులైన రైతులు పీఎం-కిసాన్​ 14 ఇన్​స్టాల్​మెంట్​ కోసం ఆన్​లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

  • స్టెప్​ 1 : అధికారిక వెబ్​సైట్​ pmkisan.gov.in ను ఓపెన్​ చేయాలి.
  • స్టెప్​ 2 : హోమ్​ పేజ్​లోని 'Farmers Corner' సెక్షన్​ పై క్లిక్​ చేయాలి.
  • స్టెప్​ 3 : New Farmer Registration పై క్లిక్​ చేసి, ఆధార్​ నంబర్​ ఎంటర్​ చేయాలి. తరువాత క్యాప్చాను ఫిల్​ చేయాలి.
  • స్టెప్​ 4 : రైతులు తమ వ్యక్తిగత, భూ వివరాలను నమోదు చేసి, దరఖాస్తు సబ్​మిట్​ చేయాలి.
  • స్టెప్​ 5 : భవిష్యత్​లో రిఫరెన్స్​ కోసం ఆ దరఖాస్తు ఫారమ్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

ఈ-కేవైసీ తప్పనిసరి
PM Kisan e kyc : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎం-కిసాన్​ యోజన యాప్​లో ఫేస్​ అథంటికేషన్​ ఫీచర్​ను తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు చాలా సులువుగా తమ e-KYC ప్రాసెస్​ పూర్తి చేయడానికి వీలువుతుంది. ఇంతకు ముందు ఈ-కేవైసీ కోసం ఒన్​ టైమ్​ పాస్​ వర్డ్​ లేదా ఫింగర్ ప్రింట్​ ఉపయోగించాల్సి వచ్చేది. వాస్తవానికి పీఎం-కిసాన్​ పథకం కోసం దరఖాస్తు చేసే రైతులందరూ ఈ-కేవైసీ చేసుకోవడం తప్పనిసరి.

ఇవీ చదవండి :

Gold Rate Today : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధర ఎంతంటే?

Retirement Planning : నెలకు రూ.50 వేలు పెన్షన్ ఇచ్చే.. బెస్ట్​ రిటైర్​మెంట్ ప్లాన్స్​​ మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.