ETV Bharat / business

New Financial Rules From 1st November 2023 : నవంబర్​ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే.. ఇన్వెస్టర్లపై అదనపు ఛార్జీల మోత షురూ! - New Financial Rules From 1st November 2023

New Financial Rules From 1st November 2023 : ఈ నవంబర్ 1 నుంచి కొన్ని కీలక ఫైనాన్సియల్ రూల్స్ మారనున్నాయి. జీఎస్​టీ నిబంధనలు సహా ల్యాప్​టాప్​ దిగుమతులపై ఆంక్షలు, ఈక్విటీ డెరివేటివ్స్ లావాదేవీలపై విధిస్తున్న ఛార్జీల పెంపు లాంటి వివిధ అంశాలు​ నవంబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Five Big Financial Changes From Nov 1st
2023 November 1st New Financial Rules
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 3:48 PM IST

New Financial Rules From 1st November 2023 : కొత్తగా మారిన జీఎస్​టీ నిబంధనలు సహా ల్యాప్​టాప్​ దిగుమతులపై ఆంక్షలు, ఈక్విటీ డెరివేటివ్స్ లావాదేవీలపై విధిస్తున్న ఛార్జీల పెంపు, EPOలో మార్పులు లాంటి ఫైనాన్షియల్​ రూల్స్​ నవంబర్​ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

GSTలో మార్పులు..
Big Change in GST For Businesses : సెప్టెంబర్​లో జీఎస్​టీ మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం.. రూ.100 కోట్లు, ఆపై టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు తమ GST ఇన్​వాయిస్​లను 30 రోజుల్లోగా ఈ-ఇన్‌వాయిస్ పోర్టల్‌లో అప్​లోడ్​ చేయాల్సి ఉంటుంది. ఈ రూల్​ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ల్యాప్‌టాప్ దిగుమతులకు డెడ్​లైన్​..
Deadline For Laptop Import Restriction Ends : కేంద్ర ప్రభుత్వం కొన్ని నెలల క్రితం HSN 8741 కేటగిరికి చెందిన ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై పలు ఆంక్షలు విధించింది. అయితే కొన్ని కారణాలతో ఈ ఆంక్షల నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నవంబర్​ 1 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ గడువు తేదీని పెంచాలా? లేదా? అనే దానిపై ప్రభుత్వం పునరాలోచిస్తున్నట్లు సమాచారం.

BSE ట్రాన్సాక్షన్స్​ ఛార్జీలు పెంపు..
BSE To Increase Transaction Fee On Equity Derivative : ఈక్విటీ డెరివేటివ్స్ సెగ్మెంట్​కు సంబంధించిన లావాదేవీలపై విధిస్తున్న ట్రాన్సాక్షన్స్​ ఛార్జీలను పెంచనున్నట్లు తెలిపింది బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE). ఈ నిర్ణయం నవంబర్​ 1 నుంచి అమల్లోకి వస్తుందని గతనెల ప్రకటించింది.

EPOలో మార్పులు..
Changes In European Patent Office (EPO) : యూరోపియన్ పేటెంట్ ఆఫీస్-EPOలో ప్రస్తుతం ఉన్న 10-రోజుల రూల్​ నవంబర్ 1తో ముగియనుంది. అలాగే EPO నిబంధనల ప్రకారం.. ఏజెన్సీ జారీ చేసిన ఏదైనా కమ్యూనికేషన్​ 10 రోజుల తర్వాత వాటాదారుకు తెలియజేస్తారు. EPO డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా.. ఈ రూల్ అమలు​ వచ్చే నెల 1తో నిలిచిపోనుంది.

Kindle యూజర్లకు షాక్​..
Big Change For Kindle Readers : పోర్టెబుల్​ వైర్​​లెస్​ ఎలక్ట్రానిక్​ రీడింగ్​ డీవైజ్​ అయిన Kindle పరికరం.. ఇకపై కొన్ని రకాల ఫైల్స్​ సపోర్ట్ చేయదు. అమెరికన్​ కంపెనీ Amazon.com గతంలోనే ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై Kindle గ్యాడ్జెట్లు.. MOBI (.mobi, .azw, .prc) ఫార్మాట్‌లోని ఫైల్స్​ను సపోర్ట్​ చేయవు. ఇది నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. సాధారణంగా iOS, Android, Windows, Mac యూజర్​లు MOBI ఫార్మాట్​లోని ఫైల్స్​ను ఈ-మెయిల్​ లేదా Kindle యాప్స్​ ద్వారా ఇతరులకు పంపేవారు. ఇకపై ఆ అవకాశం ఉండదు.

How To Improve CIBIL Score With Credit Cards : సిబిల్ స్కోర్​ పెంచుకోవాలా?.. క్రెడిట్​ కార్డ్​లను ఉపయోగించండిలా!

How To Change Train Journey Date : ట్రైన్​ జర్నీ​ తేదీ మార్చాలా?.. పై క్లాస్​కు అప్​గ్రేడ్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.