ETV Bharat / business

PAN Aadhaar Link : ఆధార్​తో పాన్​ లింక్​ మర్చిపోకండి.. మరో 10 రోజులే గడువు​.. జత చేయండిలా

PAN Aadhaar Link : ఆధార్​తో పాన్​ను అనుసంధానం చేసుకోవడానికి ఆఖరి గడువు జూన్​ 30. ఈలోపు మీరు పాన్​-ఆధార్​ లింక్​ చేసుకోకపోతే మీ పాన్​ డీయాక్టివేట్​ అవుతుంది. అంతే కాదు మీరు బ్యాంకు ఖాతా తెరవలేరు. స్టాక్​మార్కెట్​లో పెట్టుబడులు కూడా పెట్టలేరు. పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవండి.

PAN Aadhaar linking
link your Aadhaar and PAN by June 30
author img

By

Published : Jun 18, 2023, 4:53 PM IST

PAN Aadhaar Linking : మీరు ఇంకా మీ పాన్​-ఆధార్​ అనుసంధానం చేసుకోలేదా? అయితే తొందరపడండి. ఈ జూన్​ 30లోపు మీ ఆధార్​తో పాన్​ను లింక్​ చేసుకోండి. ఒక వేళ మీరు ఈ రెండింటిని లింక్​ చేసుకోకపోతే.. జులై 1 నుంచి మీ పాన్​ డీయాక్టివేట్​ అవుతుంది. అంటే ఇక మీ పాన్​ పనిచేయదు.

రూ.1000 ఆలస్య రుసుము
మీరు ఇన్​కం టాక్స్​ ఈ-ఫైలింగ్​ వెబ్​సైట్​లో మీ ఆధార్​తో పాన్​ను అనుసంధానం చేసుకోవచ్చు. అయితే ఆలస్య రుసుము కింద రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ జూన్​ 30లోపు మీరు ఈ పనిచేయనట్లయితే.. తరువాతి నెలలో కూడా రూ.1000 అపరాధ రుసుము చెల్లించి ఆధార్​-పాన్​ లింకింగ్​ చేసుకోవచ్చు.

సమస్యలు వస్తాయి!

  • పాన్​-ఆధార్​ లింక్​​ చేయకపోతే.. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి, సెబీ నిబంధనల ప్రకారం​ మ్యూచువల్​ ఫండ్స్​, స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది.
  • పాన్​-ఆధార్​లను అనుసంధానం చేయకపోతే.. మీరు అదనంగా కట్టిన ఇన్​కం టాక్స్​కు రిఫండ్​ కూడా రాదు. అంతే కాదు ఈ రిఫండ్​పై వచ్చే వడ్డీని కూడా మీకు అందివ్వరు.
  • మీరు చెల్లించాల్సిన టీడీఎస్​, టీసీఎస్​లపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
  • చెల్లుబాటులేని పాన్​తో మీరు బ్యాంకు అకౌంట్​, డీమ్యాట్ ఖాతాలను తెరవడానికి వీలుపడదు.
  • ఒక వేళ ఇప్పటికే మీకు డీమ్యాట్​ ఖాతా ఉన్నప్పటికీ షేర్లలో మదుపు చేయడం సాధ్యం కాదు.
  • ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యులు అవుతారు. ముఖ్యంగా కేవైసీ నిబంధనలు పాటించకపోవడం వల్ల మీ పెట్టుబడి లావాదేవీలపై సెబీ పరిమితులు కూడా విధించే అవకాశం ఉంటుంది.

ఆధార్​-పాన్​ లింకింగ్​ ఎలా చేయాలి?

  • ముందుగా మీరు https://www.incometax.gov.in వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • మీరు ఇప్పటికే ఆధార్​-పాన్​ లింక్​ చేసుకున్నారో? లేదో? స్టేటస్​ చెక్​ చేసుకోండి.
  • ఒక వేళ లింక్​ చేసుకోకపోతే పోర్టల్​లో లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం యూజర్​ ఐడీ, పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకోవాలి.
  • తరువాత లింక్​ ఆధార్​ స్టేటస్​పై క్లిక్​ చేయాలి.
  • తరువాత ఈ-ఫైల్​ > ఈ-పే టాక్స్​ > న్యూ పేమెంట్​ క్లిక్​ చేయాలి.
  • ఇన్​కం టాక్స్​ ట్యాబ్​పై క్లిక్​ చేసి, 2024-25 అసెస్​మెంట్​ ఇయర్​ను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • తరువాత 'అదర్​ రెసిపెంట్స్ (500)'పై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ముందుగా ఫిల్​ చేసిన రూ.1000 కనిపిస్తుంది. దానిని క్లిక్​ చేసి, పేమెంట్​ను ఆన్​లైన్​లో కట్టేయాలి. తరువాత చలాన్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • ఆ తరువాత 'లింక్​ ఆధార్​'పై క్లిక్​ చేసి, తరువాత పాన్​, ఆధార్​ వివరాలు అందులో నమోదు చేయాలి. ఈ విధంగా మీరు పాన్​-ఆధార్​లను అనుసంధానం చేసుకోవాలి.

ఇక ఆలస్యం చేయవద్దు!
గతంలో ఆధార్​-పాన్​ అనుసంధానానికి 2023 మార్చి 31 వరకు గడువు ఇచ్చారు. తరువాత జూన్​ 30 వరకు ఈ గడువును పొడిగించారు. కానీ ఇకపై మీరు ఆలస్యం చేయకపోవడం మంచిది.

వీరికి మినహాయింపు ఉంది!
కొన్ని నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే ప్రజలకు, నాన్​ రెసిడెంట్స్​కు​, భారతీయ పౌరులు కానివారికి, 2022 నాటికి ఎనభై సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు మాత్రం పాన్​-ఆధార్​ అనుసంధానం నుంచి మినహాయింపు ఇచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.