ETV Bharat / business

కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా? అయితే ఈ ఆఫర్స్ మీ కోసమే! - కో బ్రాండెడ్‌ క్రెడిట్ కార్డులు

చేతిలో డబ్బు లేకపోయినా.. ఏదైనా కొనుగోలు చేసేందుకు క్రెడిట్‌ కార్డుతో వెసులుబాటు ఉంటుంది. అయితే కొత్తగా కార్డులు తీసుకునే వారిని ఆకట్టుకునేందుకు కార్డు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? ప్రత్యేక ఆఫర్లను పొందాలనుకుంటున్నారా? అయితే ఈ అంశాలను ఓ సారి తెలుసుకోండి.

new credit card offers
క్రెడిట్ కార్డు
author img

By

Published : Nov 22, 2022, 2:28 PM IST

కరోనా మహమ్మారి తర్వాత మళ్లీ వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో చిన్న రుణాలతోపాటు, క్రెడిట్‌ కార్డుల వినియోగం సైతం ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు కొత్తగా కార్డులు తీసుకునే వారిని ఆకట్టుకునేందుకు కార్డు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. పండగల వేళ ప్రత్యేక ఆఫర్లు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు మళ్లీ ఏడాది ముగింపు సందర్భంగా మరోసారి వీటిని తెరపైకి తెస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త క్రెడిట్‌ కార్డు తీసుకునేముందు ఏ అంశాలు పరిశీలించాలో తెలుసుకుందాం.

వ్యక్తుల ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర ఇలాంటివన్నీ క్రెడిట్‌ కార్డు విషయంలో కీలకంగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఏ విధమైన రుణం లేదా క్రెడిట్‌ కార్డు లేకపోతే.. ప్రాథమిక ప్రయోజనాలతో మాత్రమే కార్డును అందిస్తాయి. ఇప్పటికే మీకు రుణాలు ఉండి, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న వారికి ప్రీమియం ప్రయోజనాలున్న కార్డు వస్తుంది. 750కంటే ఎక్కువ స్కోరున్నప్పుడు క్రెడిట్‌ కార్డును పొందడంలో ఇబ్బందేమీ ఉండదు. కాకపోతే ఆదాయం స్థిరంగా లేని వారు కార్డు తీసుకునేటప్పుడు కొంత ఆలోచించి, నిర్ణయం తీసుకోవాలి. సాధారణ క్రెడిట్‌ కార్డుకు బదులుగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఆధారిత క్రెడిట్‌ కార్డును తీసుకోవడం మంచిది.

కార్డును ఎందుకు తీసుకుంటున్నారన్నదీ కీలకమే. మీ జీవన శైలి ఖర్చుల కోసమా.. లేక ఏదైనా కొనుగోళ్లకు ఉపయోగించుకుంటారా? అనేది స్పష్టంగా తెలుసుకోండి. మీ కార్డు ప్రయోజనాలు మీ అవసరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకోండి. ఉదాహరణకు మీరు ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారనుకుందాం. అప్పుడు ఆన్‌లైన్‌లో డిస్కౌంట్లు ఇచ్చే కార్డులేమిటో చూసుకొని, దాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి.

కొత్తగా వస్తున్న కార్డులు డిస్కౌంట్ల పేరుతో కొనుగోళ్లను ప్రోత్సహిస్తున్నాయి. నిజానికి అవి మీకు ఎంత వరకూ ఉపయోగపడతాయనేది చూసుకోవాలి. అంతేకానీ, భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడే వాటిని దృష్టిలో పెట్టుకొని, కార్డు ఎంపిక చేసుకోవద్దు. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార డెలివరీ సంస్థలు, ఇతర కొన్ని బ్రాండ్లతో ఒప్పందం కుదుర్చుకొని ఈ కార్డులు రాయితీలను అందిస్తుంటాయి. ఈ ప్రయోజనాల వల్ల మీకు ఎప్పుడోగానీ ఉపయోగం ఉండకపోవచ్చు.

ఉచితం కాదు..
కార్డు తీసుకునేటప్పుడు సంస్థలు ఉచితంగా అందిస్తున్నామనే చెబుతాయి. కానీ, దీనికి కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఏడాదికి ఎంత మొత్తం కొనుగోలు చేయాలి అనేది ఇందులో ముఖ్యమైనది. కొన్ని కార్డులు వార్షిక రుసుములను వసూలు చేసి, దీనికి బదులుగా కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిలో చాలా వరకూ మనం ఎప్పుడూ వినియోగించుకోనివే ఉంటాయి. హోటల్‌లో బస చేసినప్పుడు రాయితీ, గోల్ఫ్‌ కోర్సులు, విమానాశ్రయాల్లో లాంజ్‌ ప్రవేశంలాంటివి ఇందులో ఉంటాయి. మీరు అధికంగా ప్రయాణాలు చేసేవారైతే ఈ తరహా కార్డులను ఎంచుకోవచ్చు.

కో-బ్రాండెడ్‌ విషయంలో..
ప్రస్తుతం చాలా క్రెడిట్‌ కార్డులు కొన్ని బ్రాండ్లతో చేతులు కలిపి కో-బ్రాండెడ్‌ కార్డులను అందిస్తున్నాయి. మీకు ఆయా బ్రాండులతో ఎక్కువగా అనుబంధం ఉంటేనే ఈ తరహా కార్డులు మీకు ప్రయోజనం. అధికంగా రివార్డులు, రాయితీలు పొందవచ్చు. లేకపోతే దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు.

కార్డుకు సంబంధించిన నియమ నిబంధనలు సరిగ్గా తెలుసుకోండి. బిల్లింగ్‌ తేదీలపై అవగాహన ఉండాలి. సకాలంలో బిల్లులు చెల్లించినప్పుడే క్రెడిట్‌ కార్డు వల్ల ప్రయోజనం ఉంటుంది. కనీస చెల్లింపు, బిల్లు బాకీ పడటంలాంటివి అధిక వడ్డీలను ఆకర్షించే అవకాశం ఉంది. క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఎట్టి పరిస్థితుల్లోనూ నగదు తీసుకోరాదు. దీనిపై వార్షిక వడ్డీ 36-40 శాతం వరకూ విధించే అవకాశం ఉంది. మీ దగ్గర ఇప్పటికే క్రెడిట్‌ కార్డు ఉంటే.. మరో కార్డును తప్పనిసరిగా అవసరమైతేనే తీసుకోండి. ఇస్తున్నారు కదా అని అదే పనిగా కార్డులు తీసుకోవడం మంచిది కాదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.