ETV Bharat / business

MRF stock price : ఎంఆర్​ఎఫ్ నయా చరిత్ర​.. రూ.లక్ష మార్క్​ దాటిన స్టాక్​ విలువ - లక్ష రూపాయలకు చేరిన ఎంఆర్​ఎఫ్​ షేర్​ విలువ

MRF stock price : భారత్​లో లక్ష రూపాయల మార్క్​ దాటిన తొలి స్టాక్​గా ఎంఆర్​ఎఫ్​ చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సర ఫలితాలు మెరగ్గా ఉండడం, బయ్యర్లు షేర్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండడం ఇందుకు కారణం.

MRF stock price hits Rs 1 lakh mark
MRF share price
author img

By

Published : Jun 13, 2023, 2:13 PM IST

Updated : Jun 13, 2023, 3:06 PM IST

MRF stock price : ప్రముఖ టైర్ల తయారీ సంస్థ ఎంఆర్​ఎఫ్​ షేర్​ ధర లక్ష రూపాయలు దాటింది. భారతదేశంలో రూ.1 లక్ష మార్క్​ దాటిన తొలి స్టాక్​గా ఇది చరిత్ర సృష్టించింది. మంగళవారం కంపెనీ షేర్​ విలువ లక్ష రూపాయల మార్క్​ను దాటి జీవనకాల గరిష్ఠాన్ని తాకింది.

చేరువగా వచ్చి.. వెనక్కి
గత నెలలోనే ఎంఆర్​ఎఫ్​ షేర్ దాదాపుగా రూ.1 లక్ష మార్క్​కు చేరువగా వచ్చి, తరువాత వెనక్కిమళ్లింది. ప్యూచర్స్​ మార్కెట్​లో మాత్రం మే 8న ఈ కీలక మైలు రాయిన దాటి మదుపరుల్లో మరింత ఆత్రుతను పెంచింది. మంగళవారం ఎన్​ఎస్​ఈలో 1.48 శాతం లాభంతో రూ.1,00,439.95 దగ్గర ఎంఆర్​ఎఫ్​ ప్రారంభమైంది. బీఎస్​ఈలో రూ.1,00,300 వద్ద ట్రేడింగ్​ స్టార్ట్​ చేసింది.

46 శాతం పెరిగిన షేర్​ వాల్యూ
ఏడాది వ్యవధిలోనే ఎంఆర్​ఎఫ్​ షేర్​ వాల్యూ 46 శాతం పెరగడం విశేషం. మే 8న ఈ స్టాక్​ స్పాట్​ మార్కెట్​లో రూ.99,933 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మెరుగైన త్రైమాసిక, వార్షిక ఫలితాలు కలిసివచ్చి స్టాక్​ ర్యాలీకి ఊపునిచ్చాయి.

రెండున్నర ఏళ్ల పట్టింది!
2021 జనవరిలో ఎంఆర్​ఎఫ్​ షేర్​ తొలిసారి రూ.90వేలు మార్క్​ను క్రాస్​ చేసింది. అక్కడి నుంచి రూ.1 లక్ష మైలు రాయిని చేరేందుకు ఈ స్టాక్​కు దాదాపుగా రెండున్నర ఏళ్లు పట్టింది.

షేర్లు విభజించడం లేదు!
వాస్తవానికి స్టాక్​ విలువ అమాంతం పెరుగుతున్నప్పటికీ.. కంపెనీ మాత్రం షేర్లను విభజించకపోవడం విశేషం. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి బోనస్​ షేర్లను జారీ చేయకపోవడం గమనార్హం. సాధారణంగా షేర్ల విలువ భారీగా పెరిగినప్పుడు కంపెనీలు వాటిని విభజిస్తూ ఉంటాయి. ఫలితంగా సామాన్య రిటైల్​ మదుపర్లు కూడా వాటిని కొనేందుకు వీలవుతుంది. కానీ ఎంఆర్​ఎఫ్ ఆ దిశగా ఎన్నడూ అడుగులు వేయలేదు.

డివిడెండ్స్ ఇస్తోంది!
2022-23కిగాను ఎంఆర్​ఎఫ్​ మే 3వ తేదీన రూ.169 డివిడెండ్​ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3 చొప్పున రెండు సార్లు మధ్యంతర డివిడెండ్​లను ఇచ్చింది. మార్చితో ముగిసిన త్తైమాసికంలో ఎంఆర్​ఎఫ్​ లాభం దాదాపు రెండింతలు పెరిగి రూ.410.7 కోట్లుగా నమోదు అయ్యింది. ఆదాయం 10.1 శాతం పెరిగి రూ.5,725.4 కోట్లకు చేరుకుంది.

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఎంఆర్​ఎఫ్​ మొత్తంగా 42,41,143 షేర్లను జారీ చేసింది. వీటిలో 72 శాతం షేర్లు అంటే 30,60,312 షేర్లు పబ్లిక్​ షేర్​ హోల్డర్ల వద్ద ఉన్నాయి. వీటిలోన రిటైల్ షేర్​ హోల్డర్ల వాటా కేవలం 12.73 శాతం మాత్రమే. ప్రమోటర్ల వద్ద 27.84 శాతం అంటే 11,80,831 షేర్లు ఉన్నాయి.

రిలయన్స్​కు... ఫోర్బ్స్​ టాప్​ 45 ర్యాంక్​
ప్రముఖ భారతీయ బిలియనీర్​ ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్​ కంపెనీ.. ఫోర్బ్స్​ గ్లోబల్​ 2000 లిస్ట్​లో 45 ర్యాంకును సాధించింది. గతేడాదితో పోల్చితే 8 స్థానాలు ఎగబాకిన రియలన్స్​.. భారత కంపెనీలు అన్నింటి కంటే అగ్రస్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్​ మెట్రిక్స్​: అమ్మకాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్​ విలువ అనే నాలుగు సూచీలను తీసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్​ కంపెనీల ర్యాంకులను ఫోర్బ్స్​ ప్రకటించింది. దాదాపు 55 భారతీయ సంస్థలు, బ్యాంకులు కూడా ఫోర్బ్స్​ ర్యాంకింగ్​లను పొందాయి. ఎస్​బీఐ 77వ ర్యాంకు, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు 128 ర్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 163 ర్యాంకుల్లో నిలిచాయి. కాగా గతేడాది టాప్​లో ఉన్న ఆదానీ గ్రూప్​ కంపెనీలు.. ఆదానీ ఎంటర్​ప్రైజెస్​ 1062, ఆదానీ పవర్​ 1488, ఆదానీ పోర్ట్స్​ & స్పెషల్​ ఎకనామిక్ జోన్స్​ 1598 ర్యాంకులకు పడిపోయాయి.

ఇవీ చదవండి:

Last Updated : Jun 13, 2023, 3:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.