ముకేశ్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు. సూమారు రూ.7 లక్షల కోట్ల సంపదతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ముకేశ్ అంబానీ.. తన కుటుంబంతో ముంబయిలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస సముదాయమైన 27 అంతస్తుల ఆంటిలియా భవంతిలో ఉంటున్నారు. అయితే, అంబానీ డ్రైవర్‌కు సంబంధించిన ఓ వార్చ నెట్టింట్లో చర్చనీయాంశమవుతోంది. అంబానీల కారు డ్రైవర్ నెల జీతం.. టాప్ మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల కన్నా ఎక్కువగా ఉంటుందట. అలాంటి అంబానీ ఖరీదైన కార్ల డ్రైవర్ల గురించి, వారి జీత భత్యాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
అంబానీ డ్రైవర్ల జాబ్ అంత సింపుల్‌గా ఏమీ ఉండదు. కారు నడపడం ఒక్కటే వీరి బాధ్యత కాదు. ఓ ప్రైవేటు కాంట్రాక్టింగ్ సంస్థ నుంచి వీరిని తీసుకుంటారు. అప్పటి నుంచి వారి అంబానీల ఇంట్లో ప్రయాణం మొదలవుతుంది. అంబానీల లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా.. వారికి కఠినమైన శిక్షణ ఇస్తారు. కమర్షియల్, లగ్జరీ వాహనాలను నడపడంలో అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుంటారు. వాహనాల్లోని అదనపు భద్రతా ఫీచర్ల గురించి శిక్షణ ఉంటుంది. అయితే, సాధారణంగా అంబానీలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాల్లోనే వెళ్తారు. కానీ, కొన్ని పరిస్థితుల్లో బండి నడపడమే కాకుండా.. అలాంటి లగ్జరీ కార్లలో ఉన్న ప్యాసింజర్ల రక్షణ, భద్రత కూడా డ్రైవర్ చూసుకోవాలి. కాగా, ఇలాంటి డ్రైవర్లను ఏ ఏజెన్సీ ప్రొవైడ్ చేస్తుంది అన్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతారు. ఇక, అంబానీ ఫ్యామిలీకి పనిచేసే డ్రైవర్ల వ్యక్తిగత వివరాలు కూడా బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడతారు.
గతంలో అంబానీకి డ్రైవర్‌గా పనిచేసే ఓ వ్యక్తి మాట్లాడిన వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టింది. అందులో తన శాలరీ నెలకు దాదాపు రూ.2 లక్షలు ఉంటుందని ఆ డ్రైవర్ వెల్లడించారు. ఇలా అయితే ఏడాదికి కనీసం రూ. 24 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. కాగా, ఇది ఐదేళ్ల క్రితం వచ్చిన వీడియో. ఒకవేళ అతడు చెప్పిందే నిజమైతే.. ఇప్పటికి ఆ జీతం మరింత పెరిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది సాఫ్ట్వేర్ జాబ్ చేసే చాలా మంది ఉద్యోగుల కన్నా అధికమే. ముకేశ్ అంబానీకి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇవే కాకుండా అంబానీకి ప్రైవేటు జెట్లు, విలాసవంతమైన నౌకలు ఉన్నాయి. ఇక అంబానీ డ్రైవర్ల శాలరీ విషయంపై సోషల్ మీడియాలో మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి. ముకేశ్ అంబానీ ఆంటీలియాలా డ్రైవర్ల ఇళ్లు ఈ విధంగా ఉంటాయని చూపిస్తున్నారు. ఇక, బెంజ్ కార్ల లోగోలను డ్రైవర్లు లంచ్ బాక్స్‌లుగా వాడుకుంటారని ఫొటోలు పెడుతున్నారు. టాప్ సాఫ్ట్వేర్ కంపీనీల్లో పనిచేసే ఇంజినీర్ల జీతాల కన్నా.. అంబానీ డ్రైవర్ల సాలరీ ఎక్కువగా ఉందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
-
Mukesh ambani's driver's house 😜 pic.twitter.com/BtBS1ZSV2g
— Phani Shankar (@phanishankar) January 5, 2017 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mukesh ambani's driver's house 😜 pic.twitter.com/BtBS1ZSV2g
— Phani Shankar (@phanishankar) January 5, 2017Mukesh ambani's driver's house 😜 pic.twitter.com/BtBS1ZSV2g
— Phani Shankar (@phanishankar) January 5, 2017
-
*Ambani's driver at lunch time * pic.twitter.com/cUnDcA3MC5
— Tweetera🐦 (@DoctorrSays) May 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">*Ambani's driver at lunch time * pic.twitter.com/cUnDcA3MC5
— Tweetera🐦 (@DoctorrSays) May 14, 2021*Ambani's driver at lunch time * pic.twitter.com/cUnDcA3MC5
— Tweetera🐦 (@DoctorrSays) May 14, 2021
-
Kabhi socha hai, Mukesh Ambani's personal driver earns more than the top software engineers from the top multinational companies.
— Ajay Kareer (@ajaykareer) October 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Kabhi socha hai, Mukesh Ambani's personal driver earns more than the top software engineers from the top multinational companies.
— Ajay Kareer (@ajaykareer) October 5, 2022Kabhi socha hai, Mukesh Ambani's personal driver earns more than the top software engineers from the top multinational companies.
— Ajay Kareer (@ajaykareer) October 5, 2022