ITR Scam : సైబర్ నేరగాళ్లు మరో సరికొత్త మోసానికి తెరలేపారు. ఆదాయ పన్ను రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని 'ఐటీఆర్ రిఫండ్ మెసేజ్'లను పంపిస్తున్నారు. పొరపాటున ఆ మెసేజ్లోని లింక్‌ను క్లిక్ చేశారా? మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్ము మొత్తాన్ని సైబర్ నేరగాళ్లు ఖాళీ చేస్తారు. ఈ నయా మోసాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజలందరూ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
మోసం ఎలా చేస్తారంటే?
Income tax refund scam : 2023 జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు.. ఇప్పుడు రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే వీళ్లను టార్గెట్ చేస్తూ, సైబర్ నేరగాళ్లు నయా మోసానికి తెగబడుతున్నారు. వీరి మోసం ఎలా ఉంటుందంటే.. 'మీకు ఇన్‌కం టాక్స్ రిఫండ్ వచ్చింది. ఒకసారి మీ బ్యాంకు ఖాతా వివరాలు సరిచూసుకోండి' అంటూ ఒక మెసేజ్ పంపిస్తారు. లేదా 'మీ బ్యాంకు ఖాతా నంబర్ తప్పుగా నమోదైంది. వెంటనే సరిచేసుకోండి' అంటూ లింక్ పంపిస్తారు. పొరపాటున ఈ లింక్‌ను ఓపెన్ చేశారా? ఇక అంతే.. మీ బ్యాంకు అకౌంట్లోని సొమ్ము మొత్తాన్ని ఖాళీ చేస్తారు.
ఐటీ డిపార్ట్మెంట్ మెసేజ్‌లు పంపదు!
It department messages : 'ఆదాయపన్ను రిటర్నులు ఆమోదం పొందాయని చాలా మందికి మెసేజ్‌లు వస్తున్నాయి. ఇవన్నీ ఫేక్ మెసేజ్‌లు. వాస్తవానికి ఆదాయపన్ను శాఖ ఇలాంటి సందేశాలు (మెసేజ్‌లు) ఎవరికీ పంపదు. కనుక ఇలాంటి ఫేక్ మెసేజ్‌ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి' అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ట్వీట్ చేసింది. దానితోపాటు సైబర్ నేరగాళ్లు పంపించిన ఓ ఫేక్ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది.
-
A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
✔️ This claim is 𝐅𝐚𝐤𝐞.
✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message.
✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg
">A viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023
✔️ This claim is 𝐅𝐚𝐤𝐞.
✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message.
✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3ggA viral message claims that the recipient has been approved for an income tax refund of ₹ 15,490.#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) August 2, 2023
✔️ This claim is 𝐅𝐚𝐤𝐞.
✔️ @IncomeTaxIndia has 𝐧𝐨𝐭 sent this message.
✔️𝐁𝐞𝐰𝐚𝐫𝐞 of such scams & 𝐫𝐞𝐟𝐫𝐚𝐢𝐧 from sharing your personal information. pic.twitter.com/dsRPkhO3gg
ఐటీ శాఖ వ్యక్తిగత వివరాలు తెలపాలంటూ ఎలాంటి మెసేజ్‌లు పంపించదు. ఒక వేళ మీకు అలాంటి మెసేజ్‌లు వస్తే, వాటిలోని లింక్‌లపై క్లిక్ చేసి, ఓపెన్ చేయకూడదు. ఒక వేళ పొరపాటున ఓపెన్ చేసినా, వ్యక్తిగత సమాచారాన్ని అందులో నమోదు చేయకూడదు. అలాగే ఆ లింక్‌లను కాపీ చేసి, మరో వెబ్ బ్రౌజర్లో సెర్చ్ చేయడం లాంటివి కూడా చేయకూడదు. మీకు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.