ETV Bharat / business

Infosys q4 Results: 'కొత్తగా 50 వేల ఉద్యోగాలు.. రష్యాతో డీల్స్​కు నో'

Infosys q4 Results: ప్రస్తుతం రష్యా క్లయింట్లతో ఎటువంటి వ్యాపారాలు లేవని, మున్ముందు కూడా చేసే యోచన లేదని స్పష్టం చేసింది ఇన్ఫోసిస్‌. గత ఆర్థిక సంవత్సరం నాలుగో (జనవరి- మార్చి) త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

infosys news
infosys news
author img

By

Published : Apr 14, 2022, 5:38 AM IST

Updated : Apr 14, 2022, 6:53 AM IST

Infosys q4 Results: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 50,000 మందికి పైగా తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్స్‌) ఉద్యోగాల్లో నియమించుకోవాలని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 55,000 మందిని నియమించుకోవాలని అనుకున్నా, 85,000 మంది ఫ్రెషర్లకు సంస్థ అవకాశమిచ్చింది. సిబ్బంది వలసల రేటు డిసెంబరు నాటి 25.5 శాతం నుంచి 27.7 శాతానికి పెరగడమే ఇందుకు కారణం. బలమైన గిరాకీ పరిస్థితుల్లో మరిన్ని కాంట్రాక్టులు లభిస్తాయన్న అంచనాతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 13-15 శాతం వృద్ధి చెందుతుందని సంస్థ పేర్కొంది. నిర్వహణ మార్జిన్లు 21-23 శాతంగా ఉండొచ్చని భావిస్తోంది. ఈ నెల నుంచి సిబ్బందికి వేతన పెంపు ఉంటుందని తెలిపింది.

జనవరి- మార్చి ఫలితాలు ఇలా..: గత ఆర్థిక సంవత్సరం నాలుగో (జనవరి- మార్చి) త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.5,686 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలో ఆర్జించిన రూ.5,076 కోట్లతో పోలిస్తే నికర లాభం 12 శాతం పెరిగింది. అక్టోబరు- డిసెంబరు త్రైమాసిక నికర లాభం రూ.5809 కోట్లతో పోలిస్తే 2 శాతం తగ్గింది. ఏడాది వ్యవధిలో ఆదాయం రూ.26,311 కోట్ల నుంచి 22.7 శాతం అధికమై రూ.32,276 కోట్లకు చేరింది. డాలరు రూపేణా సమీక్షా త్రైమాసికంలో నికర లాభం 8 శాతం పెరిగి 752 మిలియన్‌ డాలర్లకు, ఆదాయం 18.5 శాతం వృద్ధితో 4,280 మిలియన్‌ డాలర్లకు చేరింది. మొత్తం ఆదాయంలో డిజిటల్‌ విభాగ వాటా 59.2 శాతమని సంస్థ తెలిపింది. 2.3 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులను ఇన్ఫోసిస్‌ దక్కించుకుంది. నిర్వహణ మార్జిన్‌ 24.5 శాతం నుంచి 21.5 శాతానికి తగ్గింది.

"దశాబ్దకాలంలోనే అత్యధిక వార్షిక వృద్ధిని ఇన్ఫోసిస్‌ నమోదుచేసింది. డిజిటల్‌, క్లౌడ్‌ విభాగాలు సహా అన్ని విభాగాలు, విపణులు మెరుగైన పనితీరు కనబర్చడం ఇందుకు దోహదం చేసింది. క్లయింట్ల డిజిటల్‌ ప్రయాణాన్ని మేం విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలమనే నమ్మకాన్ని చూరగొనడం వల్ల మా మార్కెట్‌ వాటాలో వృద్ధి కొనసాగుతోంది"

- సలీల్‌ పరేఖ్‌, ఎండీ, సీఈఓ, ఇన్ఫోసిస్‌

పూర్తి ఆర్థిక సంవత్సరానికి..: గత ఆర్థిక సంవత్సరం (2021-22) మొత్తానికి ఇన్ఫోసిస్‌ నికర లాభం రూ.22,110 కోట్లుగా నమోదైంది. 2020-21 లాభం రూ.19,351 కోట్లతో పోలిస్తే 14.3 శాతం అధికం. ఇదే సమయంలో ఆదాయం రూ. 1,00,472 కోట్ల నుంచి 21 శాతం పెరిగి రూ.1,21,641 కోట్లకు చేరింది. 2021-22 ప్రారంభంలో పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థిర కరెన్సీ రూపేణా ఆదాయంలో 12-14 శాతం వృద్ధి లభించొచ్చని ఇన్ఫోసిస్‌ అంచనా వేసింది. ఆ తర్వాత అంచనాను పలు మార్లు పెంచుకుంటూ గత జనవరిలో 19.5- 20 శాతానికి మార్చింది. ఈ అంచనాకు దరిదాపులోనే ఆదాయ వృద్ధి నమోదైంది.

డాలరు రూపేణా నికర లాభం 13.4 శాతం వృద్ధితో 2.9 బిలియన్‌ డాలర్లకు, ఆదాయం 20.3 శాతం అధికమై 16.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఏడాది మొత్తం మీద 9.5 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులు పొందింది.

మొత్తం డివిడెండు రూ.31: 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.16 (320%) చొప్పున తుది డివిడెండును ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన రూ.15 మధ్యంతర డివిడెండుతో కలిపితే పూర్తి ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండు రూ.31 అవుతుంది. 2020-21లో చెల్లించిన దానితో పోలిస్తే ఇది 14.8 శాతం ఎక్కువ. తాజా డివిడెండుతో కలుపుకుంటే మొత్తంగా 2021-22లో కంపెనీ డివిడెండు చెల్లింపు రూ.13,000 కోట్లుగా నమోదవుతుంది.

రష్యా క్లయింట్లతో పని చేయట్లేదు..: ప్రస్తుతం రష్యా క్లయింట్లతో ఎటువంటి వ్యాపారాలు లేవని, మున్ముందు కూడా చేసే యోచన లేదని ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. రష్యాలోని తమ కేంద్రంలో జరిగే కార్యకలాపాలను ఇతర కేంద్రాలకు బదిలీ చేశామని ఇన్ఫీ సీఈఓ, ఎండీ సలీల్‌ పరేఖ్‌ తెలిపారు. రష్యాలో ఉద్యోగులు 100 మంది లోపే ఉంటారని పేర్కొన్నారు. అందువల్ల ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం తమ వ్యాపారంపై లేదని తెలిపారు.

ఇదీ చదవండి: చైనా కంపెనీకి షాక్.. గ్లోబల్​ వైస్​ ప్రెసిడెంట్​కు ఈడీ నోటీసులు

Last Updated : Apr 14, 2022, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.