ETV Bharat / business

మార్కెట్‌ అస్థిరంగా ఉన్నా.. భయం వద్దు.. రాబడే ముద్దు - స్టాక్ మార్కెట్ సలహాలు

రెండేళ్ల క్రితం మహమ్మారి.. ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. స్టాక్‌ మార్కెట్‌పై కాలానుగుణంగా ఏదో ఒక అంశం ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. ఫలితంగా షేర్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరీక్షా సమయాల్లో పెట్టుబడిని వెనక్కి తీసుకోవడానికి తొందరపడటం సమంజసం కాదు. అనుకున్న లాభాలు కళ్లచూడటమే లక్ష్యంగా మార్కెట్లో కొనసాగడమే ఇప్పుడు మేలు.

Stock markets tips
ఇన్వెస్టిమెంట్​
author img

By

Published : Mar 26, 2022, 11:37 AM IST

స్టాక్‌ మార్కెట్‌ ఎన్నో మంచీ చెడులను చూస్తుంటుంది. మాంద్యం, మహమ్మారి, యుద్ధాలు, రాజకీయ తిరుగుబాట్లు.. ఇలా ఎన్ని ప్రతికూలతలు ఉన్నా.. తిరిగి బలం పుంజుకుంటూనే ఉంటుంది. తాత్కాలికంగా నష్టపోయినా.. దీర్ఘకాలంలో మళ్లీ జీవన కాల గరిష్ఠాలను నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంటుంది. అందుకే, యుద్ధ భయాలు, ఇతర ఆందోళనలను అధిగమించి మదుపును కొనసాగిస్తూనే ఉండాలి.

అస్థిరంగా ఉన్నా: మార్కెట్‌ అస్థిరంగా ఉందన్న మాట వాస్తవం. కానీ, పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు ఇదొక్కటే కారణం కాకూడదు. పెట్టుబడి పెట్టేటప్పుడే కొంత దిద్దుబాటుకు సిద్ధంగా ఉండాలన్నది మర్చిపోకూడదు. మీ లక్ష్యాన్ని సాధించడం లేదా మరేదైన బలమైన కారణం ఉంటేనే పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. రష్యా, ఉక్రెయిన్‌లు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న కంపెనీల్లో షేర్లు ఉంటే వాటి నుంచి బయటకు రావచ్చు. అంతేకానీ, చిన్న చిన్న కారణాలు చూపకూడదు. మీ డీమ్యాట్‌ ఖాతాలో పెట్టుబడులు ఎరుపు రంగులో కనిపించినంత మాత్రాన అదే శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి. భయపడితే.. దీర్ఘకాలిక లాభాలను కోల్పోతాం. మీ లక్ష్యాలు సాధించే వరకూ పెట్టుబడిని కొనసాగిస్తూనే ఉండాలి.

వైవిధ్యమే రక్ష: ఒకే పథకంలో మదుపు చేయడం ఎప్పుడూ ఇబ్బందే. పరిస్థితులు ఎలా ఉన్నా పెట్టుబడుల్లో వైవిధ్యం చూపాలి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ప్రావిడెంట్‌ ఫండ్‌, స్థిరాస్తి, బంగారం, బాండ్లు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్‌ ఫండ్లు ఇలా వైవిధ్యంగా మదుపు వ్యూహం ఉండాలి. లక్ష్యం ఆధారంగా సరైన పెట్టుబడుల మిశ్రమం ఉన్నప్పుడే ఆర్థికంగా బలోపేతం అవుతారు.

లక్ష్యం సాధించినప్పుడే: అనిశ్చిత సమయాల్లో మీ ఆర్థిక లక్ష్యాలే మీకు మార్గనిర్దేశం చేస్తాయి. పెట్టుబడులను కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తాయి. ఉదాహరణకు మీరు అయిదేళ్లపాటు మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేద్దామని అనుకున్నారు. మూడేళ్ల తర్వాత యుద్ధం వంటి ఊహించని పరిణామాలు వచ్చాయి. మీకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉంది కాబట్టి, పెట్టుబడులు కోలుకునే అవకాశాలే ఎక్కువ. అంతేకానీ, మధ్యలోనే పెట్టుబడులు తీస్తే.. తర్వాత వచ్చే రాబడులు వదులుకున్నట్లే.

జాబితాలో మార్పులు: ప్రపంచ సంక్షోభానికి ప్రతి స్పందనగా ఈక్విటీ మార్కెట్లు నష్టాలను నమోదు చేస్తుంటాయి. దీన్ని పెట్టుబడిదారులు సహజ ప్రక్రియగానే భావించాలి. తమ పెట్టుబడుల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు తొందరపడకూడదు. పెట్టుబడి సూత్రాలు, అవగాహనతో నిర్ణయం తీసుకోవాలి. చిన్న పొరపాట్లే ఖరీదైన తప్పులుగా మారకుండా జాగ్రత్త వహించాలి.

ఇదీ చదవండి: మీ పేరుతో ఎవరో అప్పు చేస్తే.. ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.