టెక్ దిగ్గజం యాపిల్ విడుదల చేసే ఐఫోన్‌కు ఉండే క్రేజే వేరు. వయసు, స్థాయితో సంబంధం లేకుండా అందరూ ఐఫోన్ వాడాలని కోరుకుంటారు. ఐఫోన్లో ఉండే సెక్యూరిటీ ఫీచర్లు, ఆ లుక్కు ఫిదా అయిపోతుంటారు. ఐఫోన్ పట్ల ఎంత ఇష్టం ఉన్నా డబ్బులు కూడా ముఖ్యమే కదా. అంత భారీ ధర పెట్టి కొనే స్తోమత చాలా మందికి ఉండదు. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మీకు తక్కువ ధరలో ఐఫోన్ 14 మోడల్ కావాలంటే ఓ లుక్ వేసేయండి మరి.
2022 సెప్టెంబరులో ఇండియాలో ఐఫోన్14 లాంఛ్ అయ్యింది. అప్పుడు దీని ధర రూ.79,999. అయితే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్లో భారీగా ఆఫర్లను ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్స్‌పై రూ.4వేలు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. పాత ఐఫోన్ ఎక్స్ఛేంజ్ ఇవ్వడం ద్వారా గరిష్ఠంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది.
- ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ధర రూ.71,299గా ఉంది.
- హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేస్తే ఐఫోన్ 14పై రూ.4 వేలు తగ్గుతుంది.
- దీంతో రూ.67,999 ధరకు వినియోగదారులకు ఐఫోన్ 14 లభిస్తుంది.
- అలాగే పాత ఐఫోన్-12 ఎక్స్ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.30 వేల వరకు తగ్గుతుంది.
- ఎక్స్ఛేంజ్ ధర పాత ఫోన్ బ్యాటరీ కెపాసిటీ, ఐఫోన్ క్వాలిటీ, ఐఫోన్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
- గరిష్ఠ ఎక్స్ఛేంజ్ లభిస్తే ఫోన్ ధర రూ.30వేలు తగ్గుతుంది.
- దీంతో ఐఫోన్ 14ను రూ.37,999కే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14 ఫీచర్లు..
ఐఫోన్ 14లో 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ తెరను అమర్చారు. మిడ్‌నైట్, స్టార్‌లైట్, బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్ రంగుల్లో లభించనున్నాయి. ఇందులోని బ్యాటరీ ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమమని కంపెనీ చెబుతోంది. ఏ15 బయోనిక్ చిప్, 12 మెగాపిక్సెల్ వెనుక, ముందు కెమెరాలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (భారత్‌లో రూ.79,999)గా నిర్ణయించారు.
అంతకుముందు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాలంటైన్స్ వీక్ సందర్భంగా ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది యాపిల్ థర్డ్ పార్టీ అధీకృత రిటైల్ సెల్లర్ ఐవీనస్. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 14 మోడల్‌పై బ్యాంక్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఎక్స్ఛేంజ్ బోనస్ మొదలైనవన్నీ కలుపుకొంటే గరిష్ఠంగా రూ.42,000 డిస్కౌంట్ లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది.