LPG Gas Cylinder Price Hike : ప్రభుత్వ రంగ చమురు సంస్థలు.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.101.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. గత రెండు నెలల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.
Domestic Gas Cylinder Rates : వంట గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదని చమురు సంస్థలు ప్రకటించాయి. సామాన్యులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు
Commercial Gas Cylinder Price : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన నేపథ్యంలో.. దిల్లీలో 19కేజీల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.1731 నుంచి రూ.1833కు పెరిగింది. అలాగే కోల్‌కతాలో రూ.1943కు, ముంబయిలో రూ.1785.50కు, బెంగళూరులో రూ.1914.50కు, చెన్నైలో రూ.1999.50కు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలు
Domestic Gas Cylinder Price : కోల్‌కతాలో 14.2 కేజీల వంట గ్యాస్ ధర రూ.929గా ఉంది. ముంబయిలో రూ.902.5, చెన్నైలో రూ.918.5లుగా ఉంది. ఇక దిల్లీలో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.903గా ఉన్నది.
గ్యాస్ సిలిండర్ ధరలను నిర్ణయించేది ఎవరు?
Who Decides LPG Prices In India : ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లు.. వాణిజ్య గ్యాస్ సిలిండర్, వంట గ్యాస్ సిలిండర్ ధరలను ప్రకటిస్తూ ఉంటాయి.
ఎల్పీజీ ఉపయోగాలు
LPG Gas Uses : లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(LPG)ని మోటార్ ఇంధనంగా, వంట గ్యాస్‌గా ఉపయోగిస్తారు. అలాగే పరిశ్రమల్లో తాపన, శీతలీకరణ (హీటింగ్ అండ్ రిఫ్రిజిరేషన్) కోసం కూడా ఎల్పీజీని ఉపయోగిస్తారు.
వంట గ్యాస్ సబ్సిడీ!
Domestic Gas Cylinder Subsidy : కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ వినియోగదారులకు రూ.200 వరకు సబ్సిడీ అందిస్తామని ఈ ఆగస్టు నెలలో ప్రకటించిది.
ఎల్పీజీ సిలిండర్ ధరలను ఎలా, ఎక్కడ చెక్ చేయవచ్చు?
How To Check LPG Gas Rate Online : ఎల్పీజీ సిలిండర్ అసలు ధరలను తెలుసుకోవాలనుకుంటే.. ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైడ్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఇదే వెబ్సైట్లో ఎల్పీజీ ధరలతోపాటు, జెట్ ఫ్యూయెల్, ఆటో గ్యాస్, కిరోసిన్ మొదలైన ఇంధనాల ధరలను కూడా తెలుసుకోవచ్చు.
Reliance SBI Card : సూపర్ ఆఫర్లతో రిలయన్స్- SBI క్రెడిట్ కార్డు.. ఎన్ని రివార్డ్‌లో తెలుసా?