Paytm Card Soundbox Launch : పేటీఎం బ్రాండ్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్ సెప్టెంబర్ 4న సరికొత్త కార్డ్ సౌండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది. దీని ద్వారా అన్ని వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, రూపే కార్డులతో.. సులువుగా నగదు చెల్లింపులు చేసుకోవడానికి వీలవుతుంది. దీనితో పాటు మొబైల్ చెల్లింపులు కూడా యథావిధిగా చేసుకోవడానికి వీలు ఉంటుంది.
యూపీఐ పాపులారిటీ
UPI Payment Sound Box : భారతదేశంలో నేడు యూపీఐ చెల్లింపులు బాగా విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ చాలా సులువుగా యూపీఐ ద్వారా రిటైల్ డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. అందుకే దీనిని మరింత ముందుకు తీసుకుపోవడానికి పేటీఎం సరికొత్త సౌండ్‌బాక్స్‌ను ఆవిష్కరించింది.
కార్డ్ బేస్డ్ పేమెంట్స్!
Paytm Card Soundbox Payments : ఇప్పటి వరకు చిరువ్యాపారులు.. మొబైల్ ఫోన్ ద్వారా చేసే యూపీఐ పేమెంట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ పేటీఎం తీసుకొచ్చిన ఈ లేటెస్ట్ సౌండ్‌బాక్స్‌తో.. కార్డ్ పేమెంట్స్ కూడా పొందడానికి వీలవుతుంది. ముఖ్యంగా వినియోగదారులు 'టాప్ అండ్ పే' విధానం ద్వారా తమ కార్డును ఉపయోగించి చాలా సులువుగా నగదు చెల్లించడానికి వీలవుతుంది. ఇది వ్యాపారులకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.
ఆడియో అలర్ట్
Paytm Card Based Sound Box Audio Alert : పేటీఎం సౌండ్‌బాక్స్ ద్వారా కార్డ్ లేదా మొబైల్ ఉపయోగించి నగదు చెల్లింపులు చేసినప్పుడు.. వెంటనే ఆ విషయం ఆడియో ద్వారా వినబడుతుంది. దీనితో నగదు చెల్లింపు జరిగిందా? లేదా? అని డివైజ్‌లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి 2019లోనే పేటీఎం.. ఆడియో బేస్డ్ పేమెంట్ కన్ఫర్మేషన్ సౌండ్ బాక్స్‌ను తీసుకొచ్చింది. భారతదేశంలో ఈ విధానం తీసుకొచ్చిన తొలి కంపెనీ పేటీఎం. తరువాత మిగతా కంపెనీలు దీనిని అనుసరించాయి.
గరిష్ఠంగా రూ.5000 వరకు చెల్లింపు!
Paytm Sound Box Card Payment Limit : పేటీఎం తీసుకొచ్చిన ఈ నయా సౌండ్‌బాక్స్ ద్వారా.. గరిష్ఠంగా రూ.5000 వరకు కార్డ్ పేమెంట్స్ చేయవచ్చు. కస్టమర్ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్‌ను కేవలం సౌండ్‌బాక్స్ ముందు ఉంచగానే.. పేమెంట్ షురూ అయిపోతుంది. పేమెంట్ జరిగిన వెంటనే ఆడియో కన్ఫర్మేషన్, ఎల్సీడీ డిస్ప్లేలో విజువల్ కన్ఫర్మేషన్ వస్తుంది.
మేడ్ ఇన్ ఇండియా!
Made In India Payment Sound Box : భారతదేశంలో తయారు చేసిన ఈ సౌండ్‌బాక్స్.. 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పనిచేస్తుంది. దీనిలో 4W స్పీకర్ ఉంటుంది. దీని బ్యాటరీ లైఫ్ 5 రోజులు ఉంటుంది.
11 భాషల్లో!
Paytm Sound Box Support Languages : పేటీఎం న్యూ సౌండ్‌బాక్స్ 11 భాషలను సపోర్ట్ చేస్తుంది. ఇది వ్యాపారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. వ్యాపారులు 'పేటీఎం ఫర్ బిజినెస్' అనే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
NFC స్మార్ట్ఫోన్స్తో కూడా!
Paytm Sound Box Mobile Payments : ఎన్ఎఫ్సీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కూడా.. పేటీఎం సౌండ్‌బాక్స్ ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. సింపుల్‌గా పేటీఎం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా వారు తమ పేమెంట్స్‌ను పూర్తి చేయవచ్చు.