MAadhaar Paperless Offline E KYC Feature : ఎమ్ఆధార్ యాప్‌లో 'పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ' ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి యూఐడీఏఐ ఈ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ
ఆధార్ ఈ-కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయడానికి అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల చాలా సమయం, డబ్బు వృథా అవుతాయి. పైగా పర్యవరణానికి కూడా నష్టం వాటిల్లుతుంది. దీనిని నివారించడానికే యూఐడీఏఐ mAadhaar యాప్‌లో పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఈ-కేవైసీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనితో యూజర్లు యాప్‌లోనే షేరబుల్ డాక్యుమెంట్లను రూపొందించుకోవచ్చు. వీటిని ఆఫ్‌లైన్‌లో ఆధార్ అథంటికేషన్ కోసం ఉపయోగించుకోవచ్చు.
ఈ-కేవైసీ ప్రాసెస్
- ముందుగా మీరు గూగుల్ ప్లేస్టోర్/ యాపిల్ స్టోర్ నుంచి mAadhaar యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా
- ఇప్పటికే మీరు mAadhaar యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే, దానిని అప్డేట్ చేసుకోవాలి.
- మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్, ఓటీపీలను ఉపయోగించి యాప్‌లో లాగిన్ అవ్వాలి.
- Aadhaar Servicesలో ఉన్న Paperless Offline e-KYC పై క్లిక్ చేయాలి.
- ఆధార్ నంబర్, షేర్ కోడ్, సెక్యూరిటీ క్యాప్చా ఎంటర్ చేసి, Request OTPపై క్లిక్ చేయాలి.
- మీ మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, మీరు నమోదు చేసిన వివరాలను వెరిఫై చేసుకోవాలి.
- Share e-KYC బటన్‌పై క్లిక్ చేసి, మీకు నచ్చిన యాప్‌ను ఎంచుకోవాలి.
- తరువాత ఈ-కేవైసీకి కావాల్సిన పత్రాలను .zip fileగా క్రియేట్ చేసుకోవాలి.
- ఇలా సిద్ధం చేసుకున్న జిప్ ఫైల్‌ను ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఉపయోగించవచ్చు.
ఆఫ్‌లైన్ వెరిఫికేషన్
మీరు mAadhaar యాప్‌లో క్రియేట్ చేసుకున్న జిప్ ఫైల్‌ను షేర్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, షేర్ కోడ్లు అవసరం అవుతాయి. మీరు వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా సర్వీస్ ప్రొవైడర్లకు ఈ జిప్ ఫైల్‌ను సులువుగా పంపించవచ్చు. వారు ఈ డిజిటల్ పత్రాలను చూసి, ఆఫ్‌లైన్‌లోనే ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనితో మీ ఆధార్ ధ్రువీకరణ ప్రక్రియ సులువుగా పూర్తవుతుంది.
ఫోన్‌పే యూజర్లకు గుడ్‌న్యూస్ - ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు!
అమెజాన్ యూజర్లకు గుడ్ న్యూస్ - డబ్బులు లేకున్నా షాపింగ్ చేసే అవకాశం - ఎలా అంటే?