Royal Enfield Bullet 350 Features : ద్విచక్ర వాహనాల్లో ఎన్ని బ్రాండ్స్ ఉన్నా.. మరెన్ని మోడల్స్ ఉన్నా.. రాయల్ ఎన్ఫీల్డ్లో ఉండే రాజసమే వేరు. దాని ప్రత్యేకమైన ఆహార్యం నుంచి అది చేసే శబ్ధం, దూసుకెళ్లే వేగం.. అన్నీ తనకు మాత్రమే సొంతం అనేలా ఉంటాయి. అందుకే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్‌కు భారీ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. దాదాపు 50కి పైగా దేశాల్లో ఈ బైక్ పరుగులు తీస్తోంది. గతేడాది వరల్డ్ వైడ్‌గా 60 వేల బైకులు విక్రయించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్.. అతి త్వరలో మరో కొత్త మోడల్‌తో మార్కెట్ లోకి దూసుకొస్తోంది. మరి, ఆ బైక్ ప్రత్యేకతలు ఏంటి? ఖరీదు ఎంత? ఇండియాలో ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సెప్టెంబర్‌లో న్యూ మోడల్..
New Royal Enfield Bullet 350 Model Launch in September 1st :
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మొదటిసారిగా 1932 నవంబర్‌లో.. లండన్‌లోని "ఒలింపియా మోటార్ సైకిల్ షో"లో ప్రదర్శించారు. ఆ ప్రదర్శన సమయంలోనే ఈ బైక్ పై యూత్ మనసు పారేసుకుంది. ఈ ద్విచక్ర వాహనంపై యువకులకు అప్పుడు పుట్టిన ప్రేమ.. దశాబ్దాలు మారుతున్నా.. పెరుగుతోందే తప్ప, తగ్గట్లేదు. ఈ బైక్‌పై యువతకు ఉన్న క్రేజ్‌కు అనుగుణంగా.. తయారీ దారులు కూడా కొత్త కొత్త మోడల్స్(New Royal Enfield Classic 350 Colors)ను రంగంలోకి దించుతున్నారు. ఈ సెప్టెంబర్ 1వ తేదీన రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ మోడల్‌ను ఆవిష్కరించబోతున్నారు. దాని పేరు రాయల్ ఎన్పీల్డ్ 350.
Upcoming Bikes : 2023లో లాంఛ్ కానున్న సూపర్ బైక్స్ ఇవే.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 ప్రత్యేకతలు..
- ఈ న్యూ మోడల్ డిజైన్.. చూడ్డానికి క్లాసిక్ 350 (New Royal Enfield Classic 350) తీరుగానే ఉంటుంది.
- కొన్ని చిన్న చిన్న మార్పులు అదనంగా ఉండే ఛాన్స్ ఉంది.
- ఈ బుల్లెట్ 350లో "సింగిల్-పీస్ సీటు" ఉంటుంది. హుడ్ లేకుండా రౌండ్ హాలోజన్ హెడ్‌ల్యాంప్ ఉండే అవకాశం ఉంది.
- రీడిజైన్ చేసిన టెయిల్ ల్యాంప్, రెక్టాంగిల్ బ్యాటరీ బాక్స్ ఉంటుందని టాక్.
బుల్లెట్ 350 ఇంజిన్ ఎలా ఉంటుంది?
New Royal Enfield Bullet 350 Engine :
- రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్-350 బైక్.. J-సిరీస్ 349 cc, ఎయిర్-ఆయిల్ కూల్ ఇంజన్‌తో రాబోతోందని సమాచారం.
- ఈ ఇంజిన్.. హంటర్-350, ఇంకా.. క్లాసిక్ 350 తీరుగా ఉండే ఛాన్స్ ఉంది.
- సుమారు 20 HP పవర్, 27 NM టార్క్‌ను రిలీజ్ చేస్తుందని అంచనా.
- ఈ బైక్‌లో 5 గేర్లు ఉండే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంచనా.
- 41 mm ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్స్, సిక్స్ స్టెప్స్ అడ్జస్టబుల్ రియర్-షాక్ అబ్జర్బర్స్ ఉంటాయని తెలుస్తోంది.
- రాయల్ ఎన్పీల్డ్ బుల్లెట్-350కి సంబంధించి ఎలాంటి ఫీచర్స్ నూ కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ 'కింగ్'.. మూతపడాల్సిన బుల్లెట్‌కు జీవం.. ఆస్తి ఎంతో తెలుసా?
బుల్లెట్ 350 ధర..
New Royal Enfield Bullet 350 Price
రాయల్ ఎన్‌ఫీల్డ్ చూడ్డానికి ఎంత రాజసంగా ఉంటుందో.. ధర కూడా అంతే ఉంటుంది. బైక్ ధర ప్రాంతాన్ని బట్టి కొంత మారుతూ ఉంటుంది. ఎక్స్పర్ట్స్ అంచనాల ప్రకారం.. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్-350 ధర 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. 2023 సెప్టెంబర్ 1నుంచే జనాలు కొనుగోలు చేయవచ్చు.
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మీకు ఈ విశేషాలు తెలుసా?
'రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 28 కొత్త మోడల్స్'