LIC Aadhaar Shila Policy Benefits : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను అందుబాటులోకి తెస్తుంటుంది. ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే 'ఎల్ఐసీ ఆధార్ శిలా' పేరుతో మరో సూపర్ పాలసీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రోజుకు కేవలం రూ.87 మదుపు చేస్తే ప్లాన్ మెచ్యురిటీ గడువు ముగిసేసరికి అక్షరాల రూ.11 లక్షలను పాలసీ హోల్డర్ పొందొచ్చు. దీంతో అత్యవసర ఆర్థిక పరిస్థితుల నుంచి గట్టెక్కొచ్చు.
'ఎల్ఐసీ ఆధార్ శిలా' అనేది వ్యక్తిగత లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీనిని ముఖ్యంగా మహిళల కోసమే మాత్రమే తీసుకొచ్చారు. ఈ స్కీమ్‌ను తీసుకున్న వారెవరైనాసరే పాలసీ మెచ్యురిటీ సమయానికి ఓ నిర్దిష్టమైన పెద్దమొత్నాన్ని పొందుతారు. అంతేకాకుండా పాలసీ హోల్డర్ దురదృష్టవశాత్తు మరణిస్తే గనుక వారి కుటుంబానికి ఆర్థికంగా తోడ్పడుతుంది కూడా.
వీరు మాత్రమే అర్హులు..
LIC Aadhaar Shila Eligibility : ఈ స్కీమ్ కింద పాలసీ తీసుకోవాలంటే బాలిక లేదా మహిళ వయసు 8 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి కచ్చితంగా ఆధార్ ధ్రువపత్రం ఉండాలి. ఈ ప్లాన్ కాలవ్యవధిని 10 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. అలాగే ప్లాన్ మెచ్యురిటీ సమయానికి మహిళ గరిష్ఠ వయసు 70 ఏళ్లు మించకూడదు. అయితే స్కీమ్ కాలవ్యవధి గరిష్ఠంగా 20 సంవత్సరాలు ఉన్నా.. మహిళ ఎంత కాలానికి ప్లాన్‌ను కొనుగోలు చేయాలనేది ఆమె ఏ వయసులో దానిని తీసుకుంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 55 సంవత్సరాల వయసు కలిగిన ఓ మహిళ కేవలం 15 సంవత్సరాల మెచ్యురిటీ పీరియడ్ కలిగిన ప్లాన్‌ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. 18 లేదా 20 సంవత్సరాలకు పాలసీని తీసుకునే అవకాశం ఆమెకు ఉండదు ఎందుకంటే పాలసీ మెచ్యురిటీ పీరియడ్ గరిష్ఠంగా 70 ఏళ్లు మాత్రమే కాబట్టి. కాగా, ఈ పథకం కింద హామీ మొత్తం(సమ్ అష్యూర్డ్) మొత్తాన్ని కనిష్ఠంగా రూ.2 లక్షలు, గరిష్ఠంగా రూ.5 లక్షలుగా ఫిక్స్ చేశారు.
రోజుకు రూ.87.. ఆ సమయానికి రూ.11 లక్షలు..
Best LIC Policies For Ladies : మీరు రోజుకు రూ.87 చొప్పున ఇన్వెస్ట్ చేసి మెచ్యురిటీ సమయానికి అక్షరాల రూ.11 లక్షలు సొంతం చేసుకోవాలనుకుంటే గనుక 'ఎల్ఐసీ ఆధార్ శిలా పాలసీ'(LIC Aadhaar Shila)ని ఓ బెటర్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇలా మీరు ఏడాదికి వార్షిక ప్రీమియం కింద రూ.31,755 చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 60 ఏళ్ల వయసున్న ఓ మహిళ 10 ఏళ్ల వ్యవధి కలిగిన ప్లాన్‌ను ఎంచుకున్నారనుకుందాం. అలా ఆమెకు 70 ఏళ్ల వచ్చేసరికి కేవలం రూ.3,17,550 మాత్రమే ప్రీమియం కింద చెల్లిస్తుంది. మెచ్యురిటీ పీరియడ్ గరిష్ఠంగా 70 ఏళ్లే కాబట్టి. ఆ సమయానికి పాలసీ హోల్డర్‌కు అక్షరాల రూ.11 లక్షలు అందుతాయి. మొత్తంగా ఎల్ఐసీ అందిస్తున్న ఈ స్కీమ్ ద్వారా జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలతో పాటు భవిష్యత్తులో వచ్చే అత్యవసర ఆర్థిక ఇబ్బందులను మహిళలు ఎదుర్కునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది, అలాగే మీ కుటంబానికి భద్రతను కల్పిస్తుంది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు.
- LIC Jeevan Kiran : ఎల్ఐసీ న్యూ పాలసీ.. ప్రీమియం డబ్బులు వెనక్కి వచ్చేస్తాయ్! మరెన్నో బెనిఫిట్స్ కూడా!
- LIC జీవన్ లాభ్ పాలసీ.. నెలకు రూ.7వేలు చెల్లిస్తే.. రూ.54 లక్షలు మీ సొంతం!
- LIC Kanyadan Policy: ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ.. బాలికల విద్య, వివాహం కోసం అద్భుతమైన స్కీమ్!
- ఎల్ఐసీ 'స్పెషల్' పాలసీ.. 20 ఏళ్ల ప్లాన్.. 12 ఏళ్ల ప్రీమియం కడితే చాలు!
- నెలకు రూ.12 వేల పెన్షన్!.. ఈ LIC స్కీమ్ గురించి మీకు తెలుసా?