LIC New Jeevan Shanti Plan : దేశంలో అనేక బీమా సంస్థలు వివిధ రకాల పాలసీలను తమ కస్టమర్ల కోసం ప్రవేశ పెడుతుంటాయి. అయితే చాలా మంది ఎల్ఐసీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అందించే పాలసీలనే ఎక్కువగా కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే దీనికి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఎల్ఐసీ తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీ (ప్లాన్ నం. 858) ని తీసుకొచ్చింది.
'LIC న్యూ జీవన్ శాంతి' పాలసీ అంటే..?
LIC New Jeevan Shanti Plan Details : 'LIC న్యూ జీవన్ శాంతి' పాలసీ అనేది నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటెడ్ యాన్యుటీ ప్లాన్. వాస్తవానికి ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించి ఈ ఎల్ఐసీ జీవన్ శాంతి ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో అందించే యాన్యుటీ రేట్లకు గ్యారంటీ ఉంటుంది. అంటే మనం ఈ పాలసీ తీసుకునే సమయంలోనే.. మనకు రావాల్సిన పెన్షన్ నిర్ధరణ అవుతుంది.
న్యూ జీవన్ శాంతి ప్లాన్‌లో తక్షణమే పెన్షన్ ఇచ్చే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. లేదా కొంత కాలం తరువాత పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే మీరు రెగ్యులర్‌గా ఆదాయం రావాలని కోరుకుంటే ఇమ్మీడియెట్ యాన్యుటీ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. లేదా కొంతకాలం తరువాత డబ్బు కావాలని అనుకుంటే గనుక డిలేయిడ్ యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ పాలసీలో 2 రకాల యాన్యుటీ ప్లాన్లను అందిస్తుంది ఎల్ఐసీ.
- డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్
- డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్
డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్ అంటే ఏమిటి..?
డిఫర్డ్ యాన్యూటీ ప్లాన్ అనేది ఒక బీమా ఒప్పందం. ఇందులో పాలసీదారు బీమా సంస్థ నుంచి ప్రతి నెలా ఆదాయాన్ని పొందుతాడు. లేదంటే భవిష్యత్తులో ఒకేసారి పెద్ద మొత్తంలో నగదును అందుకుంటాడు. ఇది మనం ఎంచుకునే ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది.
'LIC జీవన్ శాంతి ప్లాన్'ను ఎవరు కొనుగోలు చేయవచ్చు?
Eligibility For LIC New Jeevan Shanti : కనీసం 30 ఏళ్లు నిండిన లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారెవరైనా 'LIC జీవన్ శాంతి ప్లాన్'ను కొనుగోలు చేయవచ్చు. గరిష్ఠంగా 79 ఏళ్ల వయస్సున్న వారు కూడా ఈ ప్లాన్‌కు అర్హులు. ఈ పాలసీ ప్లాన్‌ను ఎంచుకునే ముందు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే. మీరు పాలసీ ప్రారంభంలో ఎంచుకున్న కాలవ్యవధిని.. భవిష్యత్తులో మార్చుకోవడానికి వీలుండదు.
గరిష్ఠ పరిమితులు లేవు..!
ఈ పాలసీని తీసుకునే సమయంలోనే సంస్థ నిర్దేశించిన కనీస మొత్తాని చెల్లించి ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాగా, దీని కనీస కొనుగోలు ధరను రూ.1.5 లక్షలుగా ఫిక్స్ చేశారు. గరిష్ఠ కొనుగోలు ధర, యాన్యుటీ సహా ఇతర నిబంధనలకు ఎటువంటి గరిష్ఠ పరిమితులు లేవు.
ఇలా చెల్లించవచ్చు..!
ఈ ప్లాన్‌లో ఉన్న మరో సౌలభ్యం ఏంటంటే ఇందులోనూ నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి, ఆరు నెలలకోసారి లేదా ఏడాదికి ఇలా మన ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ప్రీమియంలను చెల్లించే అవకాశం ఉంటుంది.
12 సంవత్సరాల వరకు..
ఈ స్కీమ్ కింద 12 సంవత్సరాల వరకు పెన్షన్‌ను వాయిదా వేసుకోవచ్చు. వాయిదా వేసిన యాన్యుటీతో కనీసం ఒక సంవత్సరం లేదా గరిష్ఠంగా పన్నెండు సంవత్సరాల తర్వాత పెన్షన్‌ను చెల్లిస్తారు. ఒకేసారి ప్రీమియం మొత్తాన్ని కట్టేస్తే పెన్షన్‌ను వెంటనే అందిస్తారు.
ఎంత పెన్షన్ పొందవచ్చు..!
LIC New Jeevan Shanti Plan Calculator : ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి పాలసీని 5 సంవత్సరాల డిఫర్డ్ (వాయిదా) యాన్యుటీతో కొన్నారనుకోండి. మీ 35 ఏళ్ల వయసులో మీరు రూ.86,784ను పెన్షన్ కింద పొందుతారు. అదే 12 సంవత్సరాలు డిఫర్డ్(వాయిదా) యాన్యుటీతో కొనుగోలు చేస్తే మీకు 42 ఏళ్లు వచ్చేసరికి రూ.1,32,920 వార్షిక పెన్షన్‌ను పొందవచ్చు. అలాగే 45 ఏళ్ల వయసులో రూ.10 లక్షలతో పాలసీని కొనుగోలు చేస్తే 5 ఏళ్ల తర్వాత వార్షిక పెన్షన్ కింద రూ.90,456 మీకు అందుతుంది. అదే 45 ఏళ్ల వయస్సులో 12 ఏళ్ల డిఫర్డ్(వాయిదా) యాన్యుటీ కింద కొంటే గనుక రూ.1,42,508ను వార్షిక పెన్షన్‌గా అందుకుంటారు.
- LIC Aadhaar Shila Policy : ఎల్ఐసీ 'సూపర్ పాలసీ'.. రూ.87 పెట్టుబడితో రూ.11 లక్షలు విత్‌డ్రా!
- LIC Jeevan Kiran : ఎల్ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్! మరెన్నో బెనిఫిట్స్ కూడా!
- How to Apply LIC Kanyadan Policy : కూతురు వివాహానికి ఎల్ఐసీ అద్భుత పాలసీ.. ఇప్పుడే అప్లై చేసుకోండి.. లక్షల్లో లబ్ధి పొందండి.!