ETV Bharat / business

Modi Sundar Pichai : సుందర్ పిచాయ్​తో మోదీ వర్చువల్​ మీట్​.. ఆ ప్రణాళికలపై చర్చలు - Sundar Pichai Thanks PM Modi

Modi Sundar Pichai : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగూల్ ప్రణాళిక గురించి చర్చించారు.

Modi Sundar Pichai
Modi Sundar Pichai
author img

By PTI

Published : Oct 17, 2023, 6:38 AM IST

Updated : Oct 17, 2023, 9:11 AM IST

Modi Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడంలో గూగూల్ ప్రణాళిక గురించి చర్చించారు. గాంధీనగర్‌లోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ -GIFTలో గూగుల్ తన గ్లోబల్ ఫిన్‌టెక్ కార్యకలాపాల కేంద్రాన్ని ప్రారంభించే ప్రణాళికలను ప్రధాని స్వాగతించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో న్యూదిల్లీలో భారత్ నిర్వహించనున్న AI సమ్మిట్‌లో.. గ్లోబల్ భాగస్వామ్యానికి సహకరించాల్సిందిగా గూగుల్‌ను మోదీ ఆహ్వానించారు.

  • PM Modi virtually interacted with the CEO of Google and Alphabet Sundar Pichai earlier today. During the interaction, the Prime Minister and Pichai discussed Google's plan to participate in expanding the electronics manufacturing ecosystem in India. Prime Minister appreciated… pic.twitter.com/ORZSQrL2iC

    — ANI (@ANI) October 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Modi Interaction With Sundar pichai Today : అటు జీ-పే, UPI బలాన్ని, రీచ్‌ను ఉపయోగించుకోవడం ద్వారా భారత్‌లో ఆర్థిక చేరికలను మెరుగుపరచడానికి గూగుల్ ప్రణాళికల గురించి ప్రధానికి పిచాయ్ తెలిపారు. భారత్‌ అభివృద్ధి పథంలో వెళ్లేందుకు గూగుల్ నిబద్ధత గురించి కూడా పిచాయ్ పేర్కొన్నారు. వర్చువల్ సమావేశం అనంతరం.. దేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో HPతో గూగుల్ భాగస్వామ్యాన్ని మోదీ అభినందించారని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. గూగుల్ 100 భాషల చొరవను గుర్తించిన ప్రధాని.. భారత భాషలలో AI సాధనాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలను ప్రోత్సహించారని పేర్కొంది. గూగుల్ సంస్థ భారత్​లో చేపట్టిన ప్రణాళికలపై ప్రధాని మోదీతో భేటీ అద్భుతమని చెప్పారు మాతృసంస్థ సీఈఓ సుందర్ పిచాయ్.

  • "Thank you, Prime Minister Narendra Modi for the terrific meeting today to discuss Google's ongoing commitment to India, and how we are expanding our operations, leveraging AI, and increasing our partnerships," tweeted Sundar Pichai, CEO of Google and Alphabet https://t.co/oOMVRIvj1W pic.twitter.com/EtSppISyWg

Sundar Pichai Modi Meeting : గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీని దిల్లీలో కలిశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. ఆవిష్కరణలు, సాంకేతికత సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన సుందర్ పిచాయ్.. జీ20 కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో తాము భారత్​తో కలిసి పనిచేస్తామని తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశంలో సాంకేతికపరమైన మార్పులు వేగంగా జరుగుతున్నాయని కితాబిచ్చారు.

Sundar Pichai Salary Per Year : గూగుల్​ సీఈఓ భారత సంతతి వ్యక్తి గూగుల్ పిచాయ్​ ఏకంగా 1,850 కోట్ల పారితోషికాన్ని పొందారు. గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ. దీంతో సుందర్ పిచాయ్​కు ఇంత మొత్తం ఎలా వచ్చిందో? తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

'AIని తల్చుకుంటే నిద్ర పట్టట్లేదు.. ఆ సమాధానాలు ఎలా వస్తున్నాయో తెలీదు!'

సుందర్​ పిచాయ్​కు బిగ్ షాక్.. రోబో చేసిన చిన్న మిస్టేక్​తో 100 బిలియన్ డాలర్లు నష్టం

Last Updated : Oct 17, 2023, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.