petrol price increased: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 50 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. లీటర్ డీజిల్‌పై 55 పైసలు వడ్డించాయి. దీంతో పెట్రోల్ ధర రూ.99.11కు చేరుకోగా.. డీజిల్ ధర రూ.90.42కు ఎగబాకింది. ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఆరు రోజుల వ్యవధిలో ఐదుసార్లు ధరలు పెరిగినట్లైంది.
Mumbai Petrol price: ముంబయిలో లీటర్ పెట్రోల్‌పై 53 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.88కు చేరింది. డీజిల్ లీటర్ ధర రూ.98.13గా ఉంది.
• తాజా బాదుడు తర్వాత.. చెన్నైలో పెట్రోల్ ధర రూ.104.90, డీజిల్ ధర రూ.95గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.108.53, డీజిల్ రూ.93.57 పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో..
• ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 57 పైసలు, డీజిల్‌పై 60 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.112.35కు పెరిగింది. డీజిల్ ధర రూ.98.68కి చేరుకుంది.
• విశాఖపట్నంలో పెట్రోల్ ధర 55 పైసలు పెరిగి.. రూ.113.08కు చేరింది. డీజిల్ లీటర్ ధర 58 పైసలు అధికమై.. రూ.99.09కు ఎగబాకింది.
• గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర 54పైసలు అధికమై.. రూ.114.36కు చేరుకుంది. డీజిల్ ధర వంద రూపాయలు దాటింది. 57 పైసల పెంపుతో రూ.100.33కు చేరింది.
ఇదీ చదవండి: 'వాటి కోసం మైక్రోసాఫ్ట్ రూ.వేల కోట్ల ముడుపులు'