ETV Bharat / business

LIC IPO: 3.5 శాతానికి తగ్గిన ఎల్‌ఐసీ పబ్లిక్​ ఇష్యూ పరిమాణం

LIC IPO: పబ్లిక్​ ఇష్యూ పరిమాణాన్ని 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించడానికి లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్(ఎల్‌ఐసీ)​ ఆమోదం తెలిపింది. మే తొలి వారంలో ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

lic ipo news
lic ipo news
author img

By

Published : Apr 25, 2022, 6:39 AM IST

LIC IPO: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ పరిమాణాన్ని 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించడానికి ఎల్‌ఐసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఒక అధికారి తెలిపారు. ఎల్‌ఐసీలో ప్రభుత్వం 3.5 శాతం వాటాను రూ.21,000 కోట్లకు ఈ ఇష్యూ ద్వారా విక్రయించనుంది. ఇందుకు నియంత్రణ సంస్థల అనుమతులు లభించాల్సి ఉందని ఆ అధికారి పేర్కొన్నారు. ప్రతిపాదిత ఇష్యూ పరిమాణాన్ని తగ్గిస్తూ సమర్పించిన ముసాయిదా పత్రాల(డీఆర్‌హెచ్‌పీ)కు శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదం లభించిందని సంబంధిత అధికారి వివరించారు.

కంపెనీ విలువను రూ.6 లక్షల కోట్లుగా లెక్కగట్టిన నేపథ్యంలో, 3.5 శాతం వాటా విలువ వద్ద ప్రభుత్వానికి రూ.21,000 కోట్లు లభిస్తాయి. రూ.లక్ష కోట్లకు పైగా విలువ ఉన్న కంపెనీలు 5 శాతం వాటా లేదా రూ.5000 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలంటే తప్పనిసరిగా సెబీ అనుమతి ఉండాలి. ఈ వారంలోనే రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్ట్స్‌(ఆర్‌హెచ్‌పీ)ను ప్రభుత్వం దాఖలు చేయనుంది. ఇందులో ఇష్యూ పరిమాణం, ఇష్యూ ప్రారంభ, ముగింపు తేదీలు, ఇష్యూ ధర, డిస్కౌంట్‌(పాలసీదార్లు, ఉద్యోగులకు) తదితరాలు ఉంటాయి. మే తొలి వారంలో ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ ఉండొచ్చని చెబుతున్నారు.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నందున, అధిక ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల ప్రభావం తగ్గడానికి కనీసం 4-5 నెలల సమయం పడుతుందన్న అంచనాల వల్ల, ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూను వాయిదా వేయకుండా.. ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విషయాలపై ఎల్‌ఐసీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ఇదీ చదవండి: ఐపీఓకు దరఖాస్తు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.