IT Layoffs In India 2023 : భారతీయ ఐటీ పరిశ్రమ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫలితంగానే 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 51,744 మంది తమ ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురయ్యారు. లేదా స్వయంగా వారే ఉద్యోగాల నుంచి వైదొలిగారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలోని అగ్రశ్రేణి ఐటీ కంపెనీలు భారీగా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. 2023-34 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోని గణాంకాల ప్రకారం.. సంవత్సర ప్రారంభంలో భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీల్లో దాదాపు 21.1 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. కానీ సెప్టెంబర్ నాటికి వీరి సంఖ్య 20.6 లక్షలకు పడిపోయింది. అంటే ఐటీ కంపెనీలు దాదాపు 51,744 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. లేదా ఉద్యోగులే స్వయంగా తమ జాబ్ నుంచి వైదొలగడం జరిగింది.
భారీగా ఉద్యోగాల కోత
Top 10 IT Companies In India : అగ్రిగేటర్ ప్లాట్‌ఫాం స్టాటిస్టా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో టాప్ 9 ఐటీ కంపెనీలు అయిన.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌పీసీఎల్ టెక్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్, ఎంఫసిస్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీలు.. సామూకంగా గత 25 ఏళ్లలోనే అత్యంత భారీ స్థాయిలో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి.
గణాంకాలు ఎలా ఉన్నాయంటే?
A Comprehensive List Of 2023 Tech Layoffs :
ఉద్యోగాలు కల్పించలేం!
IT Hiring Trends 2023 : ఈ 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు వెల్లడించిన ఐటీ కంపెనీలు.. రానున్న త్రైమాసికాల్లోనూ ఉద్యోగ నియామకాలు చాలా వరకు తగ్గిస్తామని ప్రకటించాయి.
- ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్.. ఇటీవలే ఈ ఏడాది ఉద్యోగ నియామకాలు చేపట్టడం లేదని స్పష్టం చేశారు.
- విప్రో సీహెచ్ఆర్ఓ సౌరభ్ గోవిల్.. తాము ముందుగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ఆ తరువాతనే కొత్త నియామకాల గురించి ఆలోచిస్తామని ఇటీవల తేల్చిచెప్పారు.
- టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్.. ప్రస్తుతం ఐటీ రంగానికి బాగా డిమాండ్ తగ్గిందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు చక్కబడే వరకు ఇది ఇలానే కొనసాగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. యుద్ధాలు, ఆర్థిక అస్థిరతలు తగ్గి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మరలా ఐటీ పరిశ్రమ పుంజుకుంటుందని.. అప్పుడు కచ్చితంగా కొత్త ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Best Stock Market Investment Tips : మార్కెట్ ఒడుదొడుకుల్లోనూ లాభాలు రావాలా?.. ఈ టిప్స్ పాటించండి!