ETV Bharat / business

అంబానీ ఇంట్లో స్పెషల్ పార్టీ.. అతిథుల ప్లేట్లలో కరెన్సీ నోట్లు.. ఎలా తిన్నారంటే? - రిలయన్స్​ ఫౌండేషన్​ ఛైర్​ పర్సన్​

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ప్రత్యేక విందు ఏర్పాట్లు చేశారు. అంబానీ ఇంట విందు అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ కలల ప్రాజెక్ట్​ ప్రారంభమైనందున.. అంబానీ కుటుంబం ఏర్పాటు చేసిన ఓ పార్టీలో అతిథులు తినేందుకు డబ్బు కట్టలను అందించారు. మరి అతిథులు వాటిని ఎలా తిన్నారంటే?

mukesh Ambani party
mukesh Ambani party
author img

By

Published : Apr 3, 2023, 6:06 PM IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ప్రత్యేకంగానే ఉంటుంది. రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ 'నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతి కేంద్రం(ఎన్​ఎమ్​ఏసీసీ)' గత శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సంతోషాన్ని పురస్కరించుకుని అంబానీ కుటుంబం దేశంలోని వివిధ రంగాల ప్రముఖులకు ప్రత్యేక విందు ఏర్పాట్లు చేసింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు ఈ విందుకు హాజరయ్యారు. అయితే ఈ విందులో అతిథులకు నోట్ల కట్టలను వచ్చించారు. నోట్ల కట్టలేంటీ.. తినడమేంటీ? అని అనుకుంటున్నారా.. వాటిని అలా ఎందుకు పెట్టారంటే..?

అంబానీ పార్టీలో విందులో డైనింగ్ టేబుళ్లపై నోట్ల కట్టలు ఉండటాన్ని చూసి కొందరు వ్యక్తులు ఆ ఫొటోలను సోషల్​మీడియాలో షేర్​ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్​ అవుతున్నాయి. అతిథులకు వడ్డించడానికి రెడీగా ఉంచిన ఓ డిజర్ట్‌ ఫొటో అది. గిన్నెలో ఆకు వేసి అందులో కొన్ని కరెన్సీ నోట్లు, వాటి పక్కనే స్వీట్లు పెట్టారు. సరిగ్గా గమనిస్తే అవి నిజమైన కరెన్సీ నోట్లు కాదని తెలుస్తుంది. ఆ ప్రత్యేక వంటకం కూడా దిల్లీలో లభించే చాలా పాపులర్‌ అయిన 'దౌలత్‌ కి చాట్‌' అనే నోరూరించే స్వీట్​.

mukesh Ambani party
అతిథులకు అంబానీ ప్యామిలీ స్పెషల్ పార్టీ

అసలేంటీ దౌలత్​ కి చాట్​..?
నోరూరించే ఈ రుచికరమైన వంటకం దిల్లీ సహా ఉత్తర భారత్‌లోని పలు ప్రాంతాల్లో లభిస్తుంది. అది కూడా కేవలం శీతాకాలంలో మాత్రమే రెండు నెలల పాటు దొరుకుతుంది. చిక్కటి పాల నుంచి తీసిన నురుగుతో దీన్ని తయారు చేస్తారు. ఈ స్వీటుపైన పిస్తా, కోవా, చక్కెర పొడి వేసి ఈ ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. నాణ్యమైన ఆహార పదార్థాలతో దీన్ని తయారుచేయడం వల్ల దీన్ని 'దౌలత్‌ కి చాట్‌' అని పిలుస్తారు. ఈ స్పీట్​ పేరులోనే సంపద ఉంది. దీంతో దిల్లీకి చెందిన 'ఇండియన్‌ అసెంట్‌' అనే రెస్టారంట్‌ ఈ డిజర్ట్‌తో పాటుగా నకిలీ కరెన్సీ నోట్లను దాని చుట్టూ పెట్టి విక్రయిస్తోంది. దీంతో ఈ వంటకం చాలా పాపులర్‌ అయ్యింది. ఆ ప్రత్యేక వంటకాన్నే అతిథులకు వడ్డించింది అంబానీ కుటుంబం. సోషల్​ మీడియాలో ఈ ఫొటోలను చూసిన వారు.. తెగ కామెంట్లు చేస్తున్నారు.

దీంతో పాటుగా ఈ పార్టీకి విచ్చేసిన అతిథులకు అంబానీ కుటుంబం ఎన్నో ప్రత్యేక వంటకాలను వడ్డించినట్లు తెలుస్తోంది. వెండి కంచాల్లో విందు ఏర్పాట్లు చేశారు. ఈ విందు భోజనంలో పాలక్ పన్నీర్‌, పప్పు, కూర, రోటీ, హల్వా, డిజర్ట్‌, పాపడ్‌, లడ్డూ వంటి పలు రకాల భారతీయ సంప్రదాయ వంటకాలను కూడా వడ్డించినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం నీతా అంబానీ కలల ప్రాజెక్ట్​ 'నీతా ముకేశ్ అంబానీ సాంస్కృతి కేంద్రం' ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంబానీ కుటుంబం మూడు రోజుల పాటు ప్రత్యేక వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకలకు హాలీవుడ్‌, బాలీవుడ్​ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నేతలు, క్రీడారంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.