ETV Bharat / business

రూ.7,000కోట్ల బిజినెస్ చూసుకునేందుకు కుమార్తె నో.. కంపెనీని అమ్మేస్తున్న తండ్రి!

భారత దేశంలో ఎంతో పాపులర్ అయిన బిస్లరీ ప్యాకేజ్డ్​ వాటర్​ బాటిల్​ సంస్థను మరొకరికి అమ్మివేస్తున్నారు కంపెనీ ఛైర్మన్​ రమేశ్ చౌహాన్. రూ.7000 కోట్ల విలువ చేసే కంపెనీ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన కుమారై ఆసక్తి చూపకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

Jayanti Chauhan
Jayanti Chauhan
author img

By

Published : Nov 27, 2022, 4:45 PM IST

82 ఏళ్ల వ్యాపార దిగ్గజం బిస్లరీ ఇంటర్నేషనల్​ ఛైర్మన్​​ రమేశ్​ చౌహాన్​ తన సంస్థను అమ్మేస్తున్నారు. రూ.7,000 కోట్లు విలువ చేసే ఈ కంపెనీ బాధ్యతలను స్వీకరించడానికి ఆయన కుమారై జయంతి చౌహాన్​ ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణం. దీంతో తన సంస్థను మరొకరికి విక్రయించడానికి రమేశ్​ చౌహాన్​ వివిధ సంస్థలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో అనుభవం ఉన్న దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్​కు అమ్మేందుకు ఆయన​ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిరోజుల్లో బిస్లరీ సంస్థకు కొత్త యజమాని వచ్చే అవకాశం ఉంది.

రమేశ్​ చౌహాన్​ కుమార్తె జయంతి చౌహాన్ తన 24వ ఏట బిస్లరీలో తన ప్రస్థానం ప్రారంభించారు. ఆమె మొదటిగా దిల్లీ కార్యాలయంలో అధికార బాధ్యతలు చేపట్టి.. కంపెనీని ముందుకు తీసుకువెళ్లడానికి అనేక మార్పులను చేశారు. కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2011లో ముంబయి కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించిన ఆమె హెచ్​ఆర్​, సేల్స్​, మార్కెటింగ్​ విభాగాల్లో చాలా మార్పులు తీసుకువచ్చారు. జయంతి హిమాలయా వేదికా నేచురల్​ మినరల్​ వాటర్, ఫిజ్జీ కూల్​ డ్రింక్స్​, బిస్లరీ హ్యాండ్​ ఫ్యూరిఫయర్​ వంటి ఉత్పత్తులు తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రస్తుతం జయంతి సేల్స్​, మార్కెటింగ్​ టీమ్​లకు నాయకత్వం వహిస్తున్నారు. జయంతి లండన్​ కాలేజీ ఆఫ్​ ఫ్యాషన్​ కాలేజీలో ఫొటోగ్రఫీలో పట్టాపొందారు. యూనివర్సిటీ ఆఫ్​ లండన్​ నుంచి అరబిక్​లో మరో డిగ్రీని పొందారు.

Jayanti Chauhan
జయంతి చౌహాన్

రమేశ్​ చౌహాన్​ 1969లో ఓ ఇటాలియన్​ వ్యాపారవేత్త నుంచి​ బిస్లరీ బ్రాండ్​ను కొనుగోలు చేశారు. దాదాపు 50 సంవత్సరాలు చౌహాన్ నాయకత్వంలో ఉన్న బిస్లరీ ఇంటర్నేషనల్​.. భారతదేశంలోనే అతిపెద్ద పానీయాల వ్యాపార సంస్థల్లో ఒకటిగా ఎదిగింది. ప్రస్తుతం ఈ కంపెనీ 133 ప్లాంట్​లు కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది డిస్ట్రిబ్యూటర్​లు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.