Own House Benefits : మనలో చాలా మంది సొంత ఇళ్లు కొనాలా? అద్దెకు ఉండాలా? అనే విషయాన్ని తేల్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటూరు. వాస్తవానికి సొంతింటి కల నెరవేరడం అనేది సదరు కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్థిక స్తోమత లేనివారు అనివార్యంగా అద్దె ఇంట్లో ఉండాల్సి ఉంటుంది. అయితే ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకపోతే.. కచ్చితంగా సొంత ఇళ్లు కొనుక్కోవడం లేదా కట్టుకోవడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సొంతింటి వల్ల కొన్ని ప్రయోజనాలుంటాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
సొంత ఇంటిలో.. స్వేచ్ఛగా ఉండవచ్చు!
Own House Vs Rented House : సొంత ఇళ్లు అనేది చాలా మందికి ఉండే ఒక అద్భుతమైన కళ. ఎందుకంటే సొంత ఇళ్లు ఉంటే.. ఆ అనుభూతే వేరుగా ఉంటుంది. సొంత ఇంట్లో స్వేచ్ఛగా, మనకు నచ్చినట్లుగా ఉండవచ్చు. అదే అద్దె ఇళ్లు అయితే సౌకర్యాలు ఉండవచ్చు, లేకపోనూ వచ్చు. పైగా అద్దె ఇంట్లో మనకు నచ్చినట్లుగా, స్వేచ్ఛగా ఉండలేము. పైగా అద్దె ఇంటిలో ఉండేవారు మార్కెట్ హెచ్చు తగ్గులకు, ద్రవ్యోల్బణానికి లోబడి.. తరచూ పెరుగుతున్న అద్దెలను భరించవలసి ఉంటుంది. పైగా యజమాని చెప్పినప్పుడు ఇళ్లు ఖాళీ చేయాల్సి వస్తుంది.
ఆస్తి విలువ పెరుగుతుంది!
సొంత ఇల్లు అనేది దీర్ఘకాలిక పెట్టుబడి కిందకు వస్తుంది. ఎలా అంటే.. మీ ఆస్తి విలువ కాలం గడుస్తున్న కొద్దీ బాగా పెరుగుతుంది. భారత్‌లో రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువలు సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల మీరు కొనుగోలు చేసిన ఇంటి విలువ భవిష్యత్‌లో బాగా పెరుగుతుంది. అంటే ఎలాంటి శ్రమ లేకుండానే.. సంపద వృద్ధి చెందుతుంది.
స్థిరత్వం
Benefits Of Owning A Home Vs Renting : మీరు ఒక నిర్దిష్ట ప్రాంతంలో దీర్ఘ కాలంపాటు నివసించే అవకాశం ఉన్నట్లయితే సొంత ఇంటిని కలిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే.. ప్రాపర్టీ విలువలు దీర్ఘకాలంలో బాగా పెరుగుతాయి. ఇప్పుడు ఇళ్లు కొనకుండా అలక్ష్యం చేస్తే.. భవిష్యత్‌లో ఇళ్లు కొనాలంటే చాలా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది.
పరపతి పెరుగుతుంది!
సొంత ఇళ్లు ఉన్నవారికి సమాజంలో సహజంగానే పరపతి పెరుగుతుంది. మీ స్థిరమైన చిరునామా అందరికీ తెలుస్తుంది. మీరు ఎవరికైనా అద్దెకు ఇస్తే.. దాని ద్వారా మీకు అదనపు ఆదాయం సమకూరుతుంది.
మార్పులు, చేర్పులు
Renting House Advantages And Disadvantages : సొంతింటిలో మీ అభిరుచులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే మీ ఇంటికి పూర్తిగా లేదా పాక్షికంగా ఆధునిక హంగులను ఏర్పాటుచేసుకోవచ్చు. ఇలా ఇంటిని పునరుద్ధరించడం వల్ల ఆస్తి విలువ పెరగడమే కాకుండా అందులో నివసించే వారి జీవన నాణ్యత పెరుగుతుంది. అదే మీరు అద్దె ఇంట్లో ఉంటే.. ఇలాంటి అవకాశం ఏ మాత్రం ఉండదు. పోనీ మీ సొంత ఖర్చులతో ఏమైనా చేద్దామన్నా.. యజమాని ఒప్పుకునే అవకాశం ఉండకపోవచ్చు.
పన్ను ప్రయోజనాలు
Home Loan Tax Benefits : ఇంటిని కొనుగోలు చేయడానికి హోమ్‌లోన్ తీసుకుంటే అనేక పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్స్ 24 (బి), 80సి కింద రుణం మొత్తం, వడ్డీ చెల్లింపులపై పన్ను రాయితీ లభిస్తుంది. ముఖ్యంగా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 24 (బి) ప్రకారం.. ఇంటి రుణంపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
భరోసా ఇస్తుంది!
Benefits Of Owning A Home : పదవీ విరమణ తరువాత ప్రశాంతంగా జీవించడానికి సొంత ఇళ్లు అవసరం ఉంటుంది. అందుకే సంపాదన ప్రారంభించిన మొదట్లోనే హోమ్ లోన్ తీసుకుని ఇళ్లు నిర్మించుకోవడం మంచిది. ఎందుకంటే.. పదవీ విరమణ నాటికి ఇంటిపై ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేయవచ్చు. ప్రముఖ బ్యాంకులు సంవత్సరానికి 8-10% వడ్డీ రేటుతో 30 సంవత్సరాల దీర్ఘకాలిక వ్యవధితో ఇంటి రుణాలను అందిస్తున్నాయి. కనుక అర్హులైన ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన ఇంటిని కొనుగోలు చేసి వారి కలలను సాకారం చేసుకోవడం ఉత్తమం. దీనితో పదవీ విరమణ అయ్యేనాటికి రుణం మొత్తం తీరిపోతుంది. అలాగే పదవీ విరమణ తర్వాత ఒక స్థిరమైన ఆశ్రయంతో సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించడానికి వీలవుతుంది. పదవీ విరమణ తర్వాత మీరు ఇంటి యజమానిగా ఉంటూనే.. రివర్స్ మార్టిగేజ్ లోన్‌ను తీసుకోవచ్చు. దీనికి సొంతిల్లు ఉండడం ముఖ్యం. ఇలా రివర్స్ మార్టిగేజ్ చేయడం వల్ల నెలనెలా ఆదాయం పొందవచ్చు. ఒక వేళ ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. ఇంటిని తనఖా పెట్టి బ్యాంకు రుణం పొందవచ్చు.
భవిష్యత్తు తరానికి ఆర్థిక భద్రత
సొంతిల్లు అనేది తరతరాలపాటు కుటుంబ ఆస్తిగా కొనసాగుతుంది. దీని వల్ల భవిష్యత్ తరాలకు స్థిర నివాసం, ఆర్థిక భద్రతను కలుగుతాయి. కనుక మీకు పెద్దగా ఆర్థిక ఇబ్బందులు లేకపోతే.. అద్దె ఇంటిలో నివసించడం కంటే సొంతంగా ఇల్లు కొనుక్కోవడమే మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
UPI Vs UPI Lite : బేసిక్ ఫోన్‌తో పేమెంట్స్ చేయాలా?.. UPI & యూపీఐ లైట్ వాడండిలా!
Loan Default : ఒకసారి లోన్ డిఫాల్డ్ అయితే.. మళ్లీ బ్యాంక్ రుణం మంజూరు అవుతుందా?