ETV Bharat / business

వ్యక్తిగత ప్రమాద బీమా తీసుకుంటున్నారా? ఇవి తెలుసుకోండి!

ప్రమాదం.. ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో అంతుపట్టదు. చిన్న సంఘటన జరిగినా.. కొన్నాళ్లపాటు ఆదాయం ఆగిపోయే పరిస్థితులు తలెత్తవచ్చు. ఇక కాస్త పెద్దదైతే..  నెలలపాటు ఇంటికే పరిమితం అయ్యే ఆస్కారముంది. ఇలాంటివి జరిగినప్పుడు ఆర్థికంగా అండగా నిలిచేది వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు. వీటి అవసరమేమిటి? ఎంపికలో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Personal Accident Insurance
వ్యక్తిగత ప్రమాద బీమా
author img

By

Published : Jun 19, 2022, 6:53 PM IST

అనారోగ్యం బారిన పడితే.. ఆరోగ్య బీమా ఆసుపత్రి ఖర్చులను చెల్లిస్తుంది. కానీ, ప్రమాదం జరిగినప్పుడు ఆర్జన శక్తిపై తాత్కాలికంగా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు పాక్షిక లేదా శాశ్వత వైకల్యం ఏర్పడవచ్చు. దీనివల్ల దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు వ్యక్తిగత ప్రమాద బీమా (పీఏసీ) అండగా ఉంటుంది. ఈ ప్రమాద బీమా పాలసీకి పలు అనుబంధాలను జోడించుకునే వీలూ ఉంటుంది. ప్రమాదవశాత్తూ మరణం, తాత్కాలిక/శాశ్వత వైకల్యం, పాక్షిక శాశ్వత వైకల్యం లాంటివి ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఈ అనుబంధ పాలసీల కోసం కొంచెం అదనంగా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది.

ఎవరికి ఇస్తారంటే..
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అయిదేళ్ల వారి నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న వారికి ఇస్తారు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీల తరహాలో వయసును బట్టి, ప్రీమియం మారదు. అన్ని వయసుల వారికీ ఒకే ప్రీమియం ఉంటుంది. అయితే, వ్యక్తుల ఆదాయం, వారికి ఎదురయ్యే ప్రమాదాల జాబితాను బట్టి, పాలసీ విలువ, ప్రీమియాన్ని నిర్ణయిస్తారు.

రెండు మార్గాల్లో...
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు రెండు రకాలుగా తీసుకునే అవకాశం ఉంది. సాధారణ బీమా సంస్థలు ఈ పాలసీని ప్రత్యేకంగా స్టాండలోన్‌ పాలసీగా అందిస్తున్నాయి. జీవిత బీమా సంస్థలు అనుబంధ పాలసీగానూ దీన్ని ఇస్తున్నాయి. సాధారణ బీమా సంస్థలు అందించే పాలసీని ఏటా పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. జీవిత బీమా పాలసీతోపాటు తీసుకున్నప్పుడు దీర్ఘకాలిక ఒప్పందంగా ఉంటుంది.

నష్టమేదైనా..
పూర్తిస్థాయి వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని ఎంచుకునేందుకే ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత పూర్తి వైకల్యం, శాశ్వత పాక్షిక వైకల్యం, తాత్కాలిక వైకల్యం తదితర సందర్భాల్లో పరిహారం ఇచ్చేలా పాలసీని ఎంచుకోవాలి. ప్రమాదం జరిగి, ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితుల్లో వారానికి కొంత మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంటుంది. ఇది పాలసీ విలువ ఆధారంగా నిర్ణయిస్తారు. కాబట్టి, పాలసీ ఎంచుకునేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఇది ఎంతో భరోసా కల్పిస్తోంది.

ఆదాయం ఆధారంగా..
ఎంత విలువకు ఈ పాలసీ ఇవ్వాలన్నది బీమా సంస్థల విచక్షణమీదే ఆధారపడి ఉంటుంది. వ్యక్తుల ఆదాయాన్ని బట్టి, గరిష్ఠ మొత్తాన్ని నిర్ణయిస్తారు. అయితే, అన్ని బీమా సంస్థలూ ఒకే తరహా నిబంధనలు పాటించవు. కొన్ని సాధారణ బీమా సంస్థలు వ్యక్తుల నెలవారీ ఆదాయానికి 72 రెట్ల వరకూ ప్రమాద బీమాను అందిస్తున్నాయి. కొన్ని వార్షికాదాయానికి 5 రెట్ల వరకూ విలువైన పాలసీనిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో గరిష్ఠంగా రూ.50 లక్షల పాలసీని అందిస్తున్నాయి. పాలసీదారుడికి ఎదురయ్యే రిస్కుల ఆధారంగానూ బీమా మొత్తం, ప్రీమియాన్ని బీమా సంస్థలు గణిస్తాయి. జీవిత బీమా సంస్థలు అందించే ప్రమాద బీమా పాలసీలు.. ప్రాథమిక పాలసీలో 30 శాతం వరకూ ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ఆదాయాన్ని భర్తీ చేసేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. అయితే చాలా బీమా సంస్థలు వారానికి రూ.6వేల నుంచి రూ.10వేల వరకూ పరిమితిని విధించాయి. దాదాపు 104 వారాల దాకా పరిహారం ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని పరిశీలించాలి.

ఎవరు తీసుకోవచ్చు?
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ప్రతి ఒక్కరికీ అవసరమనే చెప్పాలి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే యువతకు ఈ పాలసీ అత్యంత అవసరం. ప్రయాణాలు ఎక్కువగా చేసేవారు ఈ పాలసీని మర్చిపోకూడదు. టర్మ్‌ పాలసీతో పోల్చినా.. ప్రమాద బీమా పాలసీకి ప్రీమియం తక్కువే. టర్మ్‌ పాలసీతోపాటు, ఈ పాలసీని ఎంచుకోవడం వల్ల తక్కువ ప్రీమియానికే అత్యధిక రక్షణ పొందేందుకు వీలుంటుంది. ముఖ్యంగా రుణాలు తీసుకున్న వారు.. ఈ పాలసీని తీసుకోవాలి. ఆదాయం ఆగిపోయిన సందర్భంలో ఈ పాలసీ ద్వారా వచ్చే మొత్తంతో వాయిదాలు చెల్లించేందుకు వీలవుతుంది.

ఇదీ చూడండి: ఆరోగ్య బీమా ఆగిపోకుండా ఉండాలంటే?

సంపాదన మొత్తం ఈఎంఐలకే పోతుందా? ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.