Petrol price hike: పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దేశవ్యాప్తంగా ధరలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరను 80 పైసల చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. తాజా నిర్ణయంతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.61కు చేరుకుంది. డీజిల్ ధర రూ.93.87కు ఎగబాకింది. కాగా, 12 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది పదోసారి కావడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.7.20 మేర పెరిగింది.
• ముంబయిలో పెట్రోల్, డీజిల్ ధరలు 85 పైసలు చొప్పున పెరిగాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.117.57కు చేరగా.. డీజిల్ ధర రూ.101.79కు పెరిగింది.
• హైదరాబాద్‌లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్ ధర 87 పైసలు పెరిగింది. దీంతో నగరంలో పెట్రోల్ ధర రూ.116.3కు చేరుకుంది. డీజిల్ ధర రూ.102.43కు ఎగబాకింది.
• గుంటూరులో లీటర్ పెట్రోల్ 88 పైసలు పెరిగి రూ.118.2కు చేరుకుంది. డీజిల్ ధర 84 పైసలు అధికమై రూ.103.94కు పెరిగింది.
• వైజాగ్‌లో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.116.91కు చేరింది. అటు, డీజిల్ ధర 84 పైసలు పెరిగి.. రూ.102.7కు ఎగబాకింది.