ETV Bharat / business

ఎల్‌ఐసీ ఐపీఓకు 3 రెట్ల స్పందన.. ఎవరు అధిక బిడ్లు వేశారంటే? - ఎల్ఐసీ జీఎంపీ

LIC IPO: ఎల్ఐసీ ఐపీఓకు మదుపర్ల నుంచి మంచి స్పందన లభించింది. జారీ చేసిన షేర్లకు మూడు రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ దరఖాస్తు గడువు ముగిసిన నేపథ్యంలో ఈ మేరకు ఎక్స్ఛేంజీలు సమాచారం ఇచ్చాయి.

LIC IPO
LIC IPO
author img

By

Published : May 9, 2022, 8:05 PM IST

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ) తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ) దరఖాస్తు గడువు ముగిసింది. 16.20 కోట్ల షేర్లను పబ్లిక్‌ ఇష్యూకు కేటాయించగా.. మొత్తం 2.95 రెట్లు స్పందన లభించింది. 16.20 కోట్ల షేర్లకు గానూ 47.83 కోట్ల బిడ్లు దాఖలైనట్లు ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ద్వారా తెలిసింది. అత్యధికంగా పాలసీ హోల్డర్ల కేటగిరీలో 6.11 రెట్ల బిడ్లు దాఖలవ్వగా.. కనిష్ఠంగా రిటైల్‌ కోటాలో 1.99 రెట్ల దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజైన సోమవారంతో అన్ని విభాగాల్లో షేర్లకు పూర్తి స్పందన లభించింది.

LIC IPO subscribe: అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగంలో 2.83 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. సంస్థాగతేతర మదుపర్ల (ఎన్ఐఐ) విభాగంలో 2.91 రెట్లు బిడ్లు వచ్చాయి. రిటైల్‌ విభాగంలో 1.99, ఉద్యోగుల కోటాలో 4.40, పాలసీ హోల్డర్ల కోటాలో 6.12 రెట్లు చొప్పున బిడ్లు దాఖలయ్యాయి. ఐపీఓ ప్రారంభమైన తొలి రోజు నుంచి క్యూఐబీ కోటాకు స్పందన అంతంత మాత్రమే. ఐదో రోజు వరకు ఈ కోటాకు పూర్తి స్పందన లభించలేదు. అయితే, చివరి రోజు పూర్తయ్యేసరికి ఏకంగా ఈ కోటాలో 2.83 రెట్ల దరఖాస్తులు రావడం గమనార్హం. ఇదే రీతిలో ఎన్‌ఐఐ కోటాకు సైతం తొలి మూడు రోజులు దరఖాస్తులు నామమాత్రంగానే వచ్చాయి. చివరి రోజు వచ్చేసరికి ఈ కోటాకు సైతం 2.91 రెట్లు బిడ్లు దాఖలయ్యాయి. మే 16న విజయవంతమైన బిడ్డర్ల ఖాతాలోకి షేర్లు బదిలీ అవుతాయి. 17న ఎల్‌ఐసీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి.

LIC IPO
సబ్​స్క్రిప్షన్ వివరాలు

ఐపీఓ వివరాలు..

  • ఐపీఓ ప్రారంభ తేదీ - 2022 మే 4
  • ఐపీఓ ముగింపు తేదీ- 2022 మే 9
  • ధరల శ్రేణి- ₹902 - ₹949
  • ఐపీఓ విలువ - ₹21,008 కోట్లు
  • క్యూఐబీ కోటాకు కేటాయించిన షేర్లు - 39,531,236
  • ఎన్‌ఐఐ కోటా - 29,648,427
  • రిటైల్‌ కోటా - 69,179,663
  • ఉద్యోగుల కోటా- 1,581,249
  • పాలసీ హోల్డర్ల కోటా- 22,137,492

ఇదీ చదవండి: సెప్టెంబర్ కల్లా 'ఎస్​సీఐ' వేలం.. త్వరలోనే ఆర్థిక బిడ్లకు ఆహ్వానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.