ETV Bharat / business

Loan Default : ఒకసారి లోన్‌ డిఫాల్డ్‌ అయితే.. మళ్లీ బ్యాంక్ రుణం మంజూరు అవుతుందా?​ - bank defaulter credit score check

Loan Default : బ్యాంకు లోన్ తీసుకుని దానిని సకాలంలో చెల్లించకపోయినా, లేదా పూర్తిగా ఎగవేసినా.. దానిని డిఫాల్ట్​ చేయడం అంటారు. ఒక వేళ ఆర్థిక ఇబ్బందుల వల్ల లోన్​ డిఫాల్ట్​ అయితే.. మరలా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చా?.. దరఖాస్తు చేస్తే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయా? ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

loan defaulter can apply for loan again
Loan Default
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 5:06 PM IST

Loan Default : బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి చాలా మంది తమ అవసరాల కోసం రుణాలు తీసుకుంటూ ఉంటారు. కానీ, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల సకాలంలో బ్యాంకు రుణాలు తీర్చలేకపోవచ్చు. లేదా పూర్తిగా రుణాన్ని చెల్లించలేక ఇబ్బంది పడవచ్చు. సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు.. భవిష్యత్​లో మళ్లీ రుణాలు మంజూరు కావడం కష్టం అవుతుంది.

ఒక్కసారికి ఏమీ కాదు!
ఒక్కోసారి రుణ వాయిదాలు సకాలంలో చెల్లించడం కుదరకపోవచ్చు. ఇలా ఒక సారి ఈఎంఐ చెల్లించకపోయినంత మాత్రాన డిఫాల్ట్ చేసినట్లు కాదు. ఈఎంఐ ఆలస్యానికి కేవలం జరిమానా మాత్రమే వేస్తారు. కానీ వరుసగా 3 నెలలపాటు ఈఎంఐ చెల్లించకపోతే.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దానిని డిఫాల్ట్​గా పరిగణిస్తాయి.

లోన్ డిఫాల్ట్​ అయితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయి?
Loan Default Consequences : బ్యాంకు రుణాలు తీసుకుని.. ఎగవేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రుణ సంస్థలు డిఫాల్టర్​ విషయాలను క్రెడిట్​ బ్యూరోలకు నివేదిస్తాయి. వెంటనే అవి మీ క్రెడిట్​ స్కోర్​ను బాగా తగ్గిస్తాయి. ఒకసారి మీ క్రెడిట్ స్కోర్​ దెబ్బతింటే.. మళ్లీ మీకు బ్యాంకు రుణాలు మంజూరు కావడం చాలా కష్టమవుతుంది.

సురక్షిత, అసురక్షిత రుణాలు అంటే ఏమిటి?
What Are Secured And Unsecured Loans?

  • మీరు ఏదైనా ప్రోపర్టీని తనఖా పెట్టి రుణం తీసుకుంటే.. దానిని సురక్షితమైన రుణంగా పరిగణిస్తారు. మీరు ఎలాంటి హామీ చూపించకుండా తీసుకునే రుణాన్ని.. అసురక్షితమైన రుణంగా భావిస్తారు.
  • సురక్షితమైన రుణంపై డిఫాల్ట్‌ అయినట్లయితే, బ్యాంకులు తమ బకాయిలను తిరిగి పొందేందుకు.. చట్టపరంగా మీరు తాకట్టు పెట్టిన వస్తువులను లేదా ఆస్తులను వేలం వేసి, వచ్చిన డబ్బును తమ రుణం కింద జమ చేసుకుంటాయి. కనుక మీ క్రెడిట్ స్కోర్​పై పెద్దగా ప్రభావం పడదు.
  • అదే మీరు పర్సనల్​ లోన్​ లాంటి అసురక్షిత రుణాలను డిఫాల్ట్‌ చేస్తే, మీ క్రెడిట్‌ స్కోర్‌ తీవ్రంగా దెబ్బతింటుంది. ఫలితంగా బ్యాంకు లోన్​లే కాదు.. క్రెడిట్ కార్డులు పొందడం కూడా కష్టమవుతుంది.
  • వాస్తవానికి లోన్‌ డిఫాల్ట్‌.. నిర్దిష్ట కాలం వరకు రికార్డుల్లో ఉంటుంది. మీరు కనుక ఈ సమయంలోపు ఎలాగోలా రుణాన్ని తిరిగి తీర్చివేస్తే, మళ్లీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలవుతుంది.

మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు!
Loan Defaulter Can Apply For A Fresh Loan : మీ క్రెడిట్‌ స్కోరు మెరుగుపడిన తర్వాత మళ్లీ బ్యాంక్ లోన్​ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కచ్చితంగా వెంటనే లోన్ వస్తుంది అని చెప్పలేము. ఎందుకంటే.. మీరు రుణం తీర్చివేసినప్పటికీ.. గతంలోని మీ డిఫాల్డ్​ హిస్టరీ వాళ్లకు తెలుసు కనుక. అందుకే కొన్ని బ్యాంకులు మళ్లీ లోన్ ఇవ్వడానికి ఇష్టపడవు. మరికొన్ని బ్యాంకులు.. చాలా అధిక వడ్డీతో రుణాలు ఇస్తాయి. అది కూడా ఏదైనా వస్తువు లేదా ఆస్తిని హామీగా తీసుకుని రుణాన్ని మంజూరు చేస్తాయి.

వాస్తవానికి లోన్​ డిఫాల్ట్​ చేసిన​ వ్యక్తి.. తరువాతనైనా ఆ రుణాలను పూర్తిగా తీర్చేయాలి. అప్పుడే క్రమంగా మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. తక్కువ వ్యవధిలో ఎక్కువ సార్లు రుణం కోసం దరఖాస్తు చేయకూడదు. అలా చేస్తే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గే ప్రమాదం ఉంటుంది.

ఆదాయం బాగుంటే.. ట్రై చేయవచ్చు!
లోన్ డిఫాల్ట్​ హిస్టరీ ఉన్నప్పటికీ.. పెద్ద జీతం, స్థిరమైన ఆదాయం, సురక్షితమైన ఉద్యోగం ఉంటే వాళ్లకు.. మరలా బ్యాంక్​ లోన్ మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు తీసుకున్న రుణాన్ని.. సులభంగా తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం ఉంటుంది.

How Is Gold Price Calculated In India : భారతదేశంలో బంగారు ఆభరణాల విలువను ఎలా లెక్కిస్తారో.. మీకు తెలుసా?

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.