ETV Bharat / business

కొత్త సంవత్ ప్రారంభం- 'మూరత్ ట్రేడింగ్​'తో లాభాల్లో ముగిసిన మార్కెట్లు - మూరత్​ ట్రేడింగ్​ 2023 తేదీటైమ్​

muhurat trading time 2023 live updates
muhurat trading time 2023 live updates
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2023, 2:38 PM IST

Updated : Nov 12, 2023, 7:27 PM IST

19:19 November 12

దీపావళి సందర్భంగా జరిగిన మూరత్​ ట్రేడింగ్​లో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సాయంత్రం 6 గంటల 15 నుంచి 7 గంటల 15 నిమిషాల వరకు సాగిన ట్రేడింగ్​లో.. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజీ 354 పాయింట్ల లాభంతో 65,259 వద్ద ముగించింది. జాతీయ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 19,525 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.83.30గా ఉంది. మూరత్‌ ట్రేడింగ్‌లో దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. అంతకుముందు ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్​ హోల్డింగ్స్​ లిమిటెడ్​ సీఈవో దీనానాథ్​ దుభాషి​ ముఖ్య అతిథిగా హాజరై.. గంట కొట్టి ట్రేడింగ్​ను ప్రారంభించారు.

18:17 November 12

muhurat trading time 2023 live updates
గంట కొట్టి ప్రారంభిస్తున్న ఎల్​ అండ్​ టీ ఫైనాన్స్​ హోల్డింగ్స్​ లిమిటెడ్​ సీఈవో దీనానాథ్​ దుభాషి

దీపావళి సందర్భంగా స్టాక్‌ మార్కెట్లలో ప్రతి ఏటా ప్రత్యేకంగా నిర్వహించే మూరత్‌ ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ప్రారంభ కొనుగోళ్లలో బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ 360 పాయింట్లు లాభపడి 65,265 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 104 పాయింట్లు లాభపడి 19,529 దగ్గర ట్రేడ్‌ అవుతోంది.

14:14 November 12

మూరత్​ ట్రేడింగ్​

Muhurat Trading 2023 Live Updates : దీపావళి నుంచి తదుపరి దీపావళి వరకు కాలాన్ని సంవత్‌గా వ్యవహరిస్తారు. 2079 సంవత్‌ ట్రేడింగ్‌ శుక్రవారంతో పూర్తయింది. ఆదివారం 2080 సంవత్‌ ప్రారంభం అయింది. స్టాక్‌ మార్కెట్‌లో దీపావళి పర్వదినం రోజు ట్రేడింగ్‌ చేస్తే.. మళ్లీ వచ్చే దీపావళి వరకు లాభాల పంట పండుతుందన్నది మదుపర్ల నమ్మకం. అందులో భాగంగానే స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ప్రతి ఏడాది దీపావళి రోజు ప్రత్యేకంగా మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహిస్తాయి. ఇది ఒక గంట పాటు కొనసాగుతుంది. దీనికి తోడు 15 నిమిషాల పాటు ప్రీ మార్కెట్ సెషన్​ ఉంటుంది. స్టాక్‌ ఎక్స్ఛేంజీలే సమయాన్ని నిర్ణయిస్తాయి. ధన త్రయోదశి నాడు ఎలాగైతే కనీసం ఒక్క గ్రాము బంగారం అయినా కొనాలనుకుంటారో.. ఈ సమయంలో కూడా కనీసం ఒక్క స్టాక్‌ అయినా కొనాలని చాలామంది ట్రేడర్ల సెంటిమెంట్​. దీపావళి రోజు స్టాక్‌ బ్రోకింగ్‌ కార్యాలయాలన్నీ దీపకాంతుల్లో వెలిగిపోతుంటాయి.

2023 మూరత్​ ట్రేడింగ్ సమయం :

  • ఓపెనింగ్ సెషన్- సాయంత్రం 6.00 గంటలకు
  • క్లోజింగ్ సెషన్-​ సాయంత్రం 7.15 గంటలకు
  • ప్రీ ఓపెన్​ సెషన్- సాయంత్రం 6.00 నుంచి 7.15 గంటల మధ్య 15 నిమిషాలు

మూరత్​ ట్రేడింగ్ ప్రారంభమైంది అప్పుడే!
ముహూరత్ ట్రేడింగ్ అనేది దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముహూరత్ ట్రేడింగ్​ను మొదట బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో 1957లో ప్రారంభించారు. ఆ తర్వాత 1992లో జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపించినప్పుడు అదే ఏడాది ఈ ట్రేడింగ్ ప్రారంభమైంది. ఈ ట్రేడింగ్​తో కొత్త హిందూ సంవత్సరం ప్రారంభమైనట్లు పరిగణిస్తారు. సంపదకు, ధనానికి దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తూ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ముహూరత్​ను మంచి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఏ పని చేపట్టినా మంచి ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు.

మదుపర్లు ఇవి దృష్టిలో పెట్టుకోవాలి..

  • చాలా మంది ట్రేడర్లు, మదుపర్లు కేవలం సెంటిమెంటు కోసం మాత్రమే లావాదేవీలను నిర్వహిస్తారు.
  • ట్రేడింగ్‌ ముగిసే సమయానికి ఓపెన్‌గా ఉన్న పొజిషన్లకు సెటిల్‌మెంట్‌ నిబంధనలు వర్తిస్తాయి.
  • ట్రేడర్లు నిరోధం(రెసిస్టెన్స్‌), మద్దతు(సపోర్ట్‌) స్థాయిలను క్షుణ్నంగా పరిశీలించుకోవాలి.
  • కంపెనీ ఫండమెంటల్స్‌ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ట్రేడింగ్‌ చేయాలి. మీ దీర్ఘకాల పెట్టుబడి ప్రణాళికల ప్రకారం స్టాక్స్‌ను కొనుగోలు చేయాలి.
  • అయితే ఈ రోజు కొన్న స్టాక్ కచ్చితంగా రాబడి ఇస్తుందని నమ్మకం లేదు. లాభాలు పూర్తిగా ఆ కంపెనీ పనితీరుపైన మాత్రమే ఆధారపడి ఉంటాయనే విషయం గుర్తుంచుకోవాలి.

గమనిక : స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకొన్న అంశం. కాబట్టి స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం. పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.

Last Updated : Nov 12, 2023, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.